'పరదా' తో రాబోతున్న ప్రేమమ్ బ్యూటీ

మలయాళ హిట్ మూవీ ప్రేమమ్ లో నటించడం ద్వారా పాన్ ఇండియా రేంజ్ గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్‌.

Update: 2024-03-13 07:12 GMT

మలయాళ హిట్ మూవీ ప్రేమమ్ లో నటించడం ద్వారా పాన్ ఇండియా రేంజ్ గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్‌. ఈ అమ్మడు తెలుగులో అదే సినిమా రీమేక్ తో ఎంట్రీ ఇచ్చింది. అందంతో పాటు అభినయం తో తెలుగు ప్రేక్షకులను వస్తుంది.

ప్రస్తుతం తెలుగు తో పాటు ఇతర భాషల సినిమాల్లో కూడా ఈ అమ్మడు నటిస్తుంది. ఇటీవలే తమిళ స్టార్‌ హీరో విక్రమ్‌ తనయుడు ధృవ్‌ కి జోడీగా నటించేందుకు సైన్ చేసింది. తెలుగు లో సిద్దు జొన్నలగడ్డ తో కలిసి టిల్లు స్క్వేర్ సినిమాలో నటించింది. ఆ సినిమా త్వరలో విడుదల అవ్వబోతుంది.

గత ఏడాది జూన్ లో 'సినిమా బండి' దర్శకుడు ప్రవీణ్‌ కాండ్రేగుల దర్శకత్వంలో ఒక సినిమాకు అనుపమ పరమేశ్వరన్‌ కమిట్ అయ్యింది. ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. తాజాగా చిత్ర యూనిట్‌ సభ్యులు సినిమాకు 'పరదా' అనే విభిన్నమైన టైటిల్‌ ను ఖరారు చేసినట్లు సమాచారం అందుతోంది.

విజయ్ డొంకాడ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ తో పాటు సంగీత, దర్శన రాజేంద్రన్‌, రాగ్ మయూర్‌ ఇంకా పలువురు యంగ్‌ స్టార్స్ కనిపించబోతున్నారు. విభిన్నమైన కాన్సెప్ట్‌ తో రాబోతున్న 'పరదా' సినిమాలో అనుపమ ను కొత్తగా చూస్తారని ఆమె సన్నిహితులు అంటున్నారు.

Tags:    

Similar News