• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కాలు కదిపి.. మనసు...

కాలు కదిపి.. మనసు దోచేసి.. '30 కోట్ల' వ్యూస్ ను సొంతం చేసుకుంది

By - Tupaki Desk
Update: 2021-08-08 03:58 GMT
ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే టాలీవుడ్ మూవీల్లో ఒకటిగా నిలిచింది 'లవ్ స్టోరీ'. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమాను కరోనా సెకండ్ వేవ్ దారుణంగా దెబ్బ తీసింది. ఈ మూవీలో 'సారంగ దరియా' పాట ఎంత సూపర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ మాటకు వస్తే.. ఆ పాటే ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవటమే కాదు.. అంతకు మించిన గుర్తింపును తెచ్చి పెట్టింది. పాటతో సినిమాకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.

ఈ పాట విడుదలైన వెంటనే నెట్టింట్లో సంచలనంగా మారింది. పాటను యూట్యూబ్ లో రిలీజ్ చేసిన నెల రోజుల వ్యవధిలోనే 10 కోట్ల వ్యూస్ ను సొంతం చేసుకొని తిరుగులేని అధిక్యతను దూసుకెళ్లింది.అలాంటి ఈ పాటను ప్రముఖ రచయిత సుద్దాల అశోక్ తేజ రాస్తే.. దానికి హుషారైన తన గాత్రాన్ని జోడించింది మంగ్లీ. నాగచైతన్య.. సాయి పల్లవి జంటగా నటిస్తున్న ఈ మూవీకి భిన్నమైన సినిమాలు తీసే శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. హుషారైన ఈ పాట తాజాగా మరో రికార్డును తన సొంతం చేసుకుంది.

సినిమా విడుదలకు ముందే.. సారంగదరియా పాట ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకోవటంతో పాటు.. భారీ క్రేజ్ ను తెచ్చి పెట్టింది. తాజాగా ఈ పాటకు 30 కోట్ల వ్యూస్ లభించాయి. ఒక తెలుగు పాటకు ఇంతటి ఆదరణ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. భిన్నమైన ప్రేమ కథను కాన్సెప్టుగా తీసుకున్న ఈ మూవీని త్వరలో విడుదల చేయాలని భావించినా.. లాజిస్టిక్స్ విషయంలో ఉన్న ఇబ్బందులతోనే సినిమా విడుదల ఆలస్యమవుతోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా 30 కోట్ల వ్యూస్ క్లబ్ లో చేరిన సారంగదరియా మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. దక్షిణాదిలో మరే లిరికల్ వీడియో కూడా ఇన్ని కోట్ల వ్యూస్ ను సొంతం చేసుకోలేదని చెబుతున్నారు. విడుదలకు ముందే ఇన్ని సంచలనాలు నమోదైన ఈ మూవీ.. విడుదలయ్యాక మరెంత రచ్చ చేస్తుందో చూడాలి.
Tags:    
  • Sarangadariya 
  • Love Story 
  • Sai Pallavi 
  • Nagachaitanya 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

వారణాసి.. దిల్ రాజుకు పోటీగా బిగ్ డీల్?

2026-11-11 04:56 GMT

కజిన్‌పై ప్రేమను చాటుకున్న హృతిక్ రోషన్.. స్పెషల్ విషెస్!

2026-11-11 04:27 GMT

300 కోట్ల క్ల‌బ్‌లో టాప్ -5 హిందీ హీరోలు

2026-11-11 04:27 GMT

ఈ హీరోనే ఇప్పుడు బాలీవుడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియ‌న్ సూప‌ర్‌స్టార్?

2026-11-11 03:58 GMT

Bigg Boss Telugu 10: ఫ్యామిలీ వీక్ ఎమోషనల్ ఎంట్రీలు!

2026-11-11 03:57 GMT

తెలుగు మార్కెట్‌పైనే పొరుగు హీరోల ఫోక‌స్ ఎందుకు?

2026-11-11 03:57 GMT

ఈ ఏడాది తమిళ్ సినిమాల సక్సెస్ కి, కొన్ని తెలుగు సినిమాల ప్లాప్ కి కారణం ఏంటి?

2026-11-11 03:56 GMT

ఇట్లు అర్జు USA థియేటర్స్ లిస్ట్

2026-11-11 03:28 GMT

'వార‌ణాసి' త‌ర్వాత ప్రియాంక చోప్రా టాలీవుడ్‌కి బైబై

2026-11-11 01:46 GMT

బాలకృష్ణ అంటే భయపడ్డా.. ఆయన మంచితనం చూసి షాకయ్యా: సీనియర్ హీరోయిన్ సంఘవి

2026-11-11 01:45 GMT

రాజమౌళిని తిడతారా.. వారణాసిని ఆపుతారా?: ప్రకాష్ రాజ్ కామెంట్స్

2026-11-11 01:45 GMT

మాయ లేడీ సెన్సార్.. క్రేజీ క్రేజీగా హీరో గారి వేషాలు

2026-11-11 01:42 GMT

Copyright @2026

Powered by Blink CMS