అనిరుధ్ ఒక్కడే కాదు.. టాప్- 5 సంగీత దర్శకులు ఫెయిల్!
ఏదైనా బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్ తెరకెక్కించడం అంటే ఆ దర్శకుడికి అది పెద్ద సవాల్ లాంటిది. ప్రజల్లో భారీగా పెరిగిన అంచనాలను అందుకోవాల్సి ఉంటుంది.
ఏదైనా బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్ తెరకెక్కించడం అంటే ఆ దర్శకుడికి అది పెద్ద సవాల్ లాంటిది. ప్రజల్లో భారీగా పెరిగిన అంచనాలను అందుకోవాల్సి ఉంటుంది. సంగీతం విషయంలోను ఇది వర్తిస్తుంది. చార్ట్ బస్టర్ హిట్ అయిన మొదటి సినిమాని మించిన సంగీతం అందించకపోతే తీవ్రమైన విమర్శల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అనిరుధ్ విషయంలోను ఇలాంటి అంచనాలే వేడెక్కిస్తున్నాయి. అతడు జైలర్ 2 కోసం ఎంతగా శ్రమించినా కానీ, ట్యూన్లు జనాలకు ఎక్కడం లేదు. అనిరుధ్ మళ్లీ అవే పాత పాటల్ని థీమ్ మ్యూజిక్ ని అందిస్తున్నాడంటూ పెదవి విరిచేస్తున్నాదు.
ఇంతకుముందు అనిరుధ్ కంటే ముందు కూడా చాలా మంది సంగీత దర్శకులు సీక్వెల్ చిత్రాలకు మొదటి భాగానికి ఇచ్చిన మ్యూజిక్ ని చార్ట్ బస్టర్ పాటల్ని ఇవ్వలేకపోయారు. మొదటి భాగానికి అద్భుతమైన చార్ట్‌బస్టర్ హిట్లు ఇచ్చి, సీక్వెల్‌లో ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేయడం ప్రతిసారీ సాధ్యం కాలేదు వీళ్లకు. ప్రేక్షకుల భారీ అంచనాలను అందుకోలేక వీరంతా తీవ్ర విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఉన్న అనిరుధ్ రవిచందర్ విషయంలోనూ సరిగ్గా ఇదే జరుగుతోంది. `జైలర్` చిత్రానికి ఆయన అందించిన పాటలు -బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఏ స్థాయిలో సంచలనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా `హుకుమ్` వంటి మాస్ యాంథెమ్ సినిమా అంచనాలను తారాస్థాయికి చేర్చింది.
అయితే ఇప్పుడు `జైలర్ 2' సినిమా కోసం అనిరుధ్ ఎంతగా శ్రమిస్తున్నప్పటికీ, ఆ ట్యూన్లు జనాలకు ఆశించిన స్థాయిలో ఎక్కడం లేదనే చర్చ నడుస్తోంది. మొదటి భాగంతో పోలిస్తే సీక్వెల్ జ్యూక్‌బాక్స్ విషయంలో అంచనాలు పూర్తిగా నెరవేరలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అనిరుధ్ మళ్లీ అవే పాత పాటల ఛాయలను, థీమ్ మ్యూజిక్‌ను రిపీట్ చేస్తున్నాడంటూ కొందరు పెదవి విరుస్తున్నారు.
ఇలాంటి సవాళ్లను ఎదుర్కొన్నది కేవలం అనిరుధ్ ఒక్కడే కాదు. గతంలో ఎంతో మంది ప్రముఖ సంగీత దర్శకులు కూడా సీక్వెల్ చిత్రాలకు మొదటి భాగానికి ఇచ్చినంత అద్భుతమైన చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌లను అందించలేక విమర్శలను ఎదుర్కొన్నారు. భారీ అంచనాల ఒత్తిడి కారణంగా ఒరిజినల్ మూవీ ఇచ్చిన మ్యూజికల్ కిక్‌ను సీక్వెల్స్‌లో పునరావృతం చేయడం చాలా మందికి సాధ్యపడలేదు.
గతంలోను ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్న సంగీత దర్శకుల జాబితాను తిరగేస్తే....
దేవి శ్రీ ప్రసాద్ (పుష్ప సిరీస్): టాలీవుడ్‌లో సెన్సేషనల్ హిట్ అయిన `పుష్ప: ది రైజ్` సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ అందించిన పాటలు- బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. అయితే దీనికి సీక్వెల్‌గా వచ్చిన `పుష్ప 2: ది రూల్` ఆడియో అంచనాలను పూర్తిగా అందుకోలేదనే విమర్శలు వినిపించాయి. మొదటి భాగం రేంజ్‌లో కొత్తదనం లేదంటూ కొంతమేర నిరాశ వ్యక్తమైంది.
ఎస్.ఎస్. తమన్ (అఖండ , ఇతర సీక్వెల్స్):
తమన్ తనదైన మాస్ బీట్స్‌తో పలు చిత్రాలకు హై ఇంటెన్సిటీ మ్యూజిక్ అందిస్తుంటారు. అయితే సూపర్ హిట్ సినిమాలకు సీక్వెల్స్ చేసేటప్పుడు పాత ట్యూన్ల ఛాయలే మళ్లీ రిపీట్ అవుతున్నాయనే విమర్శలను ఆయన కూడా తరచూ ఎదుర్కొంటుంటారు. అంచనాలు భారీగా ఉన్నప్పుడు ఆ మ్యాజిక్‌ను పునరావృతం చేయడం ప్రతిసారీ కష్టమవుతుందని సినీ విశ్లేషకులు భావిస్తుంటారు.
హారిస్ జయరాజ్ (సామి 2 - ధృవ నక్షత్రం):
ఒకప్పుడు వరుస మ్యూజికల్ హిట్లు ఇచ్చిన హారిస్ జయరాజ్ కెరీర్‌లో సీక్వెల్స్ కొంత ఇబ్బందికరంగా మారాయి. విక్రమ్ హీరోగా వచ్చిన బ్లాక్‌బస్టర్ సినిమా `సామి`కి సీక్వెల్‌గా వచ్చిన `సామి 2` (సామి స్క్వేర్) ఆడియో మొదటి భాగం అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఒరిజినల్ మూవీ ఇచ్చిన మ్యూజికల్ కిక్‌ను ఈ సీక్వెల్ ఇవ్వలేకపోవడంతో పెద్దఎత్తున పెదవి విరిచారు.
యువన్ శంకర్ రాజా (బిల్లా 2):
అజిత్ హీరోగా నటించిన స్టైలిష్ యాక్షన్ చిత్రం `బిల్లా`కు యువన్ శంకర్ రాజా అందించిన రీమేక్ మ్యూజిక్ - బీజీఎం ట్రెండ్ సెట్ చేశాయి. కానీ దీనికి ప్రీక్వెల్- సీక్వెల్‌గా వచ్చిన `బిల్లా 2` సినిమాలోని పాటలు.. నేపధ్య సంగీతం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. ఒరిజినల్ సినిమా స్థాయిని నిలబెట్టడంలో సంగీతం పరంగా కొంత వెనుకబడ్డారనే విమర్శలు వచ్చాయి.
జి.వి. ప్రకాష్ కుమార్ (ఆయ్ ద నేమ్ .. ఇతర సీక్వెల్ ప్రాజెక్ట్‌లు):
తమిళ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జి.వి. ప్రకాష్ కుమార్ సైతం కొన్ని సీక్వెల్ - ఫ్రాంచైజీ చిత్రాల విషయంలో అంచనాలను అందుకోవడంలో తడబడ్డారు. మొదటి భాగం ఇచ్చిన హై టెక్నికల్ స్టార్డర్డ్స్‌ను, తర్వాతి భాగాల్లో రిపీట్ చేయలేకపోవడంతో ఆ ఆల్బమ్స్ సోషల్ మీడియాలో విమర్శలను ఎదుర్కొన్నాయి.