ఆ మాట చెప్పడానికి గట్స్ ఉండాలబ్బా..!

కోలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ తెలుగులో కూడా అదరగొడుతున్నాడు.;

Update: 2025-08-03 07:52 GMT

కోలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ తెలుగులో కూడా అదరగొడుతున్నాడు. అనిరుద్ మ్యూజిక్ ఇస్తున్న సినిమా అంటే చాలు సాంగ్స్ సూపర్ హిట్ తో పాటు బిజిఎం అదిరిపోతుందని ఫిక్స్ అవుతున్నారు. ఐతే అనిరుద్ ఏం చేసినా సరే అదో సంచలనం సృష్టిస్తుంది. ముఖ్యంగా సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఇస్తున్న మ్యూజిక్ అయితే వేరే లెవెల్ అనిపిస్తుంది. అఫ్కోర్స్ అనిరుద్ అందరి హీరోలకు కూడా అదే రేంజ్ మ్యూజిక్ ఇస్తాడు. రజినీ మీద ఉన్న ప్రేమ అభిమానం కొద్దీ ఆయన సినిమాలకు ఇంకాస్త ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తాడు.

ఒక సాంగ్ కోసం తాను చాట్ జిపీటీ సజెషన్..

ఐతే ఈమధ్యనే అనిరుద్ ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. రజినీ కూలీ సినిమాకు తాను ఇచ్చిన మ్యూజిక్ కి వస్తున్న రెస్పాన్స్ కి సూపర్ హ్యాపీ గా ఉన్నాడు అనిరుద్. ఐతే ఆ సినిమాలో ఒక సాంగ్ కోసం తాను చాట్ జిపీటీ సజెషన్ తీసుకున్నా అని అన్నాడు అనిరుద్. ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయడానికి ఒక కంపోజిషన్ దగ్గర తాను ఆగిపోగా ఆ టైం లో చాట్ జీపీటీ హెల్ప్ తీసుకున్నా. అది ఇచ్చిన ఒక 10 ఆప్షన్స్ లో ఒకటి తనకు ఉపయోగపడిందని అన్నాడు అనిరుద్.

సో అనిరుద్ చేసిన కూలీ సినిమాలో ఒక సాంగ్ చాట్ జీపీటీ ఇచ్చిన హెల్ప్ తోనే చేశాడన్నమాట. ఐతే అదేంటి అన్నది మాత్రం అనిరుద్ రివీల్ చేయలేదు. మొత్తానికి చాట్ జీపీటీని వాడి అనిరుద్ ఇలా ఒక కంపోజిషన్ పూర్తి చేయడం ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేసింది. అనిరుద్ ఇలాంటివి బయటకి చెప్పడం కూడా ఆడియన్స్ ని షాక్ అయ్యేలా చేస్తుంది.

కింగ్ డమ్ సినిమాకు అనిరుద్ మ్యూజిక్..

సాధారణంగా అయితే ఇలాంటివి చేసినా ఎక్కడ తన పేరుకి భంగం కలుగుతుందో అని బయటకు చెప్పరు. కానీ అనిరుద్ మాత్రం అలాంటివేవి ఆలోచించకుండా చేశాడు. తెలుగులో ఈమధ్యనే వచ్చిన కింగ్ డమ్ సినిమాకు అనిరుద్ మ్యూజిక్ ఇచ్చాడు. ఆ సినిమాలో అనిరుద్ మ్యూజిక్ హైలెట్ అయ్యింది.

నెక్స్ట్ టాలీవుడ్ లో కూడా కొన్ని క్రేజీ సినిమాలకు అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. తమిళ్ తో పాటు తెలుగులో కూడా అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ ట్రెండింగ్ లో ఉంటుంది. అతను ఏ సినిమాకు మ్యూజిక్ ఇచ్చినా సరే అది సూపర్ హిట్ అవుతుంది.

Tags:    

Similar News