అతడితో అనుష్క స్నేహానికే పెద్ద పీట!
ప్రభాస్-అనుష్క స్నేహం గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరు కలిసి ఎన్నో సినిమాలు చేసారు.;
ప్రభాస్-అనుష్క స్నేహం గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరు కలిసి ఎన్నో సినిమాలు చేసారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. ఆ స్నేహంతోనే వాళ్లిద్దరుప్రేమికులు అయ్యారా? పెళ్లి చేసుకుంటున్నారా? అన్న ప్రచారం కూడా జరిగింది. కానీ అందులో ఎంత మాత్రం నిజం లేదు. ఇద్దరు కేవలం ఓ మంచి స్నేహితులు మాత్రమే. స్నేహితులుగా మొదలైన వారి ప్రయాణం ఇప్పుడు ఎంతో గొప్పగా సాగుతోంది. ప్రస్తుతం కలిసి నటించ కపోయినా? వారి మధ్య స్నేహం మాత్రం అంతే పదిలంగా ఉంది. ప్రభాస్ కు మంచి పిల్ల దొరకాలని, ఆ పిల్లని తానే పెళ్లి కూతుర్ని కూడా చేయాలని అనుష్క ఆశపడుతుంది. అంత గొప్ప స్నేహం వారి మధ్య ఉంది.
తాజాగా ఓ టీవీ షోలో మీకు ప్రభాస్ తో స్నేహం కావాలా? అతడితో నటించడం కావాలా? అని అడిగితే అనుష్క ఏమని సమాధానం చెప్పిందో తెలుసా? అతడితో తనకు జీవితాంతం కేవలం స్నేహం మాత్రమే కావాలని, నటించడం అన్నది తాను కోరుకోవడం లేదని, కోరుకోనని కూడా చెప్పింది. ఇద్దరి మనస్తత్వాలు ఒకేలా ఉండటంతో తనకి బెస్ట్ ప్రెండ్ లా మారిపోయాడు అంది. ఒకసారి తనతో స్నేహం కుదిరితే జీవితాంతం ఆ అనుబంధం అలా గుర్తుండిపోతుంది. మనుషులకు, బంధాలకు అంత విలువనిచ్చే ప్రభాస్ వ్యక్తిత్వం తనకు ఎంతో నచ్చుతుందన్నారు.
తనతో కలిసి నటించడానికి తానెప్పుడు కంపర్ట్ గానే ఫీలవుతానంది. వెండి తెరపై కొన్ని జోడీలకు ప్రత్యేకమైన అభిమానులుంటారు. తనది ప్రభాస్ ది అలాంటి జోడీనే అన్నారు. అనుష్క-ప్రభాస్ జంటగా నటించిన 'మిర్చి' బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. అంతకు ముందు 'బిల్లా' అనే యాక్షన్ సినిమాలోనూ నటించి మెప్పించారు. ఆ తర్వాత 'బాహుబలి' ప్రాంచైజీలోనూ నటించారు. ఈ సినిమాతో ఏకంగా పాన్ ఇండియాలోనే ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత జోడీ మరోసారి కలిసి నటించే ఛాన్స్ తీసుకోలేదు. ప్రభాస్ `బాహుబలి` తర్వాత పాన్ ఇండియా స్టార్ కావడంతో? ఇతర హీరోయిన్లతోనే పని చేస్తున్నాడు.
దర్శకులు కూడా అనుష్క -ప్రభాస్ లను కలిపే ప్రయత్నాలు చేయలేదు. 'కల్కి 2' నుంచి దీపికా పదుకొణే తప్పుకోవడంతో ఆ స్థానంలోకి అనుష్కను తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది.మరి అది సాధ్యమ వుతుందా? లేదా? అన్నది చూడాలి. ఇద్దరు కలిసి మరో సినిమా చేయాలని అభిమానులైతే బలంగా కోరుకుంటున్నారు. 'బాహుబలి' రిలీజ్ నుంచి డార్లింగ్ కి ఎన్నో రిక్వెస్ట్ లు వెళ్లాయి. కానీ ప్రభాస్ మాత్రం వాటిని సీరియస్ గా తీసుకోవడం లేదు. అనుష్క మాత్రం వేర్వేరు ప్రాజెక్ట్ లు చేసింది. కానీ అవేవి కూడా ఆశించిన ఫలితాలు సాధించలేదు. చివరిగా `ఘాటీ` తో ప్రేక్షకుల ముందుకొచ్చినా? నిరాశ పరిచిన సంగతి తెలిసిందే.