వార్నీ.. అన్ లాక్ లో 50 సినిమాలు మొదలెట్టారట
నాలుగైదు నెలలుగా టాలీవుడ్ సన్నివేశం ఎంత దయనీయంగా మారిందో చూస్తున్నదే. కరోనా మహమ్మారీ అంతకంతకు విజృంభిస్తూ కంటికి కునుకు పట్టనీకుండా చేస్తోంది. థియేటర్లు తెరవరు.. షూటింగులు ప్రారంభం కాలేదు. టీవీ సీరియల్ షూటింగులు మినహా సినిమాల షూటింగులు నత్తనడకన సాగుతున్నాయి. ఆన్ లొకేషన్ కోవిడ్ పాజిటివ్ కేసులు పెరగడంతో భయపడి కొన్నాళ్లు షూటింగులు ఆపారు. ప్రస్తుతం కోవిడ్ విలయం నేపథ్యంలో సెట్స్ కెళ్లేవాళ్లు చాలా పరిమితంగా ఉన్నారు.
ఆర్జీవీ లాంటి వాళ్లు ఏటీటీ సినిమాల పేరుతో పరిమిత కాస్ట్ అండ్ క్రూతో బండి నడిపించేస్తుంటే ఆయన బాటలనే వెళుతున్నారు కొందరు. ఇదిలా ఉంటే అన్ లాక్ సీజన్ లో పూజా కార్యక్రమాలతో లాంచ్ అయిన సినిమాల గురించి ఆరా తీస్తే షాక్ తినే నిజం తెలిసింది. అన్ లాక్ 1.0 మొదలైనప్పటి నుంచి థియేట్రికల్ రిలీజ్ సమస్యపై ఎలాంటి ఆలోచనా లేకుండా.. వరుస పెట్టి చాలా సినిమాలు పూజా కార్యక్రమాలతో మొదలెట్టేశారు. దాదాపుగా ఓ 50 సినిమాలు వరకు మొదలయ్యాయని సినీ వర్గాలు చెబుతున్నాయి.
అయితే ఈ సంగతి తెలిసిన వారు మాత్రం .. వార్నీ.. ఈ చిన్న సినిమాలన్నీ ఎప్పటికి రిలీజవ్వాలి..! ఇప్పటికే క్యూలో ఉన్నవే రిలీజ్ ఎలా అన్నది తేలక కన్ఫ్యూజన్ లో ఉంటే ఇంతమంది సినిమాలు మొదలెట్టారా? అంటూ నోరెళ్లబెడుతున్నారు. ఒకవేళ ప్రారంభమైన వాటిలో మెజారిటీ పార్ట్ ఓటీటీ లేదా ఏటీటీ సినిమాలే అయ్యుండొచ్చన్న సందేహం వ్యక్తమవుతోంది.
ప్రపంచాన్న కోవిడ్ అట్టుడికిస్తోంది. సురక్షితమైన వ్యాక్సినో.. టీకానో వస్తే కానీ జనం థియేటర్లకు రారు. అందుకు ఇంకా నాలుగైదు నెలలు పడుతుందని చెబుతున్నారు. రష్యా వ్యాక్సిన్ రిలీజైనా నాణ్యత విషయంలో సందేహాలెన్నో. అయినా అది మనకు అందుబాటులోకొచ్చేదెపుడు? అన్నది సందిగ్ధమే. రకరకాల కన్ఫ్యూజన్స్ నడుమ థియేటర్లు.. మాల్స్ తెరుచుకునేదెపుడు? అన్న ఉత్కంఠ నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో రోజుకు 10వేల పాజిటివ్ కేసులు ఇటీవల బెంబేలెత్తించాయి. ఇలాంటప్పుడు జనం థియేటర్లకు వస్తారా? అన్నది సందిగ్ధమే.