ఆ దెబ్బకు అవకాశాలు రాకుండాపోయాయి.. అనుపమ షాకింగ్ స్టేట్మెంట్!
ఆ మధ్య సిద్దు జొన్నలగడ్డతో 'డీజే టిల్లు' లో నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. తొలిసారి ఇందులో చాలా బోల్డ్ పెర్ఫార్మన్స్ తో విమర్శలు కూడా ఎదుర్కొంది.;
అనుపమ పరమేశ్వరన్.. మలయాళం సినీ ఇండస్ట్రీలో 'ప్రేమమ్' సినిమాతో కెరియర్ మొదలుపెట్టి.. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన 'అఆ' సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. మొదటి సినిమాతోనే అద్భుతమైన నటన కనబరిచి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. శర్వానంద్ హీరోగా వచ్చిన 'శతమానంభవతి' సినిమాతో బ్లాక్ మాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. హీరోయిన్ గా ఈమెకు మంచి కెరియర్ అందించింది ఈ సినిమానే. తర్వాత పలు చిత్రాలలో చేసిన ఈమె సాంప్రదాయానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. తన కట్టుబొట్టు పెర్ఫార్మెన్స్ తో అందరి దృష్టిని ఆకర్షించిన అనుపమ.. ఆ మధ్య సిద్దు జొన్నలగడ్డతో 'డీజే టిల్లు' లో నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. తొలిసారి ఇందులో చాలా బోల్డ్ పెర్ఫార్మన్స్ తో విమర్శలు కూడా ఎదుర్కొంది.
రంగస్థలం నుండి అనుపమను తప్పించారా?
ఇకపోతే ఇప్పుడు ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో 'పరదా' అనే సినిమాతో ఆగస్టు 22న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అనుపమ పరమేశ్వరన్.. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ తన కెరియర్లో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చింది. ముఖ్యంగా ఒక సినిమా విషయంలో వచ్చిన రూమర్స్ కారణంగా.. తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పి బాధపడింది అనుపమ. ఇంటర్వ్యూలో భాగంగా.. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన 'రంగస్థలం' సినిమాలో మీకు హీరోయిన్గా అవకాశం ఇచ్చారు.. కానీ మీరే రిజెక్ట్ చేశారట కదా.. నిజమేనా? అని ప్రశ్నించారు.
ఆ రూమర్స్ వల్లే అవకాశాలు కోల్పోయాను - అనుపమ
దీనిపై అనుపమ మాట్లాడుతూ.. "నా కెరియర్ తొలినాళ్లల్లో శతమానం భవతి సినిమా తర్వాత రంగస్థలం సినిమాలో మొదట నాకు అవకాశం వచ్చింది. కానీ నేను ఈ సినిమా నుండి తప్పుకోలేదు. మేకర్స్ నన్ను వద్దనుకున్నారు. బయట మాత్రం రామ్ చరణ్ తో, సుకుమార్ తో పని చేయడం ఇష్టం లేక అనుపమ ఈ సినిమాను రిజెక్ట్ చేసింది అని ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు వార్తలు ప్రచారం చేశారు. దాంతో అప్పట్లో నాకు వచ్చిన చాలా సినిమాలు పోయాయి. ఈ ప్రచారం నా కెరియర్ పై చాలా ప్రభావం చూపించింది. ముఖ్యంగా ఇలాంటి న్యూస్ రావడం వల్ల దాదాపు 6 నెలల పాటు ఎటువంటి షూటింగ్లు లేక కాల్స్ రాక ఎన్నో ఇబ్బందులు పడ్డాను. అందులో నా తప్పు ఏమాత్రం లేదు. వాళ్లే హీరోయిన్ గా నన్ను అనుకొని.. మళ్ళీ వారే కాదన్నారు. కానీ రూమర్స్ మాత్రం బాగా స్ప్రెడ్ అయ్యాయి. వాస్తవానికి అనుపమ స్థానంలో ఇంకొకరిని తీసుకున్నారు అని వార్తలు వచ్చుంటే సరిపోయేది. కానీ అనుపమ ఈ సినిమాను రిజెక్ట్ చేసిందని వార్తలు వచ్చాయి. ఈ వార్తల వల్ల మానసికంగా కూడా సమస్య ఎదుర్కొన్నాను.
రూమర్స్ వల్ల సక్సెస్ మీట్ కూడా ఎంజాయ్ చేయలేకపోయాను - అనుపమ
అటు శతమానంభవతి సక్సెస్ మీట్ లో రెడ్ శారీ కట్టుకొని అందరితో పాటు అక్కడికి వెళ్లాను. కానీ ఆ ఈవెంట్లో ఆ సంతోషాన్ని ఈ రూమర్స్ వల్ల పొందలేకపోయాను.." అంటూ తన మనసులో బాధను చెప్పుకొచ్చింది అనుపమ. మొత్తానికైతే ఇలాంటి బ్యాడ్ రూమర్స్ వల్ల తన సినీ కెరియర్ పైనే కాకుండా మానసికంగా కూడా ఎఫెక్ట్ పడింది అని చెప్పుకొచ్చింది అనుపమ.