ఖైదీ2లో దిల్లీకి భార్యగా ఆ స్టార్ హీరోయిన్?
కార్తీ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఖైదీ సినిమా ఎంత పెద్ద హిట్టైందో తెలిసిందే.;
కార్తీ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఖైదీ సినిమా ఎంత పెద్ద హిట్టైందో తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్ గా ఖైదీ2 రాబోతుండగా, ఆల్రెడీ ఆ మూవీ కోసం ఆడియన్స్ ఎంతో ఎగ్జైటెడ్ గా ఉన్నారు. అయితే ఖైదీ2 లో సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి నటించే అవకాశాలున్నట్టు వార్తలు వస్తుండటంతో ఖైదీ2 పై ఉన్న అంచనాలు ఇంకాస్త పెరిగాయి.
అనుష్క ఖైదీ2 లో నటిస్తుందని వార్త అలా వచ్చిందో లేదో వెంటనే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. ఖైదీ2లో అనుష్క దిల్లీ భార్యగా మరింత పవర్‌ఫుల్ రోల్ లో నటించనుందనే వార్త ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇన్ని వార్తలొస్తున్నప్పటికీ ఈ విషయంలో నిర్మాతల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా వచ్చింది లేదు.
కాబట్టి ఖైదీ2లో అనుష్క నటిస్తుందనే వార్త ఇప్పటికైతే కేవలం ఊహాగానాలు మాత్రమే. ఖైదీ2లో అనుష్క క్యారెక్టర్ చాలా స్పెషల్ గా ఉండటంతో పాటూ, ఆ క్యారెక్టర్ కేవలం సపోర్టింగ్ రోల్ లా ఉండదని మొదట్లో వార్త రాగా, తర్వాత ఆ న్యూస్ వైరలైంది. అనుష్క మాత్రమే కాదు, ఖైదీ2లో మరికొన్ని క్యామియోలు కూడా ఆడియన్స్ ను ఆశ్చర్యపరచనున్నట్టు తెలుస్తున్నాయి.
లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఖైదీ2 సినిమాలో విక్రమ్, రోలెక్స్ గా కమల్ హాసన్, సూర్య కూడా జతకట్టే అవకాశాలున్నట్టు టాక్ వినిపిస్తోంది. నిజంగానే వీరంతా ఖైదీ2 లో నటిస్తే ఈ సినిమా సౌత్ ఇండియన్ సినిమాలోనే అతి పెద్ద సినిమాగా మారే అవకాశముంది. అయితే అనుష్క, కార్తీ కలిసి స్క్రీన్ ను షేర్ చేసుకోవడం ఇది మొదటిసారేం కాదు.
గతంలో వీరిద్దరూ కలిసి అలెక్స్ పాండియన్ లో నటించారు. ఆ తర్వాత కార్తీ నటించిన శకుని, ఊపిరి సినిమాల్లో అనుష్క స్పెషల్ క్యామియో చేశారు. ఇప్పుడు ఖైదీ2లో వీరిద్దరూ కలిసి నటిస్తే అది సినిమాకు మంచి హైప్ ను తీసుకురాగలదు. అయితే అనుష్క ఖైదీ2 చేస్తున్నారా లేదా అనేది మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు క్లారిటీ రాదు. అనుష్క ఖైదీ2 చేసినా చేయకపోయినా ఆమె కెరీర్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఘాటి చేస్తున్న అనుష్క ఆ సినిమాను జులై 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ గా రాబోతున్న ఈ సినిమాలో అనుష్క క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుందని ఆల్రెడీ రిలీజైన టీజర్ చూస్తుంటే తెలుస్తోంది. ఘాటితో పాటూ మలయాళ సినిమా కథనర్ లో కూడా అనుష్క ఓ కీలక పాత్ర చేస్తున్నారు.