కల్ట్ క్లాసిక్ డైరెక్టర్.. మళ్లీ ట్రాక్ ఎక్కినట్లేనా?

బాలీవుడ్‌ లో ఒకప్పుడు కొత్త స్టైల్ సినిమాలకు పెట్టింది పేరైన డైరెక్టర్ అనురాగ్ కశ్యప్.. గత కొన్నేళ్లుగా మాత్రం దర్శకుడిగా తన ఎఫెక్ట్ ను చూపలేకపోయారు.

Update: 2026-06-08 01:30 GMT

బాలీవుడ్‌ లో ఒకప్పుడు కొత్త స్టైల్ సినిమాలకు పెట్టింది పేరైన డైరెక్టర్ అనురాగ్ కశ్యప్.. గత కొన్నేళ్లుగా మాత్రం దర్శకుడిగా తన ఎఫెక్ట్ ను చూపలేకపోయారు. వరుస ఫ్లాపులు, వివాదాలు, నటుడిగా బిజీ కావడం వంటి కారణాలతో ఆయన దర్శకత్వం కాస్త వెనుకబడింది. అయితే ఇప్పుడు బందర్ సినిమాతో మళ్లీ తన పాత ఫామ్‌ ను గుర్తు చేసినట్లు కనిపిస్తున్నారు. అందుకే ప్రస్తుతం అనురాగ్ మళ్లీ ట్రాక్ ఎక్కినట్లేనా? అనే చర్చ నెట్టింట మొదలైంది.

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అనురాగ్ కశ్యప్‌ కు ప్రత్యేక స్థానం ఉంది. బ్లాక్ ఫ్రైడే, దేవ్.డి, గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్,అగ్లీ, రామన్ రాఘవ్ 2.0 వంటి చిత్రాలతో ఆయన కల్ట్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా రియల్ స్టోరీస్, సోషల్ ఎలిమెంట్స్ ను ధైర్యంగా చూపించే శైలి ఆయనకు గుర్తింపు తీసుకొచ్చింది. అయితే గత కొంతకాలంగా ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు పెద్దగా ప్రభావం చూపకపోవడంతో పాటు, ఆయన ఎక్కువగా నటుడిగా కనిపించారు.

ఇలాంటి సమయంలో బాబీ డియోల్ లీడ్ రోల్ లో తెరకెక్కించిన బందర్ సినిమాతో అనురాగ్ మరోసారి వార్తల్లో నిలిచారు. జూన్ 5న విడుదలైన ఆ చిత్రానికి విమర్శకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. కథ చెప్పిన విధానం, భావోద్వేగాలను చూపించిన తీరు, రోల్స్ డిజైన్ చేసిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

అనురాగ్ కశ్యప్ సినిమాలంటే రియాలిటీకి దగ్గరగా ఉండే కథనాలు గుర్తుకొస్తాయి. బందర్ లో కూడా అదే అంశం ప్రధాన బలంగా నిలిచింది. సమాజానికి సంబంధించిన సెన్సిటివ్ ఇష్యూను ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా చూపించడం సినిమాకు ప్లస్‌ గా మారింది. కథలోని ఎమోషన్స్ ప్రేక్షకులను ఆలోచింపజేసేలా ఉన్నాయని టాక్ వినిపిస్తోంది.

ఇక క్యాస్టింగ్ యాక్టింగ్ కూడా సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. బాబీ డియోల్ తన కెరీర్‌ లో మరో స్ట్రాంగ్ రోల్ పోషించారని ప్రశంసలు దక్కుతున్నాయి. అలాగే సన్యా మల్హోత్రా, సప్నా పబ్బి, సబా ఆజాద్, ఇంద్రజిత్ సుకుమారన్, రాజ్ బి. శెట్టి తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారని రివ్యూస్ చెబుతున్నాయి. నేచురల్ యాక్టింగ్ కథను మరింత స్ట్రాంగ్ గా మార్చిందని టాక్ వినిపిస్తోంది.

సినిమాకు భారీ రేంజ్ లో ప్రమోషన్స్ లో నిర్వహించకపోవడం కూడా ఆసక్తికర అంశంగా మారింది. సాధారణంగా బాలీవుడ్‌ లో భారీ ప్రమోషన్లతో సినిమాలు విడుదలవుతున్న వేళ బందర్ మాత్రం కంటెంట్‌ పైనే ఆధారపడింది. తొలి రోజు నుంచే వచ్చిన పాజిటివ్ మౌత్ టాక్ కారణంగా రెండో రోజు నుంచి ప్రేక్షకుల ఆసక్తి పెరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్‌ లో కంటెంట్ బేస్డ్ చిత్రాలకు ఇంకా ఆదరణ ఉందని బందర్ మరోసారి నిరూపించింది.

ముఖ్యంగా స్టార్ హంగామా కంటే కంటెంట్ ఉంటే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారనే విషయాన్ని ఆ సినిమా చూపించింది. ఏదేమైనా ఎన్నో కల్ట్ క్లాసిక్ చిత్రాలను అందించిన అనురాగ్ కశ్యప్, బందర్ తో మళ్లీ తన డైరెక్షన్ టాలెంట్ ను చూపించినట్లు కనిపిస్తున్నారు. ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద కూడా మంచి రిజల్ట్ సాధిస్తే, ఆయన కెరీర్‌ లో మరో టర్నింగ్ పాయింట్ గా నిలిచే ఛాన్స్ ఉంది.

Tags:    

Similar News