అజ్ఞాతంలో అనుష్క.. ఇప్పటికైనా బయటకు వస్తుందా?
అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ నటించిన తాజా మూవీ ఘాటీ.. ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉంది.;
అనుష్క శెట్టి.. సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా దాదాపు రెండు దశాబ్దాలుగా తన హవా కొనసాగిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. ఈ మధ్యకాలంలో కాస్త స్లో అయింది అని చెప్పుకోవచ్చు. ఈ హీరోయిన్ ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాల్లో నటించింది.హీరోలతో రొమాన్స్ చేయడమే కాదు ఎన్నో లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి లేడీ ఓరియంటెడ్ మూవీస్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. అలా అనుష్క కెరీర్ లో అరుంధతి,భాగమతి వంటి సినిమాలతో పాటు బాహుబలి వంటి పాన్ ఇండియా మూవీలో దేవసేన వంటి పవర్ ఫుల్ రోల్ పోషించి అందర్నీ ఆకట్టుకుంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ నటించిన తాజా మూవీ ఘాటీ.. ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉంది.
ఈ నేపథ్యంలోనే అందరి చూపు అనుష్క మీదే ఉంది. ఎందుకంటే అనుష్క చివరిగా నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా తర్వాత ఎక్కడ కనిపించలేదు. అఘాతంలో ఉండిపోయింది అనే వార్తలు కూడా వినిపించాయి. మరి ఇప్పుడు తాను నటించిన ఘాటీ మూవీ కోసం అయినా బయటికి వచ్చి ప్రమోషన్స్ చేస్తుందా? లేదా? అని చాలామంది మాట్లాడుకుంటున్నారు. మరి అనుష్క ఘాటీ మూవీ కోసం బయటికి వస్తుందా లేదా అనేది తెలుసుకుందాం.
అనుష్క ప్రధాన పాత్రలో నటించిన తాజా మూవీ ఘాటీ.. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా లేడీ ఓరియంటెడ్ మూవీగా తెరకెక్కిన సంగతి మనకు తెలిసిందే. ఇందులో అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించగా.. విక్రమ్ ప్రభు, రమ్యకృష్ణ, జగపతి బాబు, చైతన్య రావు వంటి వాళ్లు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. అయితే మరో 10 రోజుల్లో విడుదలకు సిద్ధంగా ఉన్న ఘాటీ మూవీ కోసం అనుష్క బయటకి వస్తుందా? అనేది చాలామంది అభిమానుల మైండ్ లో మెదులుతున్న ప్రశ్న.. యు.వి. క్రియేషన్స్ బ్యానర్ లో అనుష్క శెట్టి నటించిన ఘాటి మూవీ యాక్షన్ క్రైమ్ జానర్ లో తెరకెక్కుతోంది. సెప్టెంబర్ 5వ తేదీన భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ ను అటు డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి మొదలుపెట్టేశారు. మరి అనుష్క ఎప్పుడు ప్రమోషన్స్ కి హాజరవుతుందో చూడాలి.
అనుష్క శెట్టి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా తర్వాత చాలా రోజులకి వస్తున్న సినిమా కాబట్టి సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అలాగే ఈ సినిమా ఇప్పటికే ఏప్రిల్ 18,జూలై 11,ఆగస్టు 6 ఇలా ఎన్నోసార్లు రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకొని ఆ తర్వాత వాయిదా వేసుకుంది. ఇప్పుడు ఎట్టకేలకు సెప్టెంబర్ 5న విడుదల చేయడానికి అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే అనుష్క శెట్టి పైనే అందరి ఫోకస్ ఉంది. మరి అభిమానుల కోరిక మేరకు ఘాటీ మూవీ కోసం అనుష్క బయటికి వచ్చి ప్రమోషన్స్ చేస్తుందా అనేది చూడాలి.