2020లో ‘తెర’మరుగైన సినిమా!
‘‘తెలుుగు సినిమాా ఇండస్ట్రీ నుంచి ప్రతి యేటా సుమారు 160 నుంచి 180 సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. కానీ.. ఈ ఏడాది ఆ సంఖ్య 50 లోపే!’’ ఈ లెక్క చాలు సినీ పరిశ్రమ దుస్థితి ఏంటో చెప్పడానికి. కరోనాా కొట్టిన దెబ్బకు అన్ని రంగాలూ అతలాకుతలమైపోగా.. సినీ పరిశ్రమ మొత్తం కుదేలైపోయింది.
వేల కోట్ల రూపాయల నష్టం..
సినిమా నిర్మాణం సామాన్యమైన విషయం కాదు.. షూటింగ్ తొలిరోజు కొబ్బరి కాయ కొట్టడం సులువే.. కానీ, చివరి రోజు కొబ్బరి కాయ కొట్టడం అంత తేలిక కాదు. ఈ రెండు కాయలు కొట్టే మధ్యలో ఎన్నిసార్లు నిర్మాాత తల బద్ధలవుతుందో అతనికి మాత్రమే తెలుసు. ఎన్నో అవాంతరాలను అధిగమించి ఒక యజ్ఞం లా పూర్తి చేయాలి. పరిస్థితులన్నీ సజావుగా ఉన్నప్పుడే ఇవన్నీ. అలాంటిది కరోనా రాావడంతో పరిస్థితి ఆగమాగమైపోయింది. లాక్ డౌన్ తో షూటింగ్ లు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఫలితంగా.. నిర్మాతలు దిక్కు తోచని స్థితిలో పడిపోయారు. షూటింగ్ ఆగిపోవడం అనేది చిన్న విషయం కాదు. అప్పటికే సినిమాపై కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఉంటారు. అన్ని డబ్బులు ఇంట్లో ఉండవు కాబట్టి వడ్డీకి తేవాల్సిందే. సినిమా పూర్తి చేసి, రిలీజ్ చేస్తేనే అప్పులు తీర్చే అవకాశం ఉంటుంది. అలాంటిది.. సినిమాా మధ్యలోనే ఆగిపోవడంతో పరిస్థితి అగమ్యగోచరంగా మాారింది. కోట్లాది రూపాయలకు నిర్మాతలు వడ్డీలు కడుతూ నెట్టుకొస్తున్నారు.
సమస్తం ప్యాకప్..
కరోనా వల్ల మార్చిలో సినిమా థియేటర్లను మూసేశారు. ఆ తరవాత లాక్ డౌన్ మొదలు. ఫలితంగా షూటింగులకు పర్మనెంట్ గా ప్యాకప్ చెప్పేశారు. అప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాలు స్టోర్ రూంకే పరిమితమయ్యాయి. సమ్మర్ టార్గెట్ విడుదల కావాల్సిన సినిమాలు సైలెంట్ అయిపోయాయి. సినిమా ఇండస్ట్రీకి కాసుల పంట పండించే దసరా, దీపావళి పండగలను అలా చూస్తూ ఉండిపోవడం తప్ప, ఏమీ చేయలేకపోయారు. మార్చిలో నిలిచిపోయిన షూటింగులకు.. మళ్లీ క్లాప్ కొట్టడానికి దాదాపు ఏడు నెలలు పట్టింది. ఇక, థియేటర్లు తెరచుకోవడానికి సుదీర్ఘ విరామం తరవాత అనుమతులు వచ్చినప్పటికీ.. 50 శాతం ఆక్యుపెన్సీతో ‘కండీషన్స్ అప్లై’ అనడంతో సినిమాల్ని విడుదల చేయడానికి నిర్మాతలు ధైర్యం చేయలేకపోతున్నారు. దీంతో.. క్రిస్మస్‌కి కూడా థియేటర్లు తెరచుకునే పరిస్థితి లేదు. సంక్రాంతి సినిమాలు సైతం సమ్మర్ కు షిఫ్ట్ అయ్యే ప్రమాదం కనిపిస్తోంది.
ఆదుకున్న ఓటీటీలు..
ఇలాంటి కఠిన పరిస్థితుల్లో సినిమాా ఇండస్ట్రీకి కాస్త ఊరట ఇచ్చింది ఓటీటీ. అమేజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, జీ 5, ఆహా లాంటి ఓటీటీ ప్లాట్ ఫామ్ ల వేదికగా పలు సినిమాలు రిలీజయ్యాయి. అందులో ఎన్ని హిట్టయ్యాయి? ఎన్ని ఫట్టుమన్నాయి? అనే విషయం పక్కన పెడితే… థియేటర్లు మూతపడ్డ పరిస్థితుల్లో ఆర్థిక భారం మోయలేని నిర్మాతలను ఆదుకున్నవి ఓటీటీలే. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక ఆర్థిక భారంతో తీవ్ర అవస్థలు పడుతున్న నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేశారు. తప్పని పరిస్థితుల్లో వచ్చిన రేటుకే అమ్ముకున్నారు. అయితే.. అవకాశం దొరికింది కదా అని నిర్మాతలనేం దోచుకోలేదు. మంచి రేట్లకే సినిమాల్ని కొన్నాయి పలు ఓటీటీ సంస్థలు.
భవిష్యత్ ఏంటో..?
ఈ రోజు వరకు కూడా థియేటర్లు పూర్తిగా తెరుచుకోలేదు. కరోనా భయం పూర్తిగాా తొలిగిపోలేదు. మరోవైపు.. జనవరిలో కరోనా సెకండ్ వేవ్ మొదలయ్యే అవకాశం కూడా ఉండొచ్చనే ప్రచారం ఉంది. కాబట్టి 50 శాాతం ఆక్యుపెన్సీ నిబంధనను ప్రభుత్వం ఇప్పట్లో సడలించకపోవచ్చు. అదే జరిగితే.. సగం మంది ప్రేక్షకుల కోసం నిర్మాతలు సినిమాలను రిలీజ్ చేస్తారా? అన్నది సందేహమే. ఈ విధంగా సమీప భవిష్యత్ కూడా సినీ పరిశ్రమకు ఆశాజనకంగా కనిపించట్లేదు. ఇదే పరిస్థితి మరింత కాలం కొనసాగితే.. ఓటీటీలు, ఏటీటీల ప్రాధాన్యం మరింత పెరుగుతుంది. అప్పుడు పెద్ద సినిమాలు కూడా రిలీజ్ చేసే అవకాశం ఉండొచ్చు. జనాలైతే మెల్ల మెల్లగా ఓటీటీల్లో సినిమాలు చూడడానికి అలవాటు పడుతున్నారు. థియేటర్ కు వెళ్లి రూ.వందలూ వేలూ తగలేసుకోవడం కంటే, ఓటీటీలో సినిమాలు చూడడం మేలు అనే అభిప్రాయానికి వస్తున్నారు. ఇది మరింత బలపడితే థియేటర్లు తెరుచుకున్నా.. ఓటీటీలకు ప్రాాధాాన్యం తగ్గకపోవచ్చు. మరి, ఏం జరుగుతుందన్నదానికి కాలమే సమాధానం చెబుతుంది. ఈ విధంగా.. ఈ ఏడాది సినీ ఇండస్ట్రీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ గాయం మానడానికి చాలా సమయమే పట్టొచ్చు.