అనుష్క ఫస్ట్ లవ్ అతడే..
ఇదిలా ఉండగా, అనుష్క తన వ్యక్తిగత జీవితంలో అరుదుగా స్పందిస్తుంటుంది. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో తన ఫస్ట్ లవ్ గురించి చెప్పింది.;
టాలీవుడ్‌లో సెన్సిబుల్ పెర్ఫార్మెన్స్, స్ట్రాంగ్ ఫీమేల్ రోల్స్‌తో సత్తా చాటిన నటి అనుష్క శెట్టి. బాహుబలి తర్వాత ఆమె క్రేజ్ దేశవ్యాప్తంగా విస్తరించింది. అంతకుముందే ‘అరుంధతి’, ‘వేదం’, ‘భాగమతి’ వంటి చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనుష్క.. బాహుబలి తర్వాత తన సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్త వహిస్తోంది. కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉండి కంటెంట్‌కి ప్రాధాన్యతనిచ్చే కథలే ఎంచుకుంటోంది.
వాస్తవానికి అనుష్క లాంటి స్టార్ హీరోయిన్, క్రేజ్ ఉన్న సమయంలో వరుస సినిమాలు చేయవచ్చు. కానీ ఆమె మాత్రం స్క్రిప్ట్‌కి న్యాయం చేయగల పాత్రలకే ఓకే చెబుతోంది. అందుకే గత కొన్నేళ్లలో ఆమె చేసిన సినిమాల సంఖ్య తక్కువైనా, ప్రతి ప్రాజెక్ట్ ప్రత్యేకంగా నిలిచింది. ఇటీవలే పూర్తయిన ‘ఘాటీ’ సినిమా కూడా వైవిధ్యభరితమైన కథతో రూపొందినట్లు సమాచారం. ఇది విడుదలకు సిద్ధంగా ఉంది.
ఇదిలా ఉండగా, అనుష్క తన వ్యక్తిగత జీవితంలో అరుదుగా స్పందిస్తుంటుంది. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో తన ఫస్ట్ లవ్ గురించి చెప్పింది. ఇక ఇప్పుడు అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “ఆరో తరగతి చదువుతున్నప్పుడు మా క్లాస్‌లో ఓ బాలుడు వచ్చి నాకు ‘ఐ లవ్ యూ’ అన్నాడు. అప్పుడు ఆ మాట అర్థం కాకపోయినా, ఏదో కొత్త ఫీలింగ్ కలిగింది. నేనూ సరిగ్గా తెలియకపోయినా ‘ఓకే’ చెప్పాను. అది చిన్న విషయమే కానీ, ఇప్పటికీ ఆ జ్ఞాపకం మధురంగా మిగిలిపోయింది” అంటూ అనుష్క చెప్పిన ఈ విషయంపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.
ఈ మాటలతో అనుష్కలోని అమాయకత్వం, నిజాయితీ బయటపడింది. స్టార్ స్టేటస్ ఉన్నప్పటికీ చిన్నప్పటి ప్రేమ జ్ఞాపకాన్ని ఈ విధంగా పంచుకోవడం అభిమానులకు ఆసక్తికరంగా అనిపించింది. “అనుష్క ఎప్పటికీ పాజిటివ్ పర్సనాలిటీ” అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఆమె నటించిన 'ఘాటీ' సినిమాపై బాగానే అంచనాలున్నాయి.
ఇది ఆమె నటనకు మరో సవాల్‌గా మారనుందని తెలుస్తోంది. గతంలో ‘నిశ్శబ్దం’లో మ్యూట్ క్యారెక్టర్‌లో నటించి విమర్శకుల ప్రశంసలు పొందిన అనుష్క, ఈసారి ‘ఘాటీ’లో మరో డిఫరెంట్ షేడ్ చూపించబోతున్నట్లు చిత్రబృందం అంటోంది. ఈ సినిమా విడుదల తర్వాత ఆమె తదుపరి ప్రాజెక్ట్‌లు కూడా క్రమంగా ప్రకటించే అవకాశం ఉంది.