30 రోజుల కోసం స్టార్ హీరోకి 8 కోట్ల పారితోషికం..?
'క్రాక్' సినిమాతో సాలిడ్ హిట్ కొట్టి ట్రాక్ లోకి వచ్చిన మాస్ మహారాజా రవితేజ మంచి దూకుడు మీదున్నాడు. ఇప్పటికే 'ఖిలాడి' చిత్రాన్ని ఫైనల్ స్టేజీకి తీసుకొచ్చిన రవితేజ.. ఉగాది పండుగ సందర్భంగా మరో కొత్త సినిమాని లాంఛనంగా ప్రారంభించాడు. కొత్త దర్శకుడు శరత్ మండవ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. 'విరాటపర్వం' ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి ఎస్.ఎల్.వి సినిమాస్ పతాకంపై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇదొక వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందే యాక్షన్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ 30 రోజుల్లో పూర్తి చేయాలని రవితేజ కండిషన్ పెట్టినట్లు టాక్ నడుస్తోంది.
మాస్ మహారాజా ఈ మూవీకి కేవలం 30 రోజులు మాత్రమే డేట్స్ ఇచ్చాడట. అందుకుగాను రవితేజ దాదాపు 8 కోట్ల వరకు పారితోషికంగా అందుకుంటున్నాడని టాక్. అలానే వైజాగ్ - నైజామ్ ఏరియా రైట్స్ లో 50 శాతం వాటా కూడా తీసుకునే విధంగా అగ్రిమెంట్ చేసుకున్నాడని ఫిలిం సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా 'క్రాక్' హిట్ తో మళ్ళీ రవితేజ మార్కెట్ బాగా పుంజుకుందని చెప్పవచ్చు. కాగా, ఇందులో రవితేజ సరసన 'మజిలీ' ఫేమ్ దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటించనుంది. త్వరలోనే ఈ సినిమాకి పనిచేసే ఇతర టెక్నీషియన్స్ నటీనటుల వివరాలు వెల్లడించనునన్నారు. ఇకపోతే రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న 'ఖిలాడి' మూవీ మే 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.