• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తెలుగు సినిమాలో సమంత...

తెలుగు సినిమాలో సమంత గెస్ట్‌ రోల్‌..!

| టాలీవుడ్‌లో అనుపమ పరమేశ్వరన్‌ జోరు కొనసాగుతోంది. ఇదే సమయంలో కోలీవుడ్‌లోనూ ఈ అమ్మడికి 'డ్రాగన్‌' సినిమాతో హిట్‌ దక్కింది.

By - Tupaki Desk
Update: 2025-03-12 12:30 GMT

టాలీవుడ్‌లో అనుపమ పరమేశ్వరన్‌ జోరు కొనసాగుతోంది. ఇదే సమయంలో కోలీవుడ్‌లోనూ ఈ అమ్మడికి 'డ్రాగన్‌' సినిమాతో హిట్‌ దక్కింది. ప్రదీప్‌ రంగనాథన్ హీరోగా నటించిన డ్రాగన్ సినిమాలో అనుపమ పరమేశ్వరన్‌ మంచి పాత్రలో నటించి మెప్పించింది. సినిమాలో ఆమె పాత్ర అత్యంత కీలకంగా నిలిచింది. దాంతో సినిమా విడుదల తర్వాత కోలీవుడ్‌లో అనుపమ క్రేజ్‌ అమాంతం పెరిగింది. తెలుగులో వరుసగా సినిమాలు చేస్తున్న అనుపమకి తాజాగా రెండు తమిళ్‌ సినిమా ఆఫర్లు వచ్చాయని సమాచారం అందుతోంది. ఆ విషయమై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

అనుపమ ప్రస్తుతం ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో 'పరధ' అనే సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమాను ప్రకటించినప్పటి నుంచి అందరి దృష్టి ఆకర్షిస్తూ వస్తుంది. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అనుపమ పరమేశ్వరన్‌ దక్కించుకుంటుంది అనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో అనుపమతో పాటు సంగీత క్రిష్, దర్శన రాజేంద్రన్‌లు కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెల్సిందే. వీరిద్దరితో పాటు అనుపమ ఆన్‌ స్క్రీన్‌ యాక్షన్‌ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతుంది అనే విశ్వాసంను మేకర్స్‌ వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికర ప్రచారం ఒకటి జరుగుతోంది.

స్టార్‌ హీరోయిన్‌ సమంత ఈ సినిమాలో గెస్ట్‌ రోల్‌లో కనిపించేందుకు ఓకే చెప్పిందట. అనుపమ పరమేశ్వరన్‌తో సమంతకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సినిమా కోసం అనుపమ స్వయంగా సమంతను గెస్ట్‌ రోల్‌లో నటించాల్సిందిగా కోరిందని, అందుకు సామ్‌ ఓకే చెప్పిందనే వార్తలు వస్తున్నాయి. అతి త్వరలోనే పరధా షూటింగ్‌ కోసం సమంత రెడీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయిదు నుంచి పది నిమిషాలు మాత్రమే కనిపించే పాత్రలో సమంత నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. పాత్ర ఎంతది అయినా సమంత ఉంది అంటే కచ్చితంగా పరధా సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.

తెలుగులో రూపొందుతున్న పరధా సినిమాను సౌత్‌లోని అన్ని భాషల్లోనూ విడుదల చేసేందుకు గాను ప్లాన్‌ చేస్తున్నారు. అందుకే సమంత గెస్ట్‌ అప్పియరెన్స్ కచ్చితంగా సినిమాకు అదనపు ఆకర్షణ అవుతుందనే అభిప్రాయంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. పరధాలో సమంత నటిస్తుందా అనే విషయమై మరింత క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు వెయిట్‌ చేయాల్సిందే. అనుపమ పరమేశ్వరన్‌ కెరీర్ ఆరంభంలో త్రివిక్రమ్‌ దర్శకత్వంలో చేసిన 'అ ఆ' సినిమాలో సమంత హీరోయిన్‌ అనే విషయం తెల్సిందే. ఆ సినిమాలో సమంత, అనుపమ కలిసి నటించారు. ఆ తర్వాత మళ్లీ వీరిద్దరు కలిసింది లేదు. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఒకే సినిమాలో కనిపించబోతున్నారని వార్తలు వస్తున్నాయి.

Tags:    
  • AnupamaParameswaran 
  • Samantha 
  • ParadhaMovie 
  • Tollywood 
  • Kollywood 
  • GuestRole 
  • SouthCinema 
  • MovieUpdates 
  • TamilCinema 
  • AnupamaCareer 
  • SamanthaSpecialAppearance 

Similar News

‘కన్నప్ప’కు రాస్తే.. ‘రామాయణం’లో ఛాన్సొచ్చింది

2026-11-03 05:53 GMT

తొలి సంపాదనతో రాజమౌళి ఏం కొన్నారో తెలుసా?

2026-11-03 05:38 GMT

అతని హీరోగా వస్తే.. అందరూ వెళ్ళిపోతారనుకున్నారంట!

2026-11-03 04:47 GMT

2026 వెయ్యి కోట్ల రేసు.. రామాయణమే దిక్కా?

2026-11-03 04:34 GMT

జైలర్ 2: ఇలా జరిగుంటే 1000 కోట్లు వచ్చేవా?

2026-11-03 04:33 GMT

Bigg Boss Telugu 10: నామినేషన్లలో వర్షిణీ ముకేశ్ మీదే టార్గెట్

2026-11-03 04:33 GMT

నాని లాంటి శర్వ.. ఓదెల లాంటి నంది.. వంద కోట్లు దక్కేనా?

2026-11-03 04:31 GMT

నాశిర‌కం 'కింగ్'.. సాంగ్ విజువ‌ల్స్‌పై విమ‌ర్శ‌లు

2026-11-03 04:30 GMT

'పాన్ ఇండియా' ఎవ‌రు మొద‌లు పెట్టారు? 'కింగ్ నాగార్జున‌'పై సూర్య ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

2026-11-03 04:27 GMT

AK 47 బాక్సాఫీస్.. అసలైన మండే పరిస్థితి ఇది!

2026-11-03 04:27 GMT

అనిల్ రావిపూడి మార్క్ హంగామా ఏదీ?

2026-11-03 04:26 GMT

ఆ నీడ‌లో ఉన్న‌ది మాజీ ప్రియుడా? క‌న్ఫ్యూజన్‌లో న‌టి ఫ్యాన్స్!

2026-11-03 04:20 GMT

Copyright @2026

Powered by Blink CMS