తప్పు తెలుసుకుని మళ్లీ అదే బాటలోకి..
సౌత్ లోని స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న అంజలి, తన నేచురల్ యాక్టింగ్ తో ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకుంది.;
ఇండస్ట్రీలో ఎప్పుడెలాంటి పరిస్థితులు ఎదురవుతాయో ఎవరూ చెప్పలేం. కొన్నిసార్లు ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారితే, మరికొన్ని సార్లు అదే ఒక్క సినిమా వారి కెరీర్ ను చాలా డ్యామేజ్ చేస్తోంది. ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన సినిమాలు డిజాస్టర్లుగా మారితే, అసలెలాంటి ఆశలు లేకుండా చేసిన సినిమాలు మాత్రం సూపర్ హిట్లు గా మారి అందరినీ ఆశ్చర్యపరుస్తాయి.
తప్పు తెలుసుకున్న అంజలి
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ సినిమాపై తెలుగమ్మాయి అంజలి కూడా రిలీజ్ కు ముందు ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఆ సినిమా తన కేరీర్లో గేమ్ ఛేంజర్ గా మారుతుందని అంజలి ఓ రకంగా అనుకుంటే ఆ సినిమా ఫలితం మరో రకంగా గేమ్ ఛేంజర్ గా నిలిచింది. ఆ సినిమా డిజాస్టర్ అవడంతో అంజలి తాను తీసుకున్న డెసిషన్ కరెక్ట్ కాదని తెలుసుకుని, రిలీజ్ తర్వాత కూడా ఎక్కడా ఆ సినిమా గురించి మాట్లాడలేదు.
లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై ఇంట్రెస్ట్
సౌత్ లోని స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న అంజలి, తన నేచురల్ యాక్టింగ్ తో ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకుంది. కొన్నాళ్ల పాటూ హీరోల సరసన హీరోయిన్ గా నటించిన అంజలి ఆ తర్వాత అందరి మాదిరిగానే లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై ఇంట్రెస్ట్ చూపించి, గీతాంజలి, చిత్రాంగద, గీతాంజలి మళ్లీ వచ్చింది లాంటి సినిమాలు చేసి ఎంతోమంది పేరుతో పాటూ పలు అవార్డులను కూడా గెలుచుకుంది.
కానీ మధ్యలో గేమ్ ఛేంజర్ ఆఫర్ రావడంతో వాటన్నింటినీ పక్కన పెట్టి దానిపైనే ఎన్నో ఆశలు పెట్టుకున్న అంజలికి ఆ సినిమా ఎంతో నిరాశను మిగల్చడంతో ఇప్పుడు తిరిగి తన కెరీర్ పై ఫోకస్ చేసి పాత దారిలోకే వెళ్తోంది. అందులో భాగంగానే ఓ లేడీ ఓరియెంటెడ్ థ్రిల్లర్ ను చేయబోతుంది అంజలి. సాఫ్ట్‌వేర్ సుధీర్, గాలోడు ఫేమ్ రాజశేఖర్ రెడ్డి దర్శక్వంలో తెరకెక్కనున్న ఓ సినిమాకు అంజలి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా శుక్రవారం ఆ సినిమాను హైదరాబాద్ లో మొదలు కూడా పెట్టింది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ లో అంజలి చాలా పవర్‌ఫుల్ రోల్ చేయనున్నట్టు తెలుస్తోంది.