ఆ కమెడియన్ హిట్ మెషిన్ కి అంత క్లోజా!
చిత్ర పరిశ్రమ ఎంతో మంది స్నేహితుల్ని ఇస్తుంది. పరిశ్రమకు వచ్చే టప్పుడు ఒక్కడిగా వచ్చినా? వెళ్లే టప్పుడు మాత్రం ఎంతో మంది అభిమానుల్ని అందిస్తుంది.;
చిత్ర పరిశ్రమ ఎంతో మంది స్నేహితుల్ని ఇస్తుంది. పరిశ్రమకు వచ్చే టప్పుడు ఒక్కడిగా వచ్చినా? వెళ్లే టప్పుడు మాత్రం ఎంతో మంది అభిమానుల్ని అందిస్తుంది. పరిచయం స్నేహంగా మారాడం..ఆ స్నేహం మరింత బలంగా మారడం వంటివి జరుగుతుంటాయి. అప్పటి వరకూ సాగిన ప్రయాణం ఒక ఎత్తైతే? చిత్ర పరిశ్రమకు వచ్చిన తర్వాత సాగే ప్రయాణం మరోలా ఉంటుంది. పరిశ్రమ ఎన్నో విషయాల్ని నేర్పిస్తుంది. అలాగే ఎన్నో మోసాలు కూడా జరుగుతుంటాయి. స్నేహం పేరుతోనూ జరిగే మోసాలు అలాగే ఉంటాయి. అదే స్నేహంతో కోట్ల రూపాయలు పొగొట్టుకున్న డైరెక్టర్లు ఉన్నారు.
స్నేహం పేరుతో మోసాలు:
ఎవరు నిజాయితీ పరులు? ఎవరు స్వార్ద పరులు? అన్నది పరిశ్రమలో అంచనా వేయడం అన్నది ఒక్క రోజులో జరిగేది కాదు. కొంత కాలం పాటు కలిసి ప్రయాణం చేసిన తర్వాత ఎవరు ఎలాంటి వారు? అన్నది తెలుస్తుంది. ఇక్కడ స్నేహం పేరుతో పొడిచే వెన్నుపోట్లు ఎదురవుతుంటాయి. అన్నింటినీ తట్టుకుని నిలబడితేనే గెలుపు అనేది సాధ్యమవుతుంది. దర్శకుడు అనీల్ రావిపూడి కూడా ఇండస్ట్రీకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన వాడే. రైటర్ గా, అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించి నేడు స్టార్ డైరెక్టర్ అయ్యాడు. ఈ క్రమంలో అతడికి కొందరితో పరిచయం గొప్ప స్నేహంగా మిగిలిపోయింది.
పరిచయం ఓ గొప్ప స్నేహంగా:
కొంత మంది బెస్ట్ ప్రెండ్స్ గానూ మారారు. కమెడియన్ సప్తగిరి అనీల్ కి మంచి ప్రెండ్. ఇద్దరు కలిసి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసారు. ఆ తర్వాత సప్తగిరి నటుడిగా స్థిరపడితే? అనీల్ పెద్ద డైరెక్టర్ గా ఎదిగాడు. అలాగే `అదిరే అభి` కూడా అనీల్ రావిపూడికి మరో బెస్ట్ ప్రెండ్ అని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని ఓ సినిమా ఈవెంట్లో అనీల్ రివీల్ చేసాడు. అనీల్ `గౌతమ్ ఎస్ ఎస్ సీ` సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసాడు. అందులో అదిరే అభి ఓ పాత్ర పోషించాడు. అక్కడే అతడితో అనీల్ పరిచయం. అలా మొదలైన స్నేహం బెస్ట్ ప్రెండ్స్ వరకూ దారి తీసింది.
అభి కంటే ఆది నటుడిగా బిజీ:
`కందిరీగ` సినిమాలో తెలంగాణ యాసలో డైలాగులు రాసే సమయంలో అభి తనకు సహాయం చేసినట్లు అనీల్ తెలిపాడు. అదిరే అభి నటుడిగా కంటే `జబర్దస్త్` షోతో బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. చాలా మందికి జబర్దస్త్ ద్వారా అభి అవకాశాలు కల్పించాడు. హైపర్ ఆదికి కూడా తానే అవకాశం ఇచ్చాడు. ఆది కూడా అలా వెలుగులోకి వచ్చిన కమెడియన్. ప్రస్తుతం అభి కంటే ఆది ఎక్కువగా సినిమాలు చేస్తున్నాడు. స్టార్ హీరోల చిత్రాల్లో అవకాశాలు అందుకుంటున్నాడు.