జాతిరత్నాలు అనుదీప్.. రష్మికతో సీరియస్ ఎలా..?

ఐతే అనుదీప్ కెవి నెక్స్ట్ సినిమా నేషనల్ క్రష్ రష్మికతో ఉంటుందని లేటెస్ట్ టాక్. అది కూడా ఈసారి అనుదీప్ ఒక సీరియస్ సబ్జెక్ట్ తో ఈ సినిమా చేయబోతున్నాడట.;

Update: 2025-12-09 08:30 GMT

జాతిరత్నాలు సినిమాతో సూపర్ పాపులర్ అయిన డైరెక్టర్ అనుదీప్ ఆ తర్వాత ప్రిన్స్ మూవీ చేశాడు. ప్రస్తుతం విశ్వక్ సేన్ తో ఫంకీ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాను అసలైతే ఈ క్రిస్ మస్ రిలీజ్ అన్నారు. ఐతే ఇంకా ప్రమోషన్స్ ని మొదలు పెట్టలేదు. సినిమా ఈ క్రిస్ మస్ కాకుండా వాయిదా వేసే ప్లాన్ ఉందేమో చూడాలి. ఈ సినిమా తర్వాత అనుదీప్ తన స్టైల్ కాకుండా ఒక సీరియస్ సబ్జెక్ట్ తో రాబోతున్నాడట.

అనుదీప్ కెవి నెక్స్ట్ సినిమా..

పిట్టగోడ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అనుదీప్ కెవి జాతిరత్నాలుతో క్రేజీ డైరెక్టర్ గా మారాడు. అతని సినిమాలతో పాటు ఆఫ్ లైన్ అతని ఇంటర్వ్యూస్ లో కామెడీ కూడా అదిరిపోతుంది. ఐతే అనుదీప్ కెవి నెక్స్ట్ సినిమా నేషనల్ క్రష్ రష్మికతో ఉంటుందని లేటెస్ట్ టాక్. అది కూడా ఈసారి అనుదీప్ ఒక సీరియస్ సబ్జెక్ట్ తో ఈ సినిమా చేయబోతున్నాడట.

తీసిన సినిమాలు 3 కూడా కామెడీ నెక్స్ట్ రాబోతున్న ఫంకీ కూడా ఎంటర్టైనింగ్ గానే వస్తుంది. అలాంటిది సడెన్ గా అనుదీప్ ఇలా సీరియస్ కథ రాయడం ఫిల్మ్ నగర్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అనుదీప్ ని అంతగా ఇన్ స్పైర్ చేసిన కథ ఏంటి అసలు కామెడీ సినిమాలు తీసే అనుదీప్ ఎలాంటి ఎమోషనల్, సీరియస్ స్టోరీ చెబుతాడని ఆడియన్స్ లో ఆసక్తి మొదలైంది.

కంటెంట్ బేస్డ్ సినిమాల్లో రష్మిక..

అనుదీప్ ఫంకీ సినిమా రిలీజ్ అవ్వగానే ఆ ప్రాజెక్ట్ మీద వర్క్ మొదలు పెడతాడని తెలుస్తుంది. రష్మిక మందన్న రీసెంట్ గా వచ్చిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో తన కెపాసిటీ ఏంటో చూపించింది. కమర్షియల్ సినిమాల్లోనే కాదు ఇలా కంటెంట్ బేస్డ్ సినిమాల్లో కూడా రష్మిక అదరగొట్టేస్తుంది. అందుకే అనుదీప్ ఈ కథను రష్మికతో చేయాలని చూస్తున్నాడట. మరి అనుదీప్, రష్మిక ఈ సీరియస్ సినిమా కాన్సెప్ట్ ఏంటి దీని గురించి మరిన్ని డీటైల్స్ త్వరలో తెలుస్తాయి.

ఓ పక్క పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న రష్మిక బాలీవుడ్, టాలీవుడ్ రెండిటిలో వచ్చిన ప్రతి అవకాశాన్ని కాదనకుండా చేస్తుంది. అనుదీప్ తో నిజంగానే రష్మిక సినిమా చేస్తుందా లేదా అన్నది త్వరలో క్లారిటీ వస్తుంది. ఒకవేళ నిజంగానే ఈ కాంబో సినిమా కన్ ఫర్మ్ అయితే మాత్రం కచ్చితంగా సంథింగ్ స్పెషల్ ప్రాజెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం రష్మిక తెలుగులో అయితే విజయ్ దేవరకొండ తో సినిమా చేస్తుంది. రాహుల్ సంకృత్యన్ డైరెక్షన్ లో వస్తున్న ఆ సినిమా పీరియాడికల్ కథతో వస్తుంది. రష్మిక కూడా స్టోరీ సెలక్షన్స్ లో ఆచి తూచి అడుగులేస్తుంది. సో తప్పకుండా ఫ్యాన్స్ కి ఆమె నుంచి రాబోతున్న సినిమాలు సూపర్ ట్రీట్ ఇవ్వడం గ్యారెంటీ అని చెప్పొచ్చు.

Tags:    

Similar News