హిట్ మెషీన్ త‌న‌ని ఎందుకు ప‌క్క‌న పెట్టిన‌ట్టు?

బాక్సాఫీస్ వ‌ద్ద వ‌రుస‌గా మ్యాజిక్‌లు చేస్తూ సింపుల్ స్టోరీ లైన్‌ల‌తో కోట్లు కొల్ల‌గొడుతూ హిట్ మెషీన్ అనిపించుకుంటున్నాడు.

Update: 2026-07-01 12:30 GMT

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్స్ ఎలా జ‌క్క‌న్న సెట్ చేసిన మార్క్‌ని ట‌చ్ చేయాల‌ని ఆప‌సోపాలు ప‌డుతూ బాక్సాఫీస్ వ‌ద్ద బొక్క‌బోర్లాప‌డుతుంటే ఫ్యామిలీ డ్రామాల‌ని న‌మ్ముకుంటూ వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్ల‌ని సొంతం చేసుకుంటున్నారు హిట్ మెషీన్ అనిల్ రావిపూడి. `ప‌టాస్‌`లో మ‌ద‌ర్స్ ఎపిసోడ్‌తో వావ్ అనిపించిన సెంటిమెంట్‌ని బాగానే వ‌ర్క‌వుట్ చేసిన అనిల్ ఆ త‌రువాత సినిమాల‌కు అదే ఫ్యామిలీ సెంటిమెంట్ ని ఫాలో అవుతూ వ‌రుస విజ‌యాల్ని త‌న ఖాతాలో వేసుకుంటున్నాడు.

బాక్సాఫీస్ వ‌ద్ద వ‌రుస‌గా మ్యాజిక్‌లు చేస్తూ సింపుల్ స్టోరీ లైన్‌ల‌తో కోట్లు కొల్ల‌గొడుతూ హిట్ మెషీన్ అనిపించుకుంటున్నాడు. సింపుల్ ఫ్యామిలీ ఐడియాతో `ఎఫ్‌2`ని బ్లాక్ బ‌స్ట‌ర్ చేసిన అనిల్ రావిపూడి ఆ త‌రువాత కూడా అదే ఫార్ములాని వాడుకుంటూ ఎఫ్ 3, వెంకీ మామాతో `సంక్రాంతికి వ‌స్తున్నాం`, మెగాస్టార్ చిరంజీవితో `మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు` వంటి బ్లాక్ బ‌స్టర్ల‌ని అందించి అంద‌రిని అవాక్క‌య్యేలా చేశారు. ఇప్పుడు ఇదే ఫార్ములాని ఫాలో అవుతూ వెంక‌టేష్‌, క‌ల్యాణ్ రామ్‌ల‌తో రోమ్ కామ్‌ని తెర‌పైకి తీసుకొస్తున్నారు.

కీర్తి సురేష్‌, కృతిశెట్టి హీరోయిన్‌లుగా న‌టిస్తున్నారు. అనిల్ మార్కు ప‌క్కా ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ అప్పుడే మొద‌లు పెట్టిన అనిల్ వ‌చ్చే ఏడాది సంక్రాంతికి దీన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్నాడు. దీనికి సంబంధించిన షూటింగ్ ప్ర‌స్తుతం హైద‌రాబాద్ శివారులోని మోకిలా గ్రామంలో జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన ఒక‌రిని అనిల్ ప‌క్క‌న పెట్టిన‌ట్టుగా తెలిసింది.

త‌నే మ్యూజిక్ డైరెక్ట‌ర్‌ భీమ్స్ సిసిరోలియో. అనిల్ చేసిన బ్లాక్ బ‌స్ట‌ర్స్ `సంక్రాంతికి వ‌స్తున్నాం`, `మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ గారు` సినిమాల‌కు బ్యాక్ టు బ్యాక్ భీమ్స్ సిసిరోలియో వ‌ర్క్ చేశాడు. `సంక్రాంతికి వ‌స్తున్నాం` స్టోరీ లేక‌పోయినా స‌క్సెస్ అయిందంటే దానికి ప్ర‌ధాన కార‌ణం ఒక‌టి చైల్డ్ ఆర్టిస్ట్ బుల్లిరాజు, రెండు భీమ్స్ సిసిరోలియో అందించిన సాంగ్స్‌. బ్యాగ్రౌండ్ స్కోర్‌.

అలాంటి హిట్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌ని అనిల్ రావిపూడి కొత్త సినిమా కోసం ప‌క్క‌న పెట్టాడ‌ట‌. ముందు సినిమా ప్రారంభించేంత వ‌ర‌కు భీమ్స్ సిసిరోలియోనే మ్యూజిక్ డైరెక్ట‌ర్ అని త‌న‌తో చెబుతూ వ‌చ్చిన డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి హ‌ఠాత్తుగా ఆ ప్లేస్‌లోకి జీవి ప్ర‌కాష్‌ని రంగంలోకి దింపాడ‌ని ఇన్ సైడ్ టాక్‌. దీంతో ముందు నుంచి వెంకీ, క‌ల్యాణ్‌రామ్‌ల సినిమాకు తానే మ్యూజిక్ డైరెక్ట‌ర్‌ని అని ఫీల‌వుతూ వ‌చ్చిన భీమ్స్ సిసిరోలియో ఒక్క‌సారిగా అనిల్ నిర్ణ‌యంతో షాక్‌కు గుర‌య్యాడ‌ని ఇండ‌స్ట్రీ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది.

Tags:    

Similar News