• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అర్జున్‌ రెడ్డి వర్సెస్‌...

అర్జున్‌ రెడ్డి వర్సెస్‌ యానిమల్‌... ఎవరిది పై చేయి?

| ప్రస్తుతం తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ పేరు సౌత్ లోనే కాకుండా నార్త్‌ లో కూడా మారుమ్రోగుతున్న విషయం తెల్సిందే.

By - Tupaki Desk
Update: 2023-12-26 07:15 GMT

ప్రస్తుతం తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ పేరు సౌత్ లోనే కాకుండా నార్త్‌ లో కూడా మారుమ్రోగుతున్న విషయం తెల్సిందే. అర్జున్‌ రెడ్డి సినిమా తో ఇక్కడి వారి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు అదే సినిమాను హిందీలో కబీర్‌ సింగ్ గా రీమేక్ చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అర్జున్‌ రెడ్డి ని మించి కబీర్ సినిమా హిట్ అయ్యింది.

తాజాగా సందీప్ వంగ 'యానిమల్‌' సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బాలీవుడ్‌ స్టార్‌ రణబీర్ కపూర్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్‌ గా రూపొందిన యానిమల్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అర్జున్‌ రెడ్డి, కబీర్‌ సింగ్‌ సినిమాలను మించిన వసూళ్లు యానిమల్‌ వసూళ్లు చేసింది. లాంగ్‌ రన్‌ లో వెయ్యి కోట్ల మార్క్ ను టచ్‌ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ సమయంలో యానిమల్‌ తెలుగు వర్షన్‌ ఎంత వసూళ్లు చేసింది అనే విషయమై ఆసక్తి నెలకొంది. ఎట్టకేలకు యానిమల్‌ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో పంపిణీ చేసిన నిర్మాత దిల్‌ రాజు క్లారిటీ ఇచ్చాడు. తాజా మీడియా సమావేశంలో యానిమల్‌ సినిమా ఇప్పటి వరకు రూ.60 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను వసూళ్లు చేసినట్లు ఆయన పేర్కొన్నాడు.

సలార్‌ విడుదల తర్వాత యానిమల్‌ సినిమా కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. అయినా కూడా యానిమల్‌ సినిమా తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్‌ వసూళ్లను నమోదు చేసినట్లుగా బాక్సాఫీస్ వర్గాల వారు చెప్పుకుంటూ ఉన్నారు. తెలుగు బాక్సాఫీస్ వద్ద యానిమల్‌ దక్కించుకున్న వసూళ్లు అర్జున్‌ రెడ్డి వసూళ్ల కంటే ఎక్కువ అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు అంటున్నారు.

అర్జున్ రెడ్డి సినిమా తెలుగు రాష్ట్రాల్లో కేవలం రూ.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను దక్కించుకుంది. విజయ్ దేవరకొండ అర్జున్‌ రెడ్డి లాంగ్‌ రన్‌ లో దాదాపుగా రూ.26 కోట్ల షేర్‌ ను సాధించడం జరిగింది. యానిమల్‌ సినిమా దాదాపుగా రూ.32 కోట్ల షేర్‌ ను దక్కించుకుంది అంటూ సమాచారం అందుతోంది.

ఈ ఆసక్తికర పోరులో అర్జున్‌ రెడ్డి పై తెలుగు యానిమల్‌ స్పష్టమైన ఆధిపత్యం ను కనబర్చాడు. అంతే కాకుండా యానిమల్ సినిమా ఓవరాల్‌ గా దక్కించుకున్న వసూళ్లు కూడా కబీర్‌ సింగ్‌ లాంగ్‌ రన్ వసూళ్లకు దాదాపు రెట్టింపు ఉన్నాయి అంటూ బాక్సాఫీస్ వర్గాల ద్వారా టాక్‌.

Tags:    
  • Animal 
  • Arjunreddy 
  • Sandeepreddyvanga 
  • Vijaydevarakonda 
  • Ranabirkapoor 
  • Boxoffice 

Similar News

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

Copyright @2026

Powered by Blink CMS