వర్మపై నాలుగు సినిమాలు.. అందరు ఏకిపారేసేందుకేనా?

Update: 2020-07-24 10:59 GMT
రామ్‌ గోపాల్‌ వర్మ ఈమద్య కాలంలో టాలీవుడ్‌ ప్రముఖులను టార్గెట్‌ చేసి చేస్తున్న విమర్శలు కొందరు రాజకీయ ప్రముఖులను టార్గెట్‌ చేస్తున్న సినిమాల కారణంగా ఆయన్ను కూడా కొందరు టార్గెట్‌ చేసేందుకు సిద్దం అయ్యారు. ఆ సినీ మరియు రాజకీయ ప్రముఖులకు అభిమానులో లేదంటే మరెవ్వరో కాని వర్మను చీల్చి చెండాడేందుకు అంటూ సినిమాలు తీసేందుకు రెడీ అయ్యారు. వర్మ వ్యక్తిగత జీవితం అతడు ఎలా సినిమాలు తీస్తాడు బూతు సినిమాలపై అతడికి ఉన్న పిచ్చిని మేము చూపిస్తాం అంటే మేము చూపిస్తాం అంటూ నాలుగు సినిమాలతో మేకర్స్‌ రెడీ అయ్యారు.

వర్మ ‘పవర్‌ స్టార్‌’ చేస్తున్న ఈ సమయంలో ఆ సినిమాల గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. చాలా రోజుల క్రితమే జొన్నవిత్తుల తాను ఆర్జీవీ బయోపిక్‌ ను తీస్తానంటూ ప్రకటించాడు. ఆర్‌ జీ వీ అంటే రోజు గిల్లే వాడు అంటూ టైటిల్‌ ను ప్రకటించి నేడు పాటను కూడా విడుదల చేయబోతున్నారు. ఇక పవన్‌ కు అభిమానులుగా చెప్పుకుంటున్న వారు తీస్తున్న చిత్రం ‘పరాన్నజీవి’. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అయ్యింది. ఇందులో వర్మను ఓ రేంజ్‌ లో ఏకి పాయబోతున్నారు అంటూ ఇప్పటికే విడుదలైన పాట ద్వారా తెలిసి పోతుంది.

ఈ రెండు సినిమాలతో పాటు మరో రెండు సినిమాలు కూడా తెరకెక్కుతున్నాయి. డేరా బాబా మరియు వన్స్‌ అపాన్‌ ఏ టైమ్‌ ఇన్‌ టాలీవుడ్‌ ఫ్లాప్‌ డైరెక్టర్‌ ఆర్జీవీ. ఈ రెండు సినిమాలు కూడా వర్మను టార్గెట్‌ చేసి వస్తున్నవే. మొత్తానికి ఈ నాలుగు సినిమాలను వెంట వెంటనే డిజిటల్‌ ఫ్లాట్‌ ఫామ్‌ మీద విడుదల చేసి వర్మ ను ఉక్కిరి బిక్కిరి చేసే అవకాశం ఉందంటున్నారు. అయితే వర్మ మాత్రం ఈ నాలుగు సినిమాల గురించి అసలు పట్టించుకునే అవకాశం కూడా లేదు అంటున్నారు. ఆయన్ను రెచ్చగొడితే మరింత ప్రమాదం అని మాత్రం ఆయన అభిమానులు ఆ నాలుగు సినిమాలు చేస్తున్న మేకర్స్‌ ను హెచ్చరిస్తున్నారు.
Tags:    

Similar News