కందుల సులోచన రాణి మరో రామలచ్చిమి అవుతుందా?
మలయాళ బ్లాక్ బస్టర్ `ప్రేమమ్`లో కర్లింగ్ హెయిర్‌తో కుర్రకారుని తన మాయలో పడేసి ఇండస్ట్రీ వర్గాల దృష్టిని ఆకర్షించిన భామ అనుపమ పరమేశ్వరన్.;
ఇండస్ట్రీలో కొంత మందిని వరించిన అవకాశాలు దురదృష్టం కొద్దీ కాలం కలిసిరాక, సరైన నిర్ణయం తీసుకోలేక.. తమ వద్దకు వచ్చిన అవకాశాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోవడంతో అది వేరే వాళ్ల చెంతకు చేరడం..బ్లాక్ బస్టర్ హిట్‌తో పాటు మంచి పేరుని తీసుకురావడం జరుగుతూ వుంటుంది. గత కొన్ని దశాబ్దాల కాలంగా టలీవుడ్‌లో ఇలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్న హీరోలు ఉన్నారు. హీరోయిన్‌లు ఉన్నారు. అయితే అలాంటి ఓ అద్భుతమైన అవకాశాన్ని చేజార్చుకుని ఆ తరువాత ఫీలైన హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్.
మలయాళ బ్లాక్ బస్టర్ `ప్రేమమ్`లో కర్లింగ్ హెయిర్‌తో కుర్రకారుని తన మాయలో పడేసి ఇండస్ట్రీ వర్గాల దృష్టిని ఆకర్షించిన భామ అనుపమ పరమేశ్వరన్. కేరళ కొట్టాయంలోని సీఎంఎస్ కాలేజీలో చదువుకున్న ఈ సోయగం `ప్రేమమ్` సినిమాతో నటిగా అరంగేట్రం చేసింది. ఆ క్రేజ్‌తోనే `ఆ ఆ` సినిమాతో టాలీవుడ్‌లోకి ప్రవేశించింది. తెలుగు రీమేక్ `ప్రేమమ్`, శతమానం భవతి, ఉన్నది ఒకటే జిందగీ వంటి సినిమాల్లో చక చకా అవకాశాల్ని దక్కించుకుని తెలుగులో హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకుంది.
అదే టైమ్‌లో అనుపమకు దక్కిన భారీ అండ్ క్రేజీ ఆఫర్ `రంగస్థలం`. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా సుకుమార్ తెరకెక్కించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులోని అచ్చతెలుగు పల్లెటూరి అమ్మాయి రామలచ్చిమి క్యారెక్ట్ చేయగల నటి కోసం అన్వేషిస్తున్నారు. ఆ టైమ్‌లో ఈ క్యారెక్టర్ కోసం అనుపమ అయితే ఫ్రెష్‌గా ఉంటుందని భావించి తనని హీరోయిన్‌గా రామలచ్చిమి పాత్ర కోసం ఫైనల్ చేసుకున్నారు.
లుక్ టెస్ట్ కూడా పూర్తి చేశారు. అయితే ఇది తనకు మరీ హెవీ అవుతుందని భావించిందో తెలియదు కానీ ఫైనల్‌గా ఆ సినిమాని, రామలచ్చిమి క్యారెక్టర్‌ని మిస్ చేసుకుంది. దాంతో వేరే ఆప్షన్ కోసం వెతికిన సుకుమార్ ఫైనల్‌గా సమంతని ఫిక్స్ చేసుకున్నారు. పక్కా పల్లెటూరి యువతిగా సమంత కనిపించిన తీరు, క్యారెక్టర్‌లో ఒదిగిపోయిన తీరు అందరిని ఆకట్టుకుంది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సమంతకు మంచి పేరొచ్చింది. ఆ తరువాత అనుపమ మంచి క్యారెక్టర్, బ్లాక్ బస్టర్ సినిమాని అనవసరంగా మిస్ చేసుకున్నానని ఫీల్ అయింది.
ఇప్పుడు అచ్చం అదే మేకోవర్‌తో సాగే పల్లెటూరి యువతి పాత్రలో నటిస్తోంది. అదే `భోగి`. శర్వానంద్ హీరోగా సంపత్ నంది ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ కందుల సులోచన రాణి క్యారెక్టర్‌లో నటిస్తోందని టీమ్ ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది. `రంగస్థలం`లో అనుపమ ఎలాంటి వేషధారణతో సాగే క్యారెక్టర్‌ని మిస్ చేసుకుందో అలాంటి పాత్రని పోలిన పాత్రలో కనిపించనుండటం గమనార్హం. అనుపమ ఫస్ట్ లుక్ చూసిన వారంతా `రంగస్థలం`లో పోగొట్టుకుంది `భోగి`తో దక్కించుకుంటోందని కామెంట్‌లు చేస్తున్నారు. అనుపమ లుక్ చూస్తుంటే రాబలచ్చిమిని గుర్తు చేసేలా ఉందని కామెంట్‌లు వినిపిస్తున్నాయి.