• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  దర్శకుడి లవ్ స్టోరీ.....

దర్శకుడి లవ్ స్టోరీ.. అచ్చం విశ్వనాథ్ అండ్ సన్స్‌లాగే

| ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాలో ఒక కొత్త తరహా ప్రేమకథను చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు వెంకీ అట్లూరి.

By - Garuda Media
Update: 2026-08-18 16:30 GMT

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాలో ఒక కొత్త తరహా ప్రేమకథను చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు వెంకీ అట్లూరి. ఇందులో హీరో వయసు 42 ఏళ్లయితే.. హీరోయిన్‌కేమో 22 ఏళ్లు. ఇద్దరి మధ్య వయసు అంతరం 20 ఏళ్లుంటుంది. అయినా సరే కథానాయికకు అదేమీ పెద్ద అడ్డంకిగా అనిపించదు. హీరోతో ప్రేమలో పడిపోతుంది. తన ప్రేమ కోసం ఆరాటపడుుతంది. కానీ హీరోకు మాత్రం వయసు అంతరం పెద్ద సమస్యగా కనిపిస్తుంది. ఎవరెంత చెప్పినా వినడు. అంత ఏజ్ గ్యాప్ ఉన్న అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటా అంటాడు. కానీ చివరికి అతడి మనసు కరిగిపోతుంది. బాలీవుడ్లో ఇప్పుడు ఇలాంటి ఒక ప్రేమకథ నడుస్తోంది. సీనియర్ దర్శకుడు, 53 ఏళ్ల అనురాగ్ కశ్యప్.. తనకంటే 23 ఏళ్లు చిన్నదైన శుభ్రాశెట్టి (30)తో ప్రేమలో పడ్డాడు. కొంత కాలంగా వీరి మధ్య రిలేషన్‌షిప్ నడుస్తోంది.

ఐతే వయసు అంతరం తమ మధ్య పెద్ద సమస్య కాదని అంటున్నాడు అనురాగ్. వయసు తేడా కారణంగా ఆమె నుంచి దూరంగా ఉండాలని మొదట ప్రయత్నించానని.. కానీ తనతో ఉన్నపుడు తమ మధ్య ఏజ్ గ్యాప్ ఉన్నట్లు అనిపించలేదని అనురాగ్ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం శుభ్రాశెట్టితో తాను చాలా సంతోషంగా ఉన్నానని.. ఈ సంతోషాన్ని కోల్పోవాలని అనుకోవట్లేదని అనురాగ్ వ్యాఖ్యానించాడు. పెళ్లి కంటే తమకు ఈ బంధంలో కలిసి ఉండడం ముఖ్యమని.. దానికి ప్రత్యేకంగా పేరు పెట్టాల్సిన అవసరం లేదని అనురాగ్ అన్నాడు. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’లో హీరో లాగే మొదట ఏజ్ గ్యాప్ అనురాగ్‌కు సమస్యగా అనిపించినా.. తర్వాత అది పెద్ద విషయంగా కనిపించక శుభ్రాతో కంటిన్యూ అవుతున్నాడు. అనురాగ్‌కు గతంలో రెండుసార్లు పెళ్లయింది. 1997-2009 మధ్య ఆయన ఆర్తి బజాప్‌తో వివాహ బంధంలో ఉన్నాడు. తర్వాత 2011లో నటి కల్కి కొచ్లిన్‌ను పెళ్లాడని అనురాగ్.. నాలుగేళ్లకే ఆమె నుంచి విడిపోయాడు.

Tags:    
  • anuragkashyap 
  • shubhrashetty 
  • anuragkashyaprelationship 
  • agegap 
  • bollywood 

Similar News

'అవెంజ‌ర్స్ డూమ్స్ డే' ఫైన‌ల్ ట్రైల‌ర్: కొత్త వారియ‌ర్ ప్ర‌పంచంలోకి పయ‌నం!

2026-11-24 03:48 GMT

ఈ నటుడికి టాలెంట్ ఉండి కూడా స్టార్ హీరో అవ్వకపోవడానికి కారణమేంటంటే..?

2026-11-24 03:48 GMT

రూ.99 ఆఫ‌ర్‌ : 'రామాయ‌ణ' కాకుండా టాప్-10 సినిమాలు!

2026-11-24 03:47 GMT

నితిన్ మూవీలకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా, నిర్మాతగా పనిచేసిన హీరో ఎవరంటే?

2026-11-24 03:47 GMT

ట్రెండీ స్టోరి: విచిత్రంగా పొరుగున ఫేమ‌స్ అయిన స్టార్లు

2026-11-24 00:56 GMT

ఎంత ట్యాలెంట్ చూపించినా రేసులో ఖాళీయే

2026-11-24 00:54 GMT

ఆ టాలీవుడ్ యంగ్ హీరోలకు ట్విట్టర్ పిచ్చి పట్టిందా?

2026-11-24 00:51 GMT

మ‌హేష్ బ‌క్క‌గా అయిపోయార‌ని ఫ్యాన్స్ క‌ల‌త

2026-11-24 00:48 GMT

అల్లు అర్జున్ కోసం ఏకంగా అంత పెద్ద త్యాగం చేయనున్న బోయపాటి శ్రీను..!

2026-11-24 00:42 GMT

ఆరోజుల్లో మాఫియా బెదిరింపుల‌ను ఎదుర్కొనేంత ఫేమ‌స్ ఈ హీరో!

2026-11-24 00:34 GMT

ధూమ్ త‌ర‌హా ఫ్రాంఛైజీ.. ఓటీటీ కోసం అంత బ‌డ్జెట్ పెడ‌తారా?

2026-11-24 00:29 GMT

శ్రీ విష్ణు 'ఫ్యామిలీ ప్యాక్' టీజర్.. పోలీస్ ఇంట్లో గందరగోళం

2026-11-24 00:29 GMT

Copyright @2026

Powered by Blink CMS