అమీర్ ఖాన్ కే టికెట్ దొరకలేదు

Update: 2017-04-23 05:57 GMT
అమీర్ ఖాన్ ఇండియాలోనే కాదు ఇంటర్నేషనల్ లో కూడా అందరి గౌరవం సంపాదించిన నటుడు అని చెప్పక తప్పదు. తను సినిమా కెరీర్ మొదటలో చేసిన సినిమాలు పక్కన పెడితే తర్వాత లగాన్ సినిమా నుండి అమీర్ ఖాన్ ప్రభావం భారత చిత్ర పరిశ్రమ మీద గొప్ప మార్పు తీసుకువచ్చింది. అతను నటించిన కొన్ని సినిమాలు  సువర్ణ అక్షరాలుతో రాయదగ్గ ఘనత నూ సాధించాయి.

చైనా లో జరుతున్న 7వ బీజింగ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో తను నటించిన దంగల్ సినిమాను స్క్రీనింగ్ చేయగా అశేష ఆధారణ లభించింది. ఆ ఫిల్మ్ ఫెస్టివల్ లో మొదటిసారి మొత్తం హాల్ అంతా నిండిపోవడం అనే షాక్.. దంగల్ సినిమా మాత్రమే ఇచ్చిందని చెప్పాలి. ఎంత క్రేజ్ తో అక్కడ జనాలు ఉన్నారు అంటే చివరికి అమీర్ ఖాన్ కు తెలిసిన వాళ్ళని పిలవడానికి  కూడా టికెట్ దొరకలేదట. ఈ స్ర్కీనింగ్ ను xxx, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్  డైరెక్టర్ రాబ్ కొహెన్ ఇంకా  చైనా టాప్ బాక్సర్ ఒలింపిక్ గోల్డ్ విన్నర్ జౌ శిమింగ్.. అలాగే బాస్కెట్ బాల్ ప్లేయర్ స్టేఫోన్ మర్బురి తో కలిసి వీక్షించారు.

ధంగాల్ సినిమా చైనా లో షుయేయ్ జియావ్ బాబా (Let's wrestle, father) పేరుతో  మే 6న దేశమంతటా విడుదలవుతోంది. అందుకోసం అక్కడ ప్రమోషన్ లో భాగంగా షాంగాయ్..  చెంగ్డు నగరాల్లో లో ప్రచారం చేయనున్నారు. చైనాలో 3 ఇడియట్స్, పి‌కే సినిమా లాతో మంచి క్రేజ్ ను మూటగట్టకున్న అమీర్.. ఇప్పుడు వ్రెజ్లింగ్ తో ఎలాంటి కలక్షన్లు కొల్లగొడతాడో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News