ట్రైలర్ టాక్ : 7 మర్డర్ మిస్టరీ వెనక!
చిన్న సినిమాల్లో కంటెంట్ లేదు అని విమర్శించేవాళ్లకు ఇటీవల మన ఫిలింమేకర్స్ సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పరిమిత బడ్జెట్ సినిమాల్లోనూ కంటెంట్ పరంగా ఎలాంటి కొరత లేకుండా ఎంతో జాగ్రత్త తీసుకుంటున్న వైనం కనిపిస్తోంది. తాజాగా రిలీజైన 7 ట్రైలర్ అందుకు పక్కా ఎగ్జాంపుల్. సస్పెన్స్ థ్రిల్లర్... మర్డర్ మిస్టరీ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఆద్యంతం రక్తి కట్టించనుందని ట్రైలర్ చెబుతోంది. అమ్మాయిల్ని మోసం చేసి తప్పించుకు తిరుగుతున్న నేరగాడిని వెంటాడే పోలీసాఫీసర్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో థ్రిల్స్ కి ఏమాత్రం కొదవ లేదని అర్థమవుతోంది.
నువ్విలా ఫేం హవీష్ ఈ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నారు. హవీష్ కెరియర్ లో ఇప్పటివరకూ చెప్పుకోదగ్గ హిట్ అన్నదే లేదు. ప్రఖ్యాత కె.ఎల్.యూనివర్శిటీ మేనేజింగ్ డైరెక్టర్లలో ఒకరిగా ఉన్న హవీష్ ఇప్పటికీ హీరోగా తనని తాను నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. రిలీజ్ కి రెడీ అవుతున్న సెవెన్ అతడికి చక్కని బ్రేక్ నిస్తుందని ఆసక్తిగా వేచి చూస్తున్నారు. క్రైమ్ రకరకాలుగా ఉంటుంది. మొదట పోలీసులు అనుమానించేది ఒకరిని. చివరికి ఆ క్రైమ్ చేసేది ఇంకొకరు. ఇలాంటి ట్విస్టులేవో ఈ సినిమా ఆద్యంతం ఉత్కంఠ పెంచనున్నాయని అర్థమవుతోంది. హవీష్ పాత్రలో అమాయకత్వం కనిపిస్తోంది. ఇక రెహమాన్ పోలీసాఫీసర్ గా ఎగ్రెస్సివ్ గా కనిపిస్తున్నారు. హత్యలు ట్విస్టులు ఉత్కంఠను పెంచాయి.
ఇక ఈ చిత్రంలో రొమాన్స్ కి ఏమాత్రం కొదవ లేదని అర్థమవుతోంది. నందిత, రెజీనా సహా పలువురు అందాల భామలు ఈ చిత్రంలో రొమాంటిక్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. ఇంతకీ భామలతో రొమాన్స్ చేసేది ఎవరు? హవీష్ యేనా? లేక ఇంకెవరైనానా? అన్నది తెరపైనే చూడాలి.ఇటీవల మన సినిమాల ఆర్.ఆర్ స్థాయి పెరిగింది. చిన్న సినిమాలకు ప్రామిస్సింగ్ గా రీరికార్డింగ్ ఇస్తున్నారు మన సంగీత దర్శకులు. 7 రీరికార్డింగ్ ఆకట్టుకుంది. థ్రిల్లర్లకు రీరికార్డింగ్ ప్రాముఖ్యత చాలా ఎక్కువ. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు.
Full View