మరో కొరటాల అవుతాడు: నిర్మాత రవి శంకర్
ఆయన నవీన్ ఎర్నేనితో కలిసి నిర్మించి `ఆంధ్రా కింగ్ తాలూకా` ఈనెల 27న థియేటర్లలో విడుదలవుతోంది. రామ్ పోతినేని- భాగ్యశ్రీ బోర్సే ఈ చిత్రంలో నాయకానాయికలు. మహేష్ పి దర్శకత్వం వహించారు.;
``ఇటీవలి కాలంలో నేను చూసిన బెస్ట్ రైటర్ కం డైరెక్టర్ మహేష్. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ చిత్రాలను సందేశం జోడించి కమర్షియల్ గా చెప్పడంలో కొరటాల సిద్ధహస్తుడినని నిరూపించారు.. ఆంధ్రా కింగ్ తాలూకా దర్శకుడు మహేష్ నెక్ట్స్ కొరటాల శివ అవుతాడని నమ్ముతున్నాను`` అని అన్నారు వై.రవిశంకర్. ఆయన నవీన్ ఎర్నేనితో కలిసి నిర్మించి `ఆంధ్రా కింగ్ తాలూకా` ఈనెల 27న థియేటర్లలో విడుదలవుతోంది. రామ్ పోతినేని- భాగ్యశ్రీ బోర్సే ఈ చిత్రంలో నాయకానాయికలు. మహేష్ పి దర్శకత్వం వహించారు.
నేటి సాయంత్రం విశాఖలో జరిగిన ప్రచార సభలో రవిశంకర్ మాట్లాడుతూ.. తన దర్శకుడు మహేష్ పనితనాన్ని ప్రశంసించారు. అతడు మంచి రచయిత కం డైరెక్టర్. మరో కొరటాల అంతగా ఎదుగుతాడని కితాబిచ్చారు. ఇక వైజాగ్ ఈవెంట్ గురించి మాట్లాడుతూ.. ఆరేడేళ్ల క్రితం రంగస్థలం ఈవెంట్ ని ఇదే ఆర్కే బీచ్ లో చేసాం. మెగాస్టార్, నాగబాబు గెస్టులు వచ్చారు. ఆరోజు ఈవెంట్ బాగా జరిగింది. అదే ఏరియాలో ఇప్పుడు మళ్లీ విశాఖ వాసులను కలిసాం. సంతోషంగా ఉంది.. అని అన్నారు.
ఆంధ్రా కింగ్ గురించి చెప్పాలంటే మిమ్మల్ని మీరు తెరపై చూసుకున్నట్టు ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమను తాము ఐడెంటిఫై చేసుకునే సినిమా. ఇది ఫ్యానిజం గురించే కాదు. హ్యూమన్ ఎమోషన్స్ తో సాగే సినిమా. ఈ సినిమా ప్రివ్యూని ఇటీవల 30 మందికి చూపించాం. అందరూ ఒకటే చెప్పారు. యునానిమస్ గా కొత్త పాయింట్ తో ఉన్న సినిమా ఇది. ఇందులో రామ్, నేచురల్ స్టార్ ఉపేంద్ర గారు అద్బతు పెర్ఫామెన్స్ చేసారు. భాగ్యశ్రీ రెండు మూడు ఎమోషనల్ సీన్స్ లో రక్తి కట్టించింది. ప్రతి పాత్ర దేనికదే చాలా అద్భుతంగా కుదిరాయి. నవంబర్ 27న మా సినిమాని థియేటర్లలో వీక్షించండి.. అని అన్నారు.
మా దర్శకుడు మహేష్ పి ఇటీవలి కాలంలో నేను చూసిన బెస్ట్ రైటర్ కం డైరెక్టర్. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ చిత్రాలతో కొరటాల శివ.. ఒక మెసేజ్ ని కమర్షియల్ గా చెప్పడంలో సిద్ధహస్తుడినని నిరూపించారు.. మహేష్ నెక్ట్స్ కొరటాల శివ అవుతాడని నమ్ముతున్నాను. మహేష్ విశాఖ వాసి. విశాఖ గురించి గొప్పగా చెబుతాడు. మాక్కూడా ఇష్టమైన స్థలం ఇది. శ్రీకర్ ప్రసాద్ లాంటి పెద్ద సినిమాలకు పని చేసిన జాతీయ అవార్డుల ఎడిటర్ ఈ సినిమాకి పని చేసారు. ఆయన అనుభవం ఉపయోగపడుతుంది. అవినాష్ కొల్లా కళాదర్శకత్వం, యువకుల సంగీత ప్రతిభ అద్బుతం. పాటలు బాగా రీచ్ అయ్యాయి. ఆర్.ఆర్ కూడా బాగా కుదిరింది.
ఇప్పటివరకూ ఎన్నో హిట్ సినిమాలు చేసాం.. ప్రతి హీరో ఇచ్చిన అవకాశాలను నిలబెట్టుకున్నాం. శ్రీమంతుడు, సర్కార్ వారి పాట, జనతా గ్యారేజ్ వంటి పెద్ద హీరోల సినిమాలను ఎంతో ఫ్యాషన్ తో చేసాం. రంగస్తలం, పెద్ది సినిమాలను రామ్ చరణ్ ఇచ్చారు. చరణ్ పెద్ది గ్లింప్స్ కి మంచి స్పందన వచ్చింది. ఈ మూవీ నుంచి ఇంకా కోకొల్లలు ఉన్నాయి... అన్నిటినీ చూపిస్తాం. మా తదుపరి ప్రయత్నం ప్రభాస్ తో సినిమాకి స్కేల్ చూస్తే మతి చెడుతుంది. మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ ని ఎలా ఊపేసిందో మీకు తెలుసు. ఆరోజుల్లోనే విశాఖ ప్రాంతంలో 18 కోట్లు వసూలు చేసింది.. ఈరోజుల్లో అది 30కోట్లు. ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసే సినిమాను ఈసారి కూడా తెస్తున్నామని రవి Y అన్నారు.