అనుష్క విడ్డూరం విన్నారా?
`బాహుబలి` రెండు భాగాలు పాన్ ఇండియాలో ఎంత పెద్ద విజయం సాధించాయో తెలిసిందే. ఆ విజయాల్ని టీమ్ అంతా ఎంత గొప్పగా ఎంజాయ్ చేసారో కూడా తెలిసిందే.;
`బాహుబలి` రెండు భాగాలు పాన్ ఇండియాలో ఎంత పెద్ద విజయం సాధించాయో తెలిసిందే. ఆ విజయాల్ని టీమ్ అంతా ఎంత గొప్పగా ఎంజాయ్ చేసారో కూడా తెలిసిందే. రాజమౌళి, ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, చిత్ర నిర్మాతలు ఇలా టీమ్ అంతా ఆ విజయాన్ని ఎంతగానో ఆస్వాదించారు. టాలీవుడ్ నుంచి రిలీజ్ అయిన తొలి పాన్ ఇండియా సక్సెస్ అవ్వడంతో చిత్రబృందం ఆనందానికి అవదుల్లేవ్. దేశ విదేశాల్లోనూ ఆ సినిమాకు ప్రత్యేకమైన గుర్తింపు దక్కింది. బాక్సాఫీస్ వద్ద 2000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డులు సృష్టించింది.
రీ- రిలీజ్ తో ఎంజాయ్ చేస్తా:
ఇంత గొప్ప సక్సెస్ ని టీమ్ అంతా ఎంతో గొప్పగా ఆస్వాదించారు. అయితే ఇదే సినిమా సక్సెస్ ని తాను ఎంత మాత్రం ఆస్వాదించలేదని షాక్ ఇచ్చింది అనుష్క శెట్టి. రెండు భాగాల్లోనూ అనుష్క నటించిన సంగతి తెలిసిందే. ఒక భాగంలో ప్రభాస్ కు భార్యగా, మరో భాగంలో ప్రభాస్ కు తల్లి పాత్రలో నటించింది ప్రేక్షకుల్ని అలరించింది. కానీ ఈ సినిమా విజయాన్ని మాత్రం తాను మనస్పూర్తిగా ఆస్వాదించలేకపోయానన్నారు. కానీ ఆసక్సెస్ ని మాత్రం 2025లో ఆస్వాదిస్తానంటోంది.
చేతిలో కావాల్సినంత సమయం:
అవును `బాహుబలి` రెండు భాగాలు ఒకే భాగంగా `ది ఎపిక్` పేరుతో అక్టోబర్ 31న రిలీజ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈసారి మాత్రం సినిమా చూసి బాగా ఎంజాయ్ చేస్తానంది. మరి ఏ కారణంగా ఎంజాయ్ చేయలేకోయిందంటే? ఓ ప్రత్యేక కారణం చెప్పుకొచ్చింది. `బాహుబలి` రిలీజ్ సమయంలో ప్రచార కార్యక్రమాలు..ఇతర పనులు ఎక్కువగా ఉండటంతో మనస్పూర్తిగా ఆస్వాదనపై దృష్టి పెట్టలేకపోయానంది. ఇప్పుడు చేతిలో కావాల్సినంత తీరిక సమయం ఉండటంతో ఈసారి అంతకు మించి ఎంజాయ్ చేస్తానంది.
ది ఎపిక్ కి అనుష్క రివ్యూ:
నిర్మాత శోభు ఈ విషయం చెప్పిన తర్వాత తానెంతో ఎగ్జైట్ మెంట్ కు గురైనట్లు తెలిపింది. అందుకే ఈసారి `బాహుబలి` చూసి తనివితీరా ఆస్వాదిస్తానంది. ఎంజాయ్ చేయడమే కాదు. ఆ సినిమాకు తన రేంటిగ్ కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేయాలంటూ అభిమానులు అడుగుతున్నారు. తన రివ్యూ ఏంటి? అన్నది అప్పుడే ఇచ్చేసామని..ఈసారి అనుష్క వంతు అంటూ పోస్టులు పెడుతున్నారు. బాహుబలి ది ఎపిక్ కి కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని అంచనాలున్నాయి.