అలా నిరుత్సాహ ప‌రిస్తే ఎలా అమ్మ‌డు?

కోలీవుడ్ భామ ఆండ్రియో జ‌ర్మేనియా సినిమాలో ఉందంటే ఓ వైబ్ వ‌స్తుంది. గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు పెట్టింది పేరు గా అమ్మ‌డికి మంచి గుర్తింపు ఉంది.;

Update: 2025-11-27 15:30 GMT

కోలీవుడ్ భామ ఆండ్రియో జ‌ర్మేనియా సినిమాలో ఉందంటే ఓ వైబ్ వ‌స్తుంది. గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు పెట్టింది పేరు గా అమ్మ‌డికి మంచి గుర్తింపు ఉంది. న‌ట‌న‌తో పాటు గ్లామ‌ర్ తోనూ ఆక్టటుకోవ‌డం ఆండ్రియో ప్ర‌త్యేక‌త‌. అందుకే పోటీగా ఎంత మంది భామ‌లున్నా? ఆండ్రియోకి మాత్రం ఎవ‌రూ పోటీ కాదు. త‌న‌కు తానే పోటీగా ప‌రిశ్ర‌మ‌లో రాణిస్తోంది. గాయ‌నిగా ఎంత ఫేమ‌స్ అయిందో అంత‌కు మించి సంచ‌ల‌న న‌టిగా పేరుంది. గ్లామ‌ర్ ప‌రంగా ఏ న‌టి చేయ‌ని సాహ‌సం వెండి తెర‌పై చేయ‌డం అమ్మ‌డిలో ప్ర‌త్యేక‌త‌. ఎలాంటి పాత్ర‌లోనైనా ప‌ర‌కాయ ప్ర‌వేశం చేయ‌గ‌ల‌దు.

ఆ సీన్ పై ఠారెత్తిన ప్ర‌చారం

త‌న బ్యూటీతోనే హీటెక్కించ‌గ‌ల‌దు. ఆండ్రియో సినిమాలో ఉంటే? ఆ సినిమాకు అద‌న‌పు అస్సెట్ గా చెప్పొచ్చు. అందుకే డైరెక్ట‌ర్ మిస్కిన్ కూడా త‌న‌లో గ్లామ‌ర్ యాంగిల్ ని స‌ద్వినియోగం చేసుకోవాల‌నుకున్నాడు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న `పిసాసు` సీక్వెల్ కు నాయిక‌గా ఎంపిక చేసాడు. గ‌త ఏడాదే సినిమా మొద‌ల‌వ్వాలి. కానీ అని అనివార్య కార‌ణాల‌తో వాయిదా ప‌డుతోంది. ఇందులో ఆండ్రియో న్యూడ్ సీన్ లో న‌టించ‌బోతుంద‌ని కొన్ని నెల‌ల క్రిత‌మే ప్ర‌చారంలోకి వ‌చ్చింది.

తొల‌గించి షాక్ ఇచ్చారు:

దీంతో పిపాసు కథ కంటే? ఆండ్రియో పేరు నెట్టింట సంచ‌ల‌నంగా మారింది. అంద‌మైన న‌టి ఓ కొత్త సంచ‌ల‌నానికి తెర తీస్తుంద‌నే చ‌ర్చ స‌ర్వ‌త్రా జ‌రుగుతోంది. స్టోరీ డిమాండ్ చేయ‌డంతో మిస్కిన్ ఆ సీన్ త‌ప్ప‌క చేయాల్సి వ‌స్తోందని..ఓ ర‌కంగా ఇది అత‌డికి త‌ప్ప‌ని ప‌రిస్థితి అని ప్ర‌చారం జ‌రిగింది. ఆండ్రియో కూడా మిస్కిన్ కి అన్ని ర‌కాలుగా స‌హ‌కరిస్తాన‌ని ప్రామిస్ కూడా చేసింది. దీంతో కుర్ర కారులో ఆ సీన్ పై ఆస‌క్తి మొద‌లైంది. అయితే ఇప్పుడు వారి ఆశ‌ల‌పై ఆండ్రియో చ‌ల్ల‌నీళ్లు చ‌ల్లేసింది. స్క్రిప్టులో ఉన్న ఆ స‌న్నివేశాన్ని ఇప్పుడు తీసేశార‌ని చెప్పింది.

అందుకే యువ‌త‌లో క్రేజ్:

గ‌తంలో అనుకున్న స‌న్నివేశం ఇప్పుడు సినిమాలో ఉండ‌ద‌ని క‌బురు చ‌ల్ల‌గా చెప్పింది. షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఆ సినిమాకు అలాంటి స‌న్నివేశం అవ‌స‌రం లేద‌ని మిస్కిన్ భావించి తీసేసాడుట‌. దీంతో ఆ స‌న్నివేశంపై ఆశ‌లు పెట్టుకున్న వారంద‌ర్నీ నిరుత్సాహ ప‌రిచిన‌ట్లు అయింది. ఆండ్రియో చాలా సినిమాల్లో బోల్డ్ గా న‌టించిన సంగ‌తి త తెలిసిందే. ఆ త‌ర‌హా పాత్ర‌లే అమ్మ‌డికి యువ‌త‌లో అంత గొప్ప ఫాలోయింగ్ తెచ్చి పెట్టాయి. హీరోల‌తో ఇంటిమేట్ స‌న్నివేశాల విష‌యంలోనూ అమ్మ‌డు ఎంత మాత్రం త‌గ్గే న‌టి కాదు. పాత్ర డిమాండ్ చేసిందంటే? నో చెప్ప‌కుండా న‌టిస్తుంది.

Tags:    

Similar News