• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  30 ఏళ్ల తర్వాత చరణ్...

30 ఏళ్ల తర్వాత చరణ్ కోసం.. పెద్ద ప్లానింగే..!

| స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ మరోసారి తన మాస్ స్టామినా చూపించాలని చూస్తున్నాడు.

By - Tupaki Desk
Update: 2024-12-03 05:48 GMT

గేమ్ ఛేంజర్ రిలీజ్ తర్వాత గ్లోబల్ స్టార్ చరణ్ బుచ్చి బాబు డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ మరోసారి తన మాస్ స్టామినా చూపించాలని చూస్తున్నాడు. చరణ్ 16వ సినిమాగా రాబోతున్న ఈ మూవీ కోసం బుచ్చి బాబు ప్లానింగ్ ఒక రేంజ్ లో ఉంది. ముఖ్యంగా సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ ని కావాలని తీసుకున్నారట. డైరెక్ట్ గా తెలుగు సినిమాకు రెహమాన్ మ్యూజిక్ అందించడం చాలా అరుదు.

ఆస్కార్ అవార్డ్ విన్నర్ రెహమాన్ ఎందుకో తెలుగు సినిమాల మీద అంతగా ఆసక్తి చూపించరు. కెరీర్ స్టార్టింగ్ లో తెలుగులో 2, 3 సినిమాలు చేసిన రెహమాన్ మళ్లీ ఇన్నాళ్లకు స్ట్రైట్ తెలుగు సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. అంతేకాదు తెలుగు దర్శకులతో రెహమాన్ పనిచేసి చాలా ఏళ్లు అవుతుంది. అప్పుడెప్పుడే బి.గోపాల్ తో గ్యాంగ్ మాస్టర్ సినిమాకు చివరగా పనిచేశారు రెహమాన్. ఐతే మధ్యలో తెలుగు సినిమాలకు చేసినా అది తమిళ దర్శకులు డైరెక్ట్ చేయడం వల్లే ఆయన ఒప్పుకున్నారు.

చివరగా గౌతం మీనన్ డైరెక్షన్ లో తెరకెక్కిన సాహసం శ్వాసగా సాగిపో సినిమాకు రెహమాన్ మ్యూజిక్ అందించాడు. ఆ తర్వాత ఏ తెలుగు సినిమాకు రెహమాన్ మ్యూజిక్ ఇవ్వలేదు. ఐతే చరణ్ సినిమాకు రెహమాన్ కు స్పెషల్ గా కావాలని తీసుకున్నారు. సినిమాకు రెహమాన్ మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందని అంటున్నారు.

ఉప్పెనలో సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి కాబట్టి బుచ్చి బాబు ఆర్సీ 16వ సినిమాలో కూడా సాంగ్స్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటాడని చెప్పొచ్చు. చరణ్, జాన్వి కపూర్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో శివ రాజ్ కుమార్ కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నారు. మొత్తానికి బుచ్చి బాబు ఏదో పెద్ద ప్లానింగే వేసినట్టు అర్థమవుతుంది.

గేం ఛేంజర్ సినిమా నెక్స్ట్ సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. సినిమా రిలీజ్ అవ్వడం ఆలస్యం చరణ్ బుచ్చి సినిమాకు బల్క్ డేట్స్ ఇవ్వనున్నాడు. ఈ సినిమా తర్వాత సుకుమార్ తో చరణ్ సినిమా ఉండబోతుందని తెలిసిందే. పుష్ప తర్వాత సుకుమార్ చేసే ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఐతే సుకుమార్ చరణ్ సినిమా 2025 చివర్లో మొదలు అవుతుందని తెలుస్తుంది.

Tags:    
  • Gamechanger 
  • Ramchanger 
  • Buchibabusana 
  • Janhvikapoor 
  • Tollywood 
  • Gamechangermovie 
  • RC16movie 
  • Arrahman 

Similar News

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

Copyright @2026

Powered by Blink CMS