1 నేనొక్కడినే ట్రైలర్.. వెనక ఏం జరిగింది..?

సూపర్ స్టార్ మహేష్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా 1 నేనొక్కడినే. ఈ కాంబో మీద ఉన్న అంచనాలకు సినిమా బ్లాక్ బస్టర్ కొట్టేస్తుందని అనుకున్నారు.;

Update: 2026-01-06 09:56 GMT

సూపర్ స్టార్ మహేష్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా 1 నేనొక్కడినే. ఈ కాంబో మీద ఉన్న అంచనాలకు సినిమా బ్లాక్ బస్టర్ కొట్టేస్తుందని అనుకున్నారు. అంతేకాదు ఈ సినిమాలో మహేష్ తో పాటు వారసుడు గౌతం కృష్ణ కూడా అందులో క్యామియో చేశాడు. ఇన్ని అంశాలు ఉన్న ఈ సినిమా 2014 సంక్రాంతికి వచ్చి నిరాశ పరిచింది. సినిమా చూసిన సూపర్ స్టార్ ఫ్యాన్స్ మహేష్ యాక్టింగ్ కి ఫిదా అయినా కూడా సినిమా ఫలితం డిజప్పాయింట్ చేసింది. ఐతే ఆ సినిమా టైంలో ట్రైలర్ రిలీజ్ చేయకపోవడం వెనుక ఉన్న కారణం నిర్మాత అనిల్ సుంకర బయట పెట్టారు.

ట్రైలర్ రిలీజ్ చేస్తే ఓపెనింగ్స్ మీద ఎఫెక్ట్..

1 నేనొక్కడినే సినిమాకు మొదటిసారి లైవ్ ట్రైలర్ రిలీజ్ చేద్దామని దేశం మొత్తం కొన్ని థియేటర్స్ లో ఏర్పాటు చేశామని.. ఐతే ఆడియో రిలీజ్ టైంలో ఫ్యాన్స్ తో మహేష్ మాట్లాడటం కూడా అదే మొదటిసారి.. ఐతే ఇక ట్రైలర్ రిలీజ్ చేసే టైంలో ఈ ట్రైలర్ రిలీజ్ చేస్తే ఓపెనింగ్స్ మీద ఎఫెక్ట్ పడుతుందని ఎవరో అన్నారు. దాని వల్ల ఆ ట్రైలర్ రిలీజ్ చేయలేదు.

ఆ తర్వాత క్రిస్ మస్ కి ఒక యాక్షన్ కట్ టీజర్ ని రిలీజ్ చేశాం.. ఐతే సినిమా చూసిన ఆడియన్స్ షాక్ అయ్యారు. ఆ తర్వాత మేమంతా ముందే కథ ట్రైలర్ లో చెప్పి ఉంటే కాస్త ఎంగేజ్ అయ్యే వారని అనుకున్నామని నిర్మాత అనిల్ సుంకర చెప్పారు. రాజమౌళి ముందే కథ చెప్పేస్తారు.. అలా చేయాల్సింది కానీ కుదరలేదని అన్నారు.

1 నేనొక్కడినే సినిమా టెక్నికల్ గా..

1 నేనొక్కడినే సినిమా టెక్నికల్ గా హై ఉంటుంది. కానీ ఆ సినిమాకు ఆడియన్స్ ని ప్రిపేర్ చేయడంలో డైరెక్టర్ సుకుమార్ ఫెయిల్ అయ్యాడు. సినిమా ఎలా ఉంటుంది అన్నద్ది ఆడియన్స్ కి ముందే ఒక హింట్ ఇస్తే అదే అంచనాలతో ఉండే వాళ్లు. అలా ట్రైలర్ లేకుండా రిలీజ్ చేయడం వల్ల సినిమా మీద హ్యూజ్ ఎక్స్ పెక్టేషన్స్ ఉండటం వల్ల 1 సినిమా రిజల్ట్ అలా వచ్చింది.

అఫ్కోర్స్ సినిమా డిజప్పాయింట్ చేసినా మహేష్ బాబు నటన, సుకుమార్ టేకింగ్ కి ప్రశంసలు వచ్చాయి. ఐతే ఆ సినిమా గురించి ఇప్పటికీ ఆడియన్స్ లో ఒక సెపరేట్ డిస్కషన్ జరుగుతుంది. ఈ సినిమాలో దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాకు మంచి హైప్ ఇచ్చింది. కేవలం సినిమా కథ ఇది అని ముందే ఆడియన్స్ కి ఒక హింట్ ఇవ్వకపోవడం వల్లే సినిమా ఆడియన్స్ కి ఎక్కలేదని ఈ సినిమా నిర్మాతలు ఇప్పటికీ చెబుతున్నారు.

Tags:    

Similar News