ఐదేళ్ల తర్వాత వైరస్ ఎటాక్ అయ్యేనా?
మాలీవుడ్ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ సెకెండ్ ఇన్నింగ్స్ లో ఎంత బిజీగా ఉందో చెప్పాల్సిన పనిలేదు.;
మాలీవుడ్ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ సెకెండ్ ఇన్నింగ్స్ లో ఎంత బిజీగా ఉందో చెప్పాల్సిన పనిలేదు. మొదటి ఇన్నింగ్స్ లో సాధించలేని సక్సెస్ ను సెకెండ్ ఇన్నింగ్స్ లో సాధిస్తోంది. వచ్చిన ఏ అవకాశాన్ని వదిలి పెట్టడం లేదు. వెండి తెరపై బోల్డ్ గా నటించాలి అన్నా? కీలక పాత్రలతో కథను మలుపు తిప్పాలన్నా? సస్పెన్స్ థ్రిల్లర్ అయినా? క్రైమ్ థ్రిల్లర్ అయినా? అనుపమ పరమేశ్వరన్ వరకూ రానంత వరకే వచ్చిన తర్వాత నో అనే మాట ఉండదు. మరే నటికి ఛాన్స్ ఇవ్వకుండా పని చేస్తోంది. ఈ విషయంలో అనుపమ ఎంతో తెలివిగా వ్యవహరిస్తోంది.
అందుకే సెకెండ్ ఇన్నింగ్స్ లో అంత బిజీగా ఉంది. ఐదేళ్లగా అమ్మడు తమిళ్, తెలుగు సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతుంది. అమ్మడు బిజీ షెడ్యూల్ చూస్తుంటే రోజుకు ముడు షిప్టులు కూడా పని చేస్తోందా? అన్న సందేహం రాక మానదు. గత ఏడాది నాలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ ఏడాది ఇప్పటి వరకూ ఐదు సినిమాలతో ప్రేక్షకుల్లోనే ఉంది. మరో సినిమా `లాక్ డౌన్` రిలీజ్ కు రెడీ అవుతోంది. డిసెంబర్ లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. అనుపమా పరమేశ్వరన్, చార్లీ, నిరోషా ప్రధాన పాత్రల్లో ఏ.ఆర్ జీవా తెరకెక్కించిన చిత్రమిది.
ఇఫీ పెస్టివల్స్ లో ఈ సినిమా నవంబర్ 23న స్ట్రీమింగ్ అయింది. థియేట్రికల్ రిలీజ్ మాత్రం డిసెంబర్ 5న జరుగుతుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇదీ పక్కా ఇంటెన్స్ థ్రిల్లర్. కొవిడ్ 19 పరిస్థితులు ఎలా ఉండేవి? అన్నది దేశ ప్రజలందరికీ తెలిసిందే. గడపదాటి బయటకు రావాలంటే బయపడే పరిస్థితులు. లాక్ డౌన్ నిబంధనలు..పోలీసుల ఆంక్షల నడుమ జన జీవనం ఎలా స్థంబించిందో తెలిసిందే? కరోనా వైరస్ సోకితే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కునే వారో తెలిసిందే.
అవే సన్నివేశాలను ట్రైలర్ లో ఆసక్తికరంగా మలిచారు. బలమైన ఎమోషన్ కూడా కథలో కనిపిస్తుంది. ఇందులో అనిత అనే పాత్రలో అనుపమ కనిపించనుంది. కోవిడ్ కారణంగా ఓ మహిళ ఎదుర్కున్న సమస్యను మెయిన్ థీమ్ గా తీసుకుని మలిచిన కథగా తెలుస్తోంది. ఎన్.ఆర్. రఘునందన్ - సిద్ధార్థ్ విపిన్ చక్కని బ్యాక్ గ్రౌండ్ స్కోర అందించారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. కోవిడ్ సమయంలో రాంగోపాల్ వర్మ కూడా ఓ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు మరికొంత మంది కరోనా వేరియెంట్స్ ఆధారంగా కొన్ని సినిమాలు చేసారు.