పాదాలపై పడి నమస్కరించేంత గొప్ప నటుడా?
సినిమా వేడుకల్లో కొన్నిసార్లు వింతైన సన్నివేశాలు ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. అలాంటి ఒక వింతైన సన్నివేశం ఇటీవల `జుగ్నుమా` సినిమా ప్రమోషన్స్ లో ఎదురైంది;
సినిమా వేడుకల్లో కొన్నిసార్లు వింతైన సన్నివేశాలు ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. అలాంటి ఒక వింతైన సన్నివేశం ఇటీవల `జుగ్నుమా` సినిమా ప్రమోషన్స్ లో ఎదురైంది. అక్కడ అప్పటికే సీనియర్ నటుడు మనోజ్ భాజ్ పాయ్ వేచి చూస్తున్నారు. అతిథులంతా వచ్చి వెళుతున్నారు. ఇంతలోనే ఓ ముగ్గురు వచ్చారు. ఆ ముగ్గురూ ఇండస్ట్రీలో ప్రముఖులే. కానీ మనోజ్ భాజ్ పాయ్ పాదలపై పడ్డారు. నమస్కరించారు.. ఆప్యాయంగా కౌగిలించుకుని మాట్లాడారు.
ఆ దృశ్యం చూస్తున్నంత సేపు ఇతరులకు వినోదాన్ని పంచింది. కానీ అది ఒక ఎమోషనల్ ఘట్టం. ఒక సీనియర్ నటుడిని, జాతీయ ఉత్తమ నటుడిని గౌరవించుకోవడానికి ఇంతకంటే గొప్ప అవకాశం మరొకటి లేదు. అందుకే ఈ అవకాశాన్ని తాను సద్వినియోగం చేసుకున్నానని చెబుతున్నారు అనురాగ్ కశ్యప్. దర్శకరచయితగా అనురాగ్ చాలా కాలంగా మనోజ్ భాజ్ పాయ్ కి సుపరిచితుడు. ఆర్జీవీ సత్య సినిమా కోసం కలిసి పని చేసారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్యా అనుబంధం పెరుగుతూనే ఉంది. ఇటీవల మనోజ్ భాజ్ పాయ్ నటించిన `జుగ్నుమా` ప్రచార వేదికపై అనురాగ్ తన సహచరులు జైదీప్ అహ్లవత్, విజయ్ వర్మలతో కలిసి కనిపించాడు. ఆరోజు మనోజ్ భాజ్ పాయ్ పాదాలపై ఎందుకు పడ్డాడో కూడా వెల్లడించాడు.
అతడు నాకంటే పదేళ్లు సీనియర్ కానీ పది రెట్లు ఫిట్ గా ఉన్నాడు. మరో అనీల్ కపూర్ లా ఉన్నాడు.. అంటూ పొగిడేసిన అనురాగ్.. తమ మధ్య అనుబంధం గురించి వివరించిన తీరు అహూతులను ఆకట్టుకుంది. బాజ్‌పేయి అవిశ్రాంతంగా పని చేస్తారు. అతడి నీతి సంస్కారం, ఫిట్‌నెస్ ప్రతిదీ గౌరవానికి అర్హమైనవి.. అని కూడా అనురాగ్ అన్నారు.
జైదీప్, విజయ్, కుమార్ లతో నేను చాలా కాలం తర్వాత అకస్మాత్తుగా కలిశాను. మేం మనోజ్ పాదాలను తాకాం. అతడు అన్ స్టాపబుల్. వరుస సినిమాలతో ముందుకు సాగుతున్నాడు. ఇన్‌స్పెక్టర్ జెండే ఇటీవల విడుదలైంది.. తరవాత జుగ్నుమా తో వచ్చాడు. ఇతడు ఇలా ఎలా వరసగా సినిమాలు చేయగలడు? నాకంటే పది రెట్లు పెద్దవాడు కానీ పది రెట్లు ఫిట్‌గా ఉన్నాడు. అతడు మరొక అనిల్ కపూర్ లాంటివాడు. అందుకే అతడు ఒక లెజెండ్! అంటూ పొగిడేసాడు అనురాగ్. ఆ ముగ్గురూ పాదాలను తాకాలని చూసినప్పుడు మనోజ్ భాజ్ పాయ్ స్వేచ్ఛగా తిరగడానికి ప్రయత్నించాడు.. ఆ ఎగ్జయిటింగ్ మూవ్‌మెంట్ కి సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో అభిమానుల హృదయలను గెలుచుకుంది.
అనురాగ్ కశ్యప్ ఇటీవల ముంబైని తట్టుకోలేక బెంగళూరుకు షిఫ్టయ్యాడు. ప్రస్తుతం సౌత్ సినిమాల్లో నటిస్తున్నాడు. అతడు దర్శకత్వం వహించిన `నిషాంచి` సెప్టెంబర్ 19న విడుదలై విమర్శకుల నుండి సానుకూల సమీక్షలను అందుకుంది. తదుపరి తెలుగు సినిమా `డెకాయిట్: ఎ లవ్ స్టోరీ`లో అనురాగ్ కనిపించనున్నారు. షానియల్ డియో దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అడివి శేష్ కథానాయకుడు. డిసెంబర్ 25న థియేటర్లలోకి రానుంది.