అస‌లు ఎడిటింగ్ తో ప‌ని లేని టెక్నిక్ క‌నిపెట్టిన డైరెక్ట‌ర్

Update: 2021-02-25 03:30 GMT
తొలిసారిగా బాలీవుడ్ స్టార్ కత్రినా కైఫ్.. సౌత్ సూపర్ స్టార్ విజయ్ సేతుపతి జంట‌గా న‌టిస్తున్నారు. రమేష్ తౌరానీ నిర్మిస్తున్నారు. శ్రీరామ్ రాఘవన్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. ఈ చిత్రం ఏప్రిల్ ‌లో సెట్స్ పైకి వెళుతోంది. తాజాగా మేకర్స్  టైటిల్ ‌ను లాక్ చేశారు.

ఈ చిత్రానికి `మెర్రీ క్రిస్మస్` అనే టైటిల్ ని నిర్ణ‌యించారు. ఈ సినిమా క‌థాంశం ఒక షార్ట్ ఫిల్మ్ నుండి ప్రేరణ పొంది రూపొందించారు. పూణే బ్యాక్ డ్రాప్ క‌థాంశ‌మిది. ఈ చిత్రం కుర్చీ అంచున కూచుని చూసేంత థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ర‌క్తి క‌ట్టించ‌నుంద‌ని స‌మాచారం.

అంధధున్ దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ ఏదైనా కాన్సెప్ట్ ఎంచుకుంటే  ప్రతిసారీ ఏదో ఒక ప్ర‌త్యేక‌త‌ను కొత్తదాన్ని తెర‌పైకి తీసుకువస్తారనేది అభిమానుల న‌మ్మ‌కం. ఈసారి విరామం లేకుండా వేగంగా పూర్త‌య్యే సినిమా చేయాలని ప్లాన్ చేశారు. తాజా చిత్రం గ్యాప్ లేకుండా పూర్తి చేయ‌నున్నారు. అంతేకాదు.. ఇది కేవ‌లం 90 నిమిషాల నిడివి గల చిత్రం. షూటింగ్ షెడ్యూల్ 30 రోజులు మాత్ర‌మే ఉంటుంది. కొన్ని భాగాలు ముంబైలో కూడా చిత్రీకరించ‌నున్నారు.

COVID-19 చిక్కులేవీ లేకుండా ఉండటానికి ఈ మూవీకి ఎడిటింగ్  స్క్రిప్ట్ లోనే చేసేశార‌ట‌. శ్రీరామ్ రాఘవన్ లీడ్ పెయిర్ నుండి తనకు కావాల్సిన షాట్ల గురించి ఖచ్చితంగా తెలుసు. అదనపు స్టాక్ ఫుటేజ్ ఉంచకుండా ప‌ని చేయ‌డం ఆయ‌న స్టైల్. దీనివ‌ల్ల బ‌డ్జెట్ కూడా అదుపు త‌ప్ప‌దు. ఈసారి క‌త్రిన‌- సేతుప‌తి లాంటి స్టార్ల‌తో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.
Tags:    

Similar News