ఆ హీరోయిన్ కొంచెం ఇష్టంగా.. కొంచెం కష్టంగా..!

సౌత్ భామల్లో తన మార్క్ సినిమాలు చేస్తూ ఆడియన్స్ ని అలరిస్తున్న భామ అనుపమ పరమేశ్వరన్.;

Update: 2025-10-22 08:11 GMT

సౌత్ భామల్లో తన మార్క్ సినిమాలు చేస్తూ ఆడియన్స్ ని అలరిస్తున్న భామ అనుపమ పరమేశ్వరన్. మలయాళం నుంచి వచ్చిన అమ్మడు తెలుగులో యూత్ ఆడియన్స్ ని మెప్పించే సినిమాలు చేస్తూ వచ్చింది. ఇక మధ్యలో స్లిమ్ లుక్ కోసం కాస్త గ్యాప్ తీసుకుని స్లిమ్ లుక్ తో సర్ ప్రైజ్ చేసింది. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం ఇలా అన్ని ఇండస్ట్రీలను కవర్ చేస్తున్న అనుపమ పరమేశ్వరన్ ఎక్కడ కూడా టాప్ రేంజ్ కి వెళ్లలేకపోతుంది. మధ్యలో కొన్ని ప్రయోగాలు చేస్తున్నా కూడా అమ్మడికి ఎందుకో కలిసి రావట్లేదు.

ఆ సినిమాను అనుపమ చాలా ప్రేమించి చేసింది..

ఈ ఇయర్ తమిళ్ లో డ్రాగన్ సినిమాతో అమ్మడు సూపర్ హిట్ అందుకుంది. తెలుగులో కూడా ఆ సినిమాకు మంచి ఆదరణ దక్కింది. ఇక నెక్స్ట్ పరదా అంటూ ఒక సినిమా చేసింది అమ్మడు. ఆ సినిమాను అనుపమ చాలా ప్రేమించి చేసింది. సినిమా కోసం ఆమె ప్రమోషన్స్ కూడా బాగా చేసింది. కానీ రిజల్ట్ మాత్రం అనుపమకి షాక్ ఇచ్చింది.

ఐతే పరదాని పట్టించుకోలేదు కానీ నెక్స్ట్ వచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ కిష్కిందపురి సినిమాను మాత్రం థ్రిల్లర్ జోనర్ సినిమాలు ఇష్టపడే ఆడియన్స్ సక్సెస్ చేశారు. సినిమా గురించి ఏదైతే మేకర్స్ ఇంకా స్టార్ కాస్ట్ నమ్మకం పెట్టుకున్నారో దానికి తగిన ఫలితం వచ్చింది. అంతేకాదు రీసెంట్ గా ఓటీటీ రిలీజైన కిష్కిందపురి కూడా డిజిటల్ రిలీజ్ లో కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.

సొంత ఇండస్ట్రీలో తనకు ఇంకా బ్యాడ్ లక్..

అనుపమకు ఈ ఇయర్ రెండో సక్సెస్ గా కిష్కింధపురి నిలిచింది. ఇక వీటితో పాటుగా మలయాళంలో రెండు సినిమాలు చేసింది అనుపమ. J.S.Kఇంకా జానకి V Vs స్టేట్ ఆఫ్ కేరళ సినిమాలు కూడా చేసింది అనుపమ. ఈ రెండు సినిమాలు కూడా మళ్లీ అనుపమకి నిరాశ మిగిల్చాయి. ఐతే సొంత ఇండస్ట్రీలో తనకు ఇంకా బ్యాడ్ లక్ కొనసాగుతుంది. ఐతే లేటెస్ట్ గా వచ్చిన బైసన్ సినిమా మళ్లీ ఆమెను హిట్ ట్రాక్ ఎక్కింది. బైసన్ సినిమాలో ధృవ్ విక్రం తో అనుపమ నటించింది.

మారి సెల్వరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కిన బైసన్ సినిమాతో అనుపమ మళ్లీ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. అనుపమ ఈ ఇయర్ ఆరు సినిమాలు చేస్తే అందులో హిట్లు సగం.. ఫ్లాపులు సగం అనేలా ఉన్నాయి. అందుకే కెరీర్ విషయంలో అమ్మడు కొంచెం ఇష్టంగా.. కొంచెం కష్టంగా ఉంది.

Tags:    

Similar News