ఆ ఇద్ద‌రితో స్టార్ హీరోలంతా మ‌ళ్లీ మ‌ళ్లీ!

టాలీవుడ్ లో అనీల్ రావిపూడి-కోలీవుడ్ లో లోకేష్ క‌న‌గ‌రాజ్ ఇద్ద‌రు స్పెష‌ల్ డైరెక్ట‌ర్లు అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.;

Update: 2025-06-28 20:30 GMT

టాలీవుడ్ లో అనీల్ రావిపూడి-కోలీవుడ్ లో లోకేష్ క‌న‌గ‌రాజ్ ఇద్ద‌రు స్పెష‌ల్ డైరెక్ట‌ర్లు అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. అనీల్ కు ఇంత‌వ‌ర‌కూ ఒక్క ప్లాప్ లేదు. చేసిన ప్ర‌తీ సినిమా హిట్ అయింది. 'సంక్రాంతికి వ‌స్తున్నాం' సినిమాతో ఏకంగా 300 కోట్ల క్ల‌బ్లో కి అడుగు పెట్టాడు. అంత‌కు ముందు చేసిన సినిమాలు వంద‌ల కోట్లు వ‌సూళ్లు సాధించాయి. అనీల్ సినిమాలంటే అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని అల‌రించే చిత్రాలుగా ఓ ప్ర‌త్యేక మైన గుర్తింపు ఉంది.

క‌థ‌ల విష‌యంలో నేల విడిచి సాము చేయ‌డు. పాత క‌థ‌ల‌నే త‌న‌దైన మార్క్ ట్రీట‌మ్ మెంట్ తో అల‌రిస్తాడు. వాటిలో చిన్న లాజిక్ అప్లై చేసి స‌క్స‌స్ అవుతుంటాడు. ఇప్ప‌టికే క‌ళ్యాణ్ రామ్, సాయిదు ర్గ‌తేజ్, ర‌వితేజ‌, వ‌రుణ్ తేజ్, వెంట‌కేష్‌, మ‌హేష్‌, బాల‌కృష్ణ‌ల‌ను డైరెక్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. వీళ్లంతా మ‌ళ్లీ అనీల్ తో సినిమా చేయ‌డానికి సిద్దంగా ఉన్నారు. అనీల్ పిలుపే ఆల‌స్యం డేట్లు ఇవ్వ‌డానికి వాళ్లంతా రెడీగా ఉన్నారు.

వాళ్లే కాదు టైర్ 2 హీరోలు..మీడియం రేంజ్ హీరోలు చాలా మంది అనీల్ కోసం ఎదురు చూస్తున్నారు. ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవి 157వ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈసినిమా కూడా హిట్ అయితే అనీల్ రేంజ్ అంత‌కంత‌కు రెట్టింపు అవుతుంది. సీనియ‌ర్ల‌లో నాగార్జున ఒక్క‌రే పెండింగ్ ఉంటాడు. అత‌న్ని డైరెక్ట్ చేస్తే తిరుగుండ‌దు. అలాగే కోలీవుడ్ లో లోకేష్ క‌న‌గ‌రాజ్ ఇదే డిమాండ్ తో క‌నిపిస్తున్నాడు.

త‌న‌కంటూ ఓ యూనివ‌ర్శ్ క్రియేట్ చేసుకుని అందులో సినిమాలు చేస్తూ స‌క్స‌స్ అవుతున్నాడు. మ‌ధ్య మ‌ధ్య‌లో యూనివ‌ర్శ్ వ‌దిలి కొత్త కాన్సెప్ట్ ల‌ను తెర‌కెక్కిస్తున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కూ లోకేష్ తో ప‌నిచేసిన హీరోలంతా మ‌ళ్లీ సినిమాలు చేయ‌డానికి రెడీగా ఉన్నారు. ప్ర‌స్తుతం సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ తో 'కూలీ' తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలి సిందే.

ఇది రిలీజ్ అయిన వెంట‌నే 'ఖైదీ 2' ప‌ట్టాలెక్కుతుంది. అటుపై సూర్య‌తో 'రోలెక్స్' మొద‌ల‌వుతుంది. అనంత‌రం ఔట్ ఆఫ్ యూనివ‌ర్శ్ నుంచి మ‌రో సినిమా చేసే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో ఆ ఛాన్స్ కోసం చాలా మంది హీరోలు వెయిట్ చేస్తున్నారు.

Tags:    

Similar News