ఏంటి నవీన్.. నెక్స్ట్ ఇంకా ఫిక్స్ అవ్వలేదా?

టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి.. రీసెంట్ గా అనగనగా ఒక రాజు మూవీతో వచ్చి సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.;

Update: 2026-03-11 06:50 GMT

టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి.. రీసెంట్ గా అనగనగా ఒక రాజు మూవీతో వచ్చి సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. మారి దర్శకత్వం వహించిన ఆ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించారు. అయితే థియేటర్స్ తో పాటు ఓటీటీలో ఆ మూవీ అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించిన ఆ సినిమా.. ఓటీటీలో పెద్ద ఎత్తున వ్యూస్ సొంతం చేసుకుంది.

నిజానికి అనగనగా ఒక రాజు మూవీ.. అప్పుడెప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ వివిధ కారణాలతో లేట్ అవుతూ.. సంక్రాంతికి కానుకగా థియేటర్స్ లో రిలీజ్ అయింది. అయితే ఆ సినిమా విడుదలై రెండు నెలలు కావస్తున్నా.. నవీన్ నెక్స్ట్ మూవీ ఏంటన్నది ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఎలాంటి అధికారిక ప్రకటన కూడా రాలేదు. సోషల్ మీడియాతో పాటు సినీ వర్గాల్లో రూమర్స్ కూడా వినిపించడం లేదు.

దీంతో నవీన్ ఇప్పుడేం చేస్తున్నారోనని.. అప్ కమింగ్ మూవీ ఎవరితో చేస్తారోనని అంతా ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నారు. అయితే ఎవరైనా హీరో హిట్ కొడితే.. కచ్చితంగా వెంటనే నెక్స్ట్ మూవీ అనౌన్స్మెంట్ వస్తుంది. పలువురు డైరెక్టర్లు.. తమ స్టోరీస్ ను వినిపించేందుకు ఆసక్తి చూపుతుంటారు. మంచి ఛాన్స్ అందుకుని సదరు హీరో హిట్ ట్రాక్ ను రిపీట్ చేయాలని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు.

కానీ ఇప్పుడు నవీన్ పోలిశెట్టితో సినిమా చేసేందుకు టాలీవుడ్ డైరెక్టర్స్ లో పెద్దగా ఎవరూ ముందుకు రావడం లేదని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఆయనతో మూవీ చేసి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకోవాలనే కోరిక ఉన్నా కూడా.. కాస్త ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. నవీన్ కు సూపర్ మార్కెట్ ఉన్నా.. ఒకే ఒక్క కారణంతోనే ఆగుతున్నారని తెలుస్తోంది.

అదేంటంటే.. సినిమా ప్రొడక్షన్ లో సాధారణంగా చాలా మంది హీరోలు తమ పాత్రకు సంబంధించిన విషయాలపై మాత్రమే సూచనలు ఇస్తారు. అయితే నవీన్‌ పోలిశెట్టి మాత్రం కథ, స్క్రీన్‌ ప్లే, షూటింగ్, నేరేషన్‌ తీరు వంటి అంశాల్లో ఫుల్ గా ఇన్వాల్వ్ అవుతారని ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. రీసెంట్ గా అనగనగా ఒక రాజు మూవీ విషయంలో కూడా సేమ్ అంతేనని వార్తలు వచ్చాయి.

దీంతో నవీన్ తీరు కొందరు డైరెక్టర్స్ కు నచ్చడం లేదని.. అందుకే సినిమా చేయాలని ఆసక్తి ఉన్నా.. సైలెంట్ గా ఉంటున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఏ సినిమాకు అయినా హీరో ఇచ్చే సజెషన్స్ అవసరమే అయినా.. మరీ అన్ని విషయాల్లో ఇన్వాల్వ్మెంట్ కరెక్ట్ కాదని అభిప్రాయపడుతున్నారట. అందులో నిజమెంతో తెలియకపోయినా.. టాక్ మాత్రం వినిపిస్తోంది. అందుకు బలం చేకూరేలా కొత్త చిత్రం అనౌన్స్మెంట్ కూడా రావడం లేదు. మరి అసలేం జరుగుతుందో.. నవీన్ అప్ కమింగ్ మూవీ ఏంటో.. ఎవరితో వర్క్ చేస్తారో..అనేది వేచి చూడాలి.

Tags:    

Similar News