అమెరికా మిషన్ సక్సెస్.. రామ్ మరో ప్లాన్

బాక్సాఫీస్ దగ్గర సినిమా సక్సెస్ అయితే ఆ కిక్కే వేరు. అందులోనూ హీరోనే రంగంలోకి దిగి ప్రమోట్ చేస్తే ఆ జోష్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది.;

Update: 2025-12-01 17:33 GMT

బాక్సాఫీస్ దగ్గర సినిమా సక్సెస్ అయితే ఆ కిక్కే వేరు. అందులోనూ హీరోనే రంగంలోకి దిగి ప్రమోట్ చేస్తే ఆ జోష్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. మన ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఇప్పుడు అదే పనిలో ఉన్నారు. సముద్రాలు దాటి వెళ్లి మరీ తన సినిమా కోసం చేసిన హడావిడి సూపర్ సక్సెస్ అయింది. ఆ ఉత్సాహంతోనే ఇప్పుడు స్వదేశానికి తిరిగి వస్తున్నారు.

'ఆంధ్ర కింగ్ తాలూకా' సినిమా కోసం రామ్ అమెరికా వెళ్లడం, అక్కడ ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అవ్వడం మంచి ఫలితాన్ని ఇచ్చింది. అక్కడ ఈ సినిమా ఇప్పటికే 500K డాలర్ల మార్క్ దాటి 1 మిలియన్ దిశగా వెళ్తోంది. రామ్ అక్కడ చేసిన ప్రమోషన్స్ సినిమాకు భారీ హైప్ తీసుకొచ్చాయి. అక్కడ తన పని విజయవంతంగా పూర్తి చేసుకున్న రామ్, రేపు ఇండియాకు తిరిగి రానున్నారు.

అయితే అసలు కథ ఇక్కడే మొదలవుతోంది. అమెరికాలో ప్రమోషన్స్ ముగించుకుని వస్తున్న రామ్, ఇక్కడితో రెస్ట్ తీసుకునే మూడ్ లో అస్సలు లేరట. తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమా ప్రమోషన్స్ ను మరింత ఉధృతం చేయాలని భావిస్తున్నారట. ఇప్పటివరకు సోషల్ మీడియాలో, విదేశాల్లో సందడి చేసిన రామ్, ఇప్పుడు డైరెక్ట్ గా గ్రౌండ్ లెవెల్ లోకి దిగబోతున్నారు.

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, రామ్ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన థియేటర్లను విజిట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సినిమాకు పాజిటివ్ టాక్ ఉన్నప్పటికీ, స్వయంగా వెళ్లి ప్రేక్షకులను కలిస్తే ఆ రీచ్ ఇంకా బాగుంటుందని ఆయన భావిస్తున్నారు. దర్శకుడు మహేష్ బాబు పి. తెరకెక్కించిన ఎమోషనల్ కంటెంట్ మాస్ ఆడియెన్స్ కు బాగా కనెక్ట్ అవుతుండటంతో, ఈ టూర్ ప్లస్ అవుతుందని అంచనా.

నిజానికి ఈ మధ్య కాలంలో హీరోలు రిలీజ్ తర్వాత థియేటర్లకు వెళ్లడం కొంచెం తగ్గింది. కానీ రామ్ మాత్రం పాత పద్ధతిలో ఫ్యాన్స్ మధ్యలో ఉండి సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. అభిమాని ఎమోషన్ ప్రధానంగా సాగే ఈ సినిమాకు, ఇలాంటి డైరెక్ట్ ప్రమోషన్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. అందుకే ఆయన ఈ నిర్ణయం వైపు మొగ్గు చూపుతున్నారు.

రేపు హైదరాబాద్ ల్యాండ్ అయ్యాక టీమ్ తో మాట్లాడి దీనిపై ఫైనల్ నిర్ణయం తీసుకోనున్నారు. ఒకవేళ రామ్ కనుక థియేటర్ విజిట్స్ స్టార్ట్ చేస్తే, రాబోయే రోజుల్లో థియేటర్ల దగ్గర జాతర జరగడం పక్కా. మాస్ ఆడియెన్స్ కు ఇంతకంటే మంచి కిక్ ఏముంటుంది? రామ్ తీసుకునే డెసిషన్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

Tags:    

Similar News