అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి ఇంట్లో పెళ్లి సంద‌డి!

శ్రీ‌దేవి స‌వ‌తి, బోనీక‌పూర్ మొద‌టి భార్య కుమార్తె కుమార్తె, అర్జున్ క‌పూర్ సోద‌రి అన్షుల‌కు పెళ్లంట‌!;

Update: 2025-07-04 10:55 GMT

అతిలోక సుంద‌రి శ్రీదేవి కూతురి పెళ్లంట‌! క‌పూర్ ఇంట పెళ్లి సంద‌డి, డూడూ పీపీ భాజాల గురించే ఇప్పుడు ఊరూ వాడా ముచ్చ‌ట సాగుతోంది. మామ్ శ్రీ‌దేవి దివికేగినా కానీ, పైనుంచి కుమార్తెకు దీవెన‌లు అందించ‌నుంది. ఇంత‌కీ పెళ్లి ఎవ‌రికి? జాన్వీక‌పూర్, ఖుషిక‌పూర్ వీళ్ల‌లో ఎవ‌రికైనా అనుకుంటున్నారా? కానే కాదు... శ్రీ‌దేవి స‌వ‌తి, బోనీక‌పూర్ మొద‌టి భార్య కుమార్తె కుమార్తె, అర్జున్ క‌పూర్ సోద‌రి అన్షుల‌కు పెళ్లంట‌!

తన చిరకాల ప్రియుడు రోహన్ ఠక్కర్ తో అన్షుల‌ తన నిశ్చితార్థం గురించి అధికారికంగ ప్ర‌క‌టించింది. అత‌డు నేల‌పై మోక‌రిల్లి త‌న ప్రేయ‌సికి ప్రేమ‌ను వ్య‌క్తం చేస్తూ డైమండ్ రింగ్ తొడిగిన ఫోటోలు ఇప్పుడు వైర‌ల్ గా మారాయి. న్యూయార్క్ నగరంలోని సెంట్రల్ పార్క్ లో ప్రియుడి ప్రపోజల్ ఫోటోలను అన్షులా కపూర్ ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఈ పోస్ట్ కి చాలా ప్రేమ ద‌క్కింది. వెంట‌నే ఆలియా భట్, ప్రియాంక చోప్రా అన్షులా కపూర్ కు తమ ల‌వ్ ని విషెస్‌ను పంపారు.

రోహన్ అలా అందంగా ప్ర‌పోజ్ చేస్తుంటే, అన్షులాలో ఆనందం ఆవ‌ర్ణం కాగా, త‌న‌ను తాను మైమ‌రిచిపోయి క‌నిపించింది. సెంట్రల్ పార్క్‌లోని చారిత్రాత్మక కోట సమీపంలో పియర్ షేప్ వ‌జ్ర‌పు ఉంగరాన్ని అత‌డు అన్షుల వేలికి తొడిగాడు. అన్షులా కపూర్ కి జాన్వీ క‌పూర్, ఖుషి క‌పూర్ కి ఉన్నంత ఫోక‌స్ లేదు. అన్షులా పూర్తిగా రిజ‌ర్వ్ డ్.. న‌ట‌నా రంగంలోకి కూడా రాలేదు. ఒక స్టార్ ప్రొడ్యూస‌ర్ కుమార్తె, ఒక యంగ్ హీరో సోద‌రిగా మాత్ర‌మే సెల‌బ్రిటీ ప్ర‌పంచం గుర్తిస్తుంది. అన్షులాకు జాన్వీ, ఖుషి శుభాకాంక్ష‌లు తెలిపారు.

Tags:    

Similar News