• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సలార్ ఒక్క రాత్రిలోనే...

సలార్ ఒక్క రాత్రిలోనే బాక్సాఫీస్ షేక్

| ఇప్పటికే ట్రైలర్, ఫస్ట్ సింగిల్ తో సూపర్ క్రేజ్ సంపాదించుకోగా.. నిన్న మూవీ టీమ్ మరో సాలిడ్ ట్రైలర్ ను రిలీజ్ చేసి ప్రభాస్ అభిమానులను మరింత ఖుషీ చేసింది.

By - Tupaki Desk
Update: 2023-12-19 08:52 GMT

పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలుగు సినిమాల్లో సలార్‌ ఒకటి. కేజీఎఫ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌, స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ కాంబోలో తెరకెక్కిన ఈ మూవీ మరో మూడు రోజుల్లో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. క్రిస్మస్ కానుకగా విడుదలవుతున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

కాగా ఈ సినిమా రెండు పార్టులుగా రాబోతుంది. ఇప్పటికే ట్రైలర్, ఫస్ట్ సింగిల్ తో సూపర్ క్రేజ్ సంపాదించుకోగా.. నిన్న మూవీ టీమ్ మరో సాలిడ్ ట్రైలర్ ను రిలీజ్ చేసి ప్రభాస్ అభిమానులను మరింత ఖుషీ చేసింది. రెండు రోజులుగా ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ లో జోష్ నింపింది. భారీ యాక్షన్ సన్నివేశాలతో నిండిపోయిన ఈ ట్రైలర్ సినిమాపై ఒక్కసారిగా బజ్ పెంచేసింది.

నిజానికి.. మిగతా సినిమాలతో పోలిస్తే సలార్ ప్రమోషన్ కార్యక్రమాలు బాగా తక్కువే. ఇదే సమయంలో ట్రైలర్ రిలీజ్ చేయడం బాగా వర్కౌట్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులను ఎంతో ఆకట్టుకున్న ఈ ట్రైలర్.. ప్రీ బుకింగ్స్ పై భారీగా ప్రభావం చూపించింది. ఉత్తర అమెరికాలో ఒక్క రాత్రిలోనే 2.5లక్షల డాలర్లను వసూలు చేసింది.

సాధారణంగా ఒకేసారి ఇంత మొత్తంలో వసూళ్లు పెరగడం.. ప్రీమియర్ షోలు పడిన తర్వాత జరుగుతుంది. కానీ సలార్ సినిమా విషయంలో ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఇలా జరిగింది. దీంతో ప్రశాంత్ నీల్ స్కెచ్ అదిరిపోయిందని సినీ పండితులు చెబుతున్నారు. యూఎస్ లో సలార్ వసూళ్లు భారీ స్థాయిలో రాబడుతుందని అంటున్నారు.

ట్రైలర్ విషయానికి వస్తే.. మొదటి ట్రైలర్ లాగానే రెండో ట్రైలర్ మొత్తం కూడా భారీ యాక్షన్ సన్నివేశాలతో నిండిపోయింది. తండ్రి కుమారుడికి సుల్తాన్ కథ చెప్పడంతో ప్రారంభమైంది. ప్రభాస్ ఎంట్రీ అదిరిపోయింది. ప్రశాంత్ నీల్ మార్క్ బాగా కనిపించింది. చివరకు ఈ కథ ప్రాణ స్నేహితులను శత్రువులుగా మార్చడమే అంటూ.. మొదటి పార్ట్ వీరిద్దరూ శత్రువులుగా మారే దగ్గర ఆగుతుందన్నట్టుగా హింట్ ఇచ్చారు దర్శకుడు.

Tags:    
  • Salaar 
  • Prabhas 
  • Prithvirajsukumaran 
  • Prashanthneel 
  • Boxoffice 

Similar News

రామ్, జెనీలియా స్నేహం.. ఇప్పటికీ అదే అనుబంధం!

2026-11-08 06:32 GMT

బ్లాక్ శారీలో తృప్తి డిమ్రీ మెరుపులు.. దీపావళి పార్టీ లుక్ వైరల్!

2026-11-08 06:11 GMT

పెద్ద రహస్యం బయటపెడతాను అంటున్న స్టార్ హీరో..!

2026-11-08 06:01 GMT

దర్శకుడిగా రాపిడో డ్రైవర్.. అసలు విషయం చెప్పిన వెంకీ కుడుముల

2026-11-08 05:48 GMT

శ్రీలీల కీలక నిర్ణయం.. ఇక ఈ హీరోయిన్ జోరు ఆపేవాళ్ళు ఎవరు గురు..!

2026-11-08 05:46 GMT

రావణుడిగా ప్రభాస్…అంత ఘోర అవమానం తరువాత ఇది అవసరమా..!

2026-11-08 04:55 GMT

మణిరత్నం.. చిరంజీవి..ఓ తమిళ దళపతి..!

2026-11-08 04:54 GMT

రామాయణం తీస్తూ రాముడినే మర్చిపోయారా?

2026-11-08 04:54 GMT

9వ వారం ఎలిమినేషన్ క్యాన్సిల్!

2026-11-08 04:43 GMT

యంగ్ హీరోల పాన్ ఇండియా 2027 టార్గెట్ ప్లాన్స్!

2026-11-07 17:30 GMT

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

Copyright @2026

Powered by Blink CMS