ఆ సినిమా ప్లాన్ తో లక్షలు కొట్టేశారు.. కానీ క్లైమాక్స్ ఏంటో తెలుసా..?
సినిమాలు, షికార్లు మానేసి కొందరు సంపాదిస్తుంటే.. సినిమాలు చూస్తున్న దొంగలు వాటిని కొట్టేస్తున్నారు. ఈ తరహా ఘటనలు ఇటీవల వరుసగా బయటపడుతుండడం గమనించాల్సిన అంశం. మొన్న తెలంగాణలో ‘భద్రమ్’ సినిమా చూసి మనుషుల ప్రాణాలూ, ఇన్సూరెన్స్ డబ్బులు నొక్కేస్తే.. నిన్న ‘బ్లఫ్ మాస్టర్’ సినిమాలోని రైస్ పుల్లింగ్ కాన్సెప్టుతో తమిళనాట రూ.26 కోట్లు మింగేశారు. రెండు రోజుల క్రితం తెలంగాణలో ‘జులాయి’ ప్లాన్ అప్లై చేసి బ్యాంకు కొట్టేస్తే.. తాజాగా.. ‘గ్యాంగ్’ సినిమా స్క్రిప్టుతో డబ్బు, బంగారం కొట్టేసే ప్లాన్ వేశారు. ఈ లేటెస్ట్ ఘటన ఢిల్లీలోని పితాంపుర ప్రాంతంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి...
పితాంపుర ప్రాంతానికి చెందిన ఓ డాక్టరును ఎంచుకున్నారు నిందితులు. మొత్తం ఐదుగురు బ్యాచ్ గా ఏర్పడి, ఆ డాక్టర్ ఇంటికి వెళ్లారు. సూటు బూటు వేసుకున్న బ్యాచ్.. తాము సీబీఐ అధికారులమంటూ హడావిడి చేశారు. కుటుంబ సభ్యుల ఫోన్లు లాగేసి, బ్లాక్ మనీ ఎక్కడ అంటూ హంగామా చేశారు. లెక్కలు చూడాలంటూ బెడ్ రూమ్, బీరువా అన్నీ గాలించి, మొత్తం రూ.36 లక్షల డబ్బు బయటకు తీశారు. బంగారం కూడా నిలువుదోపిడీ చేశారు.
అంతా సర్దుకొని, ఛలో.. మీ ఆసుపత్రిలో కూడా సోదాలు చేయాలి పదా అంటూ ముందుకు కదిలారు. డాక్టరు కారులోనే ఎక్కేసి, ఆయన డ్రైవర్ ను కమాన్ అంటూ.. తీసుకెళ్లారు. అయితే.. మనోడికి ముందునుంచే ఎక్కడో కొడుతోంది. ఇదేదో తేడాగా ఉందంటూ.. కారు మౌర్య ఎన్ క్లేవ్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకోగానే.. బ్రేక్ వేసి పోలీస్.. అంటూ మొత్తుకున్నాడు.
పరిగెత్తుకొచ్చిన పోలీసులు ముగ్గురిని పట్టుకున్నారు. వీరిని మరో వాహనంలో ఫాలో అవుతున్న మిగతా ఇద్దరు అట్నుంచి అటే జంప్ అయ్యారు. ఈ ముగ్గురిని విచారించగా.. గ్యాంగ్ సినిమా ఒరిజనల్ వర్షన్ అయిన.. అక్షయ్ కుమార్ ‘స్పెషల్26’ చూసి ఈ స్కెచ్ గీసినట్టు చెప్పారట. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇద్దరికోసం గాలింపు చేపట్టారు.
ఈ వరుస సంఘటనలు బట్టి ఏమర్థమవుతోంది..? జనాలెవరూ సినిమాలు చూడట్లేదని తెలుస్తోంది. విహారం, విలాసం కోసం కాకపోయినా.. కనీసం అవసరంకోసమైనా సినిమాలు చూడండమ్మా! రోజులు అస్సలు బాగోలేవు!