'పరదా' అనుపమ.. మనసులు గెలుచుకుందిగా!

మాలీవుడ్ బ్యూటీ, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కు టాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే.;

Update: 2025-08-25 05:47 GMT

మాలీవుడ్ బ్యూటీ, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కు టాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఇప్పటి వివిధ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. కమర్షియల్ సినిమాల్లో సగటు హీరోయిన్‌ గా, పక్కింటి అమ్మాయిగా కనిపించి మెప్పించిన అమ్మడు.. ఇప్పుడు పరదాతో సందడి చేస్తున్నారు.

ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించిన ఆ సినిమాలో అనుపమ లీడ్ రోల్ లో కనిపించారు. సీనియర్ నటి సంగీత, మాలీవుడ్ నటి దర్శనతోపాటు రాగ్ మయూర్ కీలక పాత్రలు పోషించారు. రిలీజ్ కు ముందు ప్రమోషనల్ కంటెంట్ తో మంచి హైప్ అందుకున్న పరదా మూవీ.. రీసెంట్ గా ఆగస్టు 22వ తేదీన థియేటర్స్ లో విడుదలైంది.

అయితే సినిమాకు ఆశించిన స్పందన రాలేదని చెప్పాలి. కథ కొత్తదే అయినా.. ఆస‌క్తిక‌రంగా మ‌ల‌చ‌డంలో మాత్రం విఫ‌ల‌మ‌య్యారు మేకర్స్. దీంతో పరదా మూవీ అనుకున్నంత రేంజ్ లో హిట్ అవ్వలేదు. తద్వారా అనుపమ ఖాతాలో హిట్ చేరలేదు. అయితేనేం ఆమె ఈ సినిమాకు గాను చేసిన కృషిని అంతా ఇప్పుడు ప్రశంసిస్తున్నారు.

చెప్పాలంటే.. అనుపమ పరదా మూవీని ఓ రేంజ్ లో ప్రమోట్ చేశారు. ప్రతి ప్రమోషనల్ ఈవెంట్ లో కనిపించారు. సినిమాలో తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. కెరీర్ లో అత్యుత్తమ పాత్రలో కనిపించారు. డీ గ్లామర్ రోల్ చేసినా.. తన యాక్టింగ్ తో ఫిదా చేశారు. కథలో భావోద్వేగ భారాన్ని ఆమె నిజాయితీతో మోశారని చెప్పాలి.

సుబ్బు పాత్ర‌లో ఒదిగిపోయారు. అయితే నార్మల్ గా ప్ర‌తి సినిమాలో కూడా త‌న క‌ళ్ల‌తోనే భావాలు ప‌లికించే అమ్మడు.. పరదా మూవీలో ఎక్కువ‌భాగం స‌న్నివేశాల్లో ప‌ర‌దా క‌ప్పుకొనే క‌నిపిస్తూ ఉంటారు. కానీ త‌న బాడీ లాంగ్వేజ్‌ తో, డైలాగ్స్‌ తో మెప్పించారు. స‌న్నివేశాల్ని పండించే ప్ర‌య‌త్నం చేసి సక్సెస్ అయ్యారు.

సినిమా స్టార్టింగ్ లో ఒక‌లా క‌నిపించే ఆమె పాత్ర, చివ‌ర‌కొచ్చేస‌రికి పూర్తిగా మారుతుంది. ఏదేమైనా కొన్ని సినిమాలు వాణిజ్యపరంగా విజయం సాధించవు. కానీ అవి చిరస్మరణీయమైన ప్రదర్శనలను ఇస్తాయి. ఇప్పుడు పరదా మూవీ విషయంలో అదే జరిగింది. బాక్సాఫీస్ వద్ద మూవీ విఫలమైనప్పటికీ అనుపమ నటన టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. మనసులు గెలుచుకుంది.

Tags:    

Similar News