నాగ్ తో సినిమాపై అనిల్ క్లారిటీ
ఆల్రెడీ సినిమా నుంచి రిలీజైన రెండు సాంగ్స్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రాగా తాజాగా థర్డ్ సింగిల్ ను రిలీజ్ చేశారు.;
టాలీవుడ్ లో రాజమౌళి తర్వాత అపజయమెరుగని డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న అనిల్ రావిపూడి ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో మన శంకరవరప్రసాద్ గారు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. జనవరి 12న మన శంకరవరప్రసాద్ గారు రిలీజ్ కానుండగా అందరికీ ఈ మూవీపై మంచి అంచనాలున్నాయి.
ఇన్‌స్టంట్ చార్ట్‌బస్టర్ గా సంక్రాంతి స్పెషల్ సాంగ్
ఆల్రెడీ సినిమా నుంచి రిలీజైన రెండు సాంగ్స్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రాగా తాజాగా థర్డ్ సింగిల్ ను రిలీజ్ చేశారు. చిరంజీవి, వెంకటేష్ పై తెరకెక్కిన ఈ సంక్రాంతి స్పెషల్ సాంగ్ ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది. మాస్ బీట్, పండగ వాతావరణంతో పాటూ ఇద్దరి హీరోల ఎనర్జీ సాంగ్ ను ఇన్‌స్టంట్ చార్ట్‌బస్టర్ గా నిలిపాయి. ఈ సాంగ్ తర్వాత మూవీపై ఇంకా బజ్ పెరిగింది.
ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్స్ లో అనిల్ చాలా యాక్టివ్ గా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకొస్తున్న అనిల్ కు రీసెంట్ గా ఓ ఇంట్రెస్టింగ్ ప్రశ్న ఎదురైంది. ఆల్రెడీ వెంకటేష్, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి టాలీవుడ్ లోని సీనియర్ హీరోలతో సినిమాలు చేశారు. మరి నాగార్జునతో ఎప్పుడు అని అడగ్గా దానిపై అనిల్ క్లారిటీ ఇచ్చారు.
హలో బ్రదర్ లాంటి సినిమా చేస్తా
ఈ విషయాన్ని అందరూ అడుగుతున్నారని, అవకాశమొస్తే కచ్ఛితంగా చేస్తానని, ఆయనతో కూడా చేస్తే టాలీవుడ్లోని సీనియర్లందరితో సినిమాలు చేసినట్టు అవుతుందని, రానున్న రెండు మూడేళ్లలో ఏమైనా కుదురుతుందేమో చూద్దామని, ఛాన్స్ వస్తే ఆయనతో హలో బ్రదర్ లాంటి సినిమా చేస్తానని చెప్పారు. అనిల్ చెప్పినట్టు ఆ ఛాన్స్ వస్తే మాత్రం నాగ్ ఖాతాలో ఓ మంచి సినిమా పడే అవకాశముంటుంది. కాగా అనిల్, వెంకీతో ఎఫ్2, ఎఫ్3, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు చేయగా, బాలకృష్ణతో భగవంత్ కేసరి చేశారు. ఇప్పుడు చిరూతో మన శంకరవరప్రసాద్ గారు చేశారు. నాగ్ ను కూడా కవర్ చేస్తే నలుగురు సీనియర్ స్టార్లతో సినిమాలు చేసిన రికార్డును ఖాతాలో వేసుకోవచ్చు.