అరుంధతికి మించి.. శీలావతి పాత్ర పై అనుష్క క్లారిటీ!

ఘాటి సినిమాలో శీలావతి క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి పాత్రలో నేను ఇప్పటివరకు నటించలేదు.. ఈ పాత్రలో ఎన్నో అద్భుతమైన షేడ్స్ ఉన్నాయి.;

Update: 2025-09-03 19:13 GMT

చాలా రోజుల తర్వాత అనుష్క, క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్లో రాబోతున్న ఘాటి మూవీతో మన ముందుకు రాబోతోంది.. ఈ సినిమా సెప్టెంబర్ 5న అంటే మరి కొద్ది గంటల్లో విడుదలకు సిద్ధంగా ఉండడంతో సినిమాకి సంబంధించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు అనుష్క శెట్టి.తాజాగా విలేకరుల సమావేశంలో ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు అనుష్క. అలాగే ఘాటి మూవీలో చేసిన శీలావతి పాత్ర నా సినీ కెరియర్ లో ఎప్పటికీ గుర్తిండిపోతుందని,ఘాటి మూవీని థియేటర్లో చూసే ప్రేక్షకులకు గ్రేట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అంటూ అనుష్కశెట్టి చెప్పుకొచ్చింది..

యాక్షన్ అడ్వెంచరస్ జానర్లో వస్తున్న ఘాటి లాంటి మూవీ చేయడం మీకెలా అనిపిస్తుంది.?

ఘాటి సినిమాలో శీలావతి క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి పాత్రలో నేను ఇప్పటివరకు నటించలేదు.. ఈ పాత్రలో ఎన్నో అద్భుతమైన షేడ్స్ ఉన్నాయి. ఈ సినిమా కోసం నా కంఫర్ట్ జోన్ కూడా దాటేసాను. నేను ఇప్పటివరకు అరుంధతి, బాహుబలి,రుద్రమదేవి, భాగమతి వంటి సినిమాల్లో పవర్ ఫుల్ రోల్స్ చేశాను. వీటిలాగే ఘాటి మూవీలో శీలావతి క్యారెక్టర్ కూడా ఉంటుంది.. ఒక మహిళ సింపుల్ గా కనిపిస్తున్నప్పప్పటికీ పరిస్థితుల ప్రభావం వల్ల ఒక బలమైన పిల్లర్ లాగా నిలబడుతుంది.. మహిళల్లో ఉండే గొప్ప క్వాలిటీ ఇదే.. క్రిష్ గారు నాకు శీలావతి అనే పవర్ఫుల్ రోల్ ఇచ్చారు.

ఘాటి స్టోరీ వినగానే మీ రియాక్షన్.?

డైరెక్టర్ క్రిష్ గారు..రైటర్ శ్రీనివాస్ గారు.. ఈ సినిమా స్టోరీ చెప్పినప్పుడు అందులో ఉండే కల్చర్ నన్ను అట్రాక్ట్ చేయడమే కాకుండా ఆసక్తిగా అనిపించింది. అలాగే లొకేషన్స్ కి వెళ్లి చూసిన తర్వాత నేను కొత్త కల్చర్ ని,విజువల్స్ ని ఆడియన్స్ కి చూపించబోతున్నాను. కొత్త క్యారెక్టర్ లో నటించబోతున్నాననే ఎక్సైట్మెంట్ మరింత పెరిగింది.

వేదం మూవీలా ఘాటి అంచనాలను అందుకుంటుందా.?

వేదం మూవీలో నేను సరోజ పాత్రలో నటించా. ఈ సినిమాకి కొనసాగింపుగానే మరో మూవీ కూడా చేద్దాం అనుకున్నాం. కానీ ఆర్గానిక్ గా వేరే ఏదైనా స్టోరీ ఉంటే బాగుండని వెయిట్ చేసాం.. ఆ టైంలోనే క్రిష్ గారు నాకు ఘాటి మూవీ స్టోరీ చెప్పారు.. క్రిష్ గారు నాకు ప్రతిసారి అద్భుతమైన పాత్రలు ఇస్తున్నారు. అందుకు ఆయనకు కృతజ్ఞతలు.. ఘాటి మూవీలో చేసే శీలావతి పాత్ర నా ఫిల్మోగ్రఫీలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

ఘాటి మూవీలోని గంజాయి ఎలిమెంట్ ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది.?

డైరెక్టర్ క్రిష్ గారు ఎప్పుడూ కూడా సోషల్ మీడియాలో రిలవెంట్ గా ఉండే స్టోరీలనే ఎంపిక చేసుకుంటారు.. మేము ఈ సినిమాని యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ గానే తెరకెక్కించాం. సమాజంలో ఉండే సీరియస్ ఇష్యూ ఇది.. కానీ ఈ సినిమా కథలో ఒక మంచి సందేశం పాజిటివ్ వే లో ఉంటుంది.

షూటింగ్లో లొకేషన్ లో మిమ్మల్ని చూడడానికి అభిమానులు వచ్చారా..?

అరుంధతి సినిమా నుండి మొదలు ఇప్పటివరకు వాళ్ళ సినిమాల్లో పవర్ ఫుల్ రోల్స్ ఇచ్చిన ప్రతి ఒక్క దర్శక నిర్మాత కి నేను కృతజ్ఞురాలి గానే ఉంటారు.. అలాగే రాజమౌళి గారు తీసిన బాహుబలి మూవీని అద్భుతంగా ప్రజెంట్ చేయడం వల్లే అది అన్ని వైపులా అభిమానులను రీచ్ అయింది.. మంచి చేస్తే ప్రపంచంలో ఉన్న నలుమూలల నుండి గుర్తింపు దొరుకుతుంది..

షూటింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది.?

నేను ఇప్పటివరకు చాలా సినిమాల్లో నటించాను. అన్ని సినిమాల్లో కూడా హార్డ్ వర్క్ చేశాను.. ఇక ఘాటీ మూవీలో ఫిజికల్ హార్డ్ వర్క్ ఎక్కువగా ఉంది.. అయినప్పటికీ కొత్త కొత్త లొకేషన్స్ లో షూటింగ్ చేయడం వల్ల చాలా ఆసక్తిగా అనిపించింది. అందుకే ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా కష్టం అనిపించలేదు.ఇక షూటింగ్ మొత్తాన్ని క్రిష్ గారు ముందే ప్లాన్ చేసి పెట్టుకున్నారు.. కొత్త కొత్త లొకేషన్లను సందర్శించడం అక్కడ షూట్ చేయడం ఎప్పటికీ గుర్తుండిపోయే అనుభూతి..

ఘాటి నిర్మాతల పై మీ అభిప్రాయం?

నేను మొదట యూవీ క్రియేషన్స్ కి, రాజీవ్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పాలి.. ఎందుకంటే ఇలాంటి ఒక డిఫరెంట్ మూవీ ఫై నమ్మకం పెట్టుకొని ఇంత అద్భుతంగా సినిమాను తెరకెక్కించినందుకు థాంక్స్..

డి.ఓ.పి గురించి మీ అభిప్రాయం.?

డి.ఓ.పి మనోజ్ కెమెరా వర్క్, సాగర్ మ్యూజిక్ ఈ రెండు కూడా సినిమాలో ఒక కొత్తదనాన్ని తీసుకొచ్చాయి. డైరెక్టర్ ఈ సినిమా కోసం మూడు సాంగ్స్ రాశారు. ఆయన చిన్న చిన్న మాటలతోనే కథలో ఉన్న డెప్త్ ని బయటికి తీసుకొస్తారు. క్రిష్ గారు రాసిన పాటలో కుందేటి చుక్క అనే పాట లోని పదప్రయోగం నాకు చాలా నచ్చింది.

విక్రమ్ ప్రభు గారితో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది.?

విక్రమ్ ప్రభు గారు నాకు ముందునుండే తెలుసు కాబట్టి ఆయనతో నేను కంఫర్ట్ గా నటించాను. అలాగే దేశీరాజు పాత్ర కోసం విక్రమ్ ప్రభు గారు పర్ఫెక్ట్ ఛాయిస్.. ఆయన నటించిన కుమ్కీ సినిమా నాకు ఎంతగానో ఇష్టం.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండరు.. ఖాళీ టైంలో ఏం చేస్తారు.?

ఖాళీ టైం దొరికితే మూవీస్ ఎక్కువ చూస్తాను.అలాగే ట్రావెలింగ్ కూడా చేస్తాను.. ప్రస్తుతం మహాభారతం చదువుతున్నాను.. అలాగే రెండు సంవత్సరాల నుండి ఫ్యామిలీతో గడుపుతున్నా.

కొత్త సినిమా కథలు వింటున్నారా..?

కొత్త సినిమా స్టోరీలు వింటున్నాను. మంచి కథ దొరికితే కచ్చితంగా నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇస్తాను. ప్రస్తుతం మలయాళంలో ఓ సినిమా చేస్తున్నా. ఇదే నా మొట్టమొదటి మలయాళ ఫిల్మ్.. ఇక త్వరలోనే తెలుగులో ఓ కొత్త సినిమా అప్డేట్ కూడా ఇస్తాను..

మీ డ్రీమ్ రోల్ ఏదైనా ఉందా..?

నాకు అవుట్ అండ్ అవుట్ నెగిటివ్ పాత్రలో నటించాలని ఉంది.. బలమైన నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర దొరికితే ఖచ్చితంగా నటిస్తా..

Tags:    

Similar News