పెద్ది ఈవెంట్ క్లిక్ అయినట్టేనా? రెహమాన్ పై నమ్మకం పెరిగిందా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం పెద్దిపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

Update: 2026-05-24 15:00 GMT

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం పెద్దిపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న ఆ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌ గా నటిస్తున్నారు. తాజాగా ఆ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కొత్త ఊపు అందుకున్నాయి. ముఖ్యంగా భోపాల్‌ లో నిర్వహించిన పెద్ది కీ ఆవాజ్ మ్యూజికల్ ఈవెంట్ ఇప్పుడు హాట్ టాపిక్‌ గా మారింది. ఆ ఈవెంట్ తర్వాత సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయని టాక్ వినిపిస్తోంది

భారీ స్థాయిలో నిర్వహించిన ఆ కార్యక్రమానికి అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. వేలాది మంది అభిమానులు హాజరై వేడుకను విజయవంతం చేశారు. ఆ ఈవెంట్‌ లో చిత్ర బృందం పాల్గొని సందడి చేసింది. రామ్ చరణ్‌ తో పాటు జాన్వీ కపూర్, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, నటుడు దివ్యేందు శర్మ పాల్గొనడంతో కార్యక్రమానికి మరింత క్రేజ్ వచ్చింది. ముఖ్యంగా రెహమాన్ స్టేజ్‌ పై కనిపించగానే అభిమానులు ఫుల్ గా ఎంజాయ్ చేయడం ఆకట్టుకుంది.

ఆ వేడుకలో విడుదల చేసిన హల్లల్లల్లో మాస్ సాంగ్‌ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. రెహమాన్ సంగీతం, భారీ బీట్లు, మాస్ టచ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మొదట్లో ఆ సినిమాకు రెహమాన్ సంగీతం ఎలా ఉంటుందో అనే చర్చ నడిచింది. ఎందుకంటే పూర్తి స్థాయి మాస్ స్పోర్ట్స్ డ్రామాకు ఆయన స్టైల్ సెట్ అవుతుందా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ ఒక్కో సాంగ్ విడుదల అవుతున్న కొద్దీ ఆ అనుమానాలు తగ్గిపోయాయి.

ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌ కు మంచి స్పందన రావడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. అయితే ఇటీవల విడుదలైన ట్రైలర్ చూసిన తర్వాత కొంత మంది ప్రేక్షకులు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రెజెంటేషన్ విషయంలో ఆలోచనలో పడ్డారనే టాక్ వినిపించింది. అలాంటి సమయంలో మ్యూజికల్ ఈవెంట్ సినిమాకు మళ్లీ పాజిటివ్ బజ్ తీసుకొచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఆ ఈవెంట్‌ లో రెహమాన్ పెర్ఫార్మెన్స్ హైలైట్‌ గా నిలిచిందని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

అంతే కాదు రెహమాన్ ఆ సినిమాకు స్ట్రాంగ్ మ్యూజికల్ అవుట్‌ పుట్ ఇచ్చారని ఇప్పుడు ఫ్యాన్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. మాస్ బీట్లతో పాటు ఎమోషనల్ టచ్ కూడా మ్యూజిక్‌ లో కనిపిస్తోందని చెబుతున్నారు. ముఖ్యంగా స్టేడియం బ్యాక్‌ డ్రాప్‌ లో వచ్చే సన్నివేశాలకు ఆయన ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరో స్థాయి తీసుకెళ్తుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు చరణ్ లుక్, బాడీ లాంగ్వేజ్ కూడా అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

గ్రామీణ నేపథ్యం, స్పోర్ట్స్ ఎమోషన్స్, మాస్ యాక్షన్ అంశాలతో తెరకెక్కుతున్న ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ సాధించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. మొత్తంగా చూస్తే పెద్ది కీ ఆవాజ్ ఈవెంట్ సినిమాపై ఉన్న సందేహాలను కొంతవరకు తగ్గించిందనే చెప్పాలి. ముఖ్యంగా సంగీతం విషయంలో వచ్చిన పాజిటివ్ టాక్ ఇప్పుడు మూవీ టీమ్ కు పెద్ద బలంగా మారింది. విడుదలకు ముందే మ్యూజికల్ హైప్ పెరగడం సినిమాకు కలిసి వచ్చే అంశంగా కనిపిస్తోంది.

Tags:    

Similar News