అనసూయ మేడం ఖాళీగా ఏం లేదట..!
జబర్దస్త్ కామెడీ షో తో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన ముద్దుగుమ్మ అనసూయ. చాలా తక్కువ సమయంలోనే హీరోయిన్స్ రేంజ్‌లో అనసూయకు గుర్తింపు దక్కింది.;
జబర్దస్త్ కామెడీ షో తో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన ముద్దుగుమ్మ అనసూయ. చాలా తక్కువ సమయంలోనే హీరోయిన్స్ రేంజ్‌లో అనసూయకు గుర్తింపు దక్కింది. ఒక యాంకర్‌గా ఎప్పుడూ, ఎవరికీ రాని గుర్తింపును అనసూయ దక్కించుకుంది. జబర్దస్త్ షో లో యాంకరింగ్ చేసినందుకు గాను అనసూయ సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకుంది. పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌లో అనసూయ చేసిన విషయం తెల్సిందే. హీరోయిన్‌గానూ ఆఫర్లు దక్కించుకున్న అనసూయ జబర్దస్త్ మానేసిన తర్వాత కాస్త ఆఫర్లు తగ్గాయి అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తూ ఉంటారు. అనసూయ జబర్దస్త్ మానేయడం ద్వారా ఆమె పాపులారిటీ కూడా తగ్గుతూ వచ్చిందని సోషల్ మీడియాలో ప్రముఖంగా చర్చ జరుగుతూ ఉండేది. అనసూయ జబర్దస్త్‌ను వదిలేయడం తప్పే అని చాలా మంది అంటూ ఉంటారు.
హరిహర వీరమల్లు సినిమాలో స్పెషల్ సాంగ్
ఈ ఏడాది పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమాలో ప్రత్యేక పాటలో కనిపించిన అనసూయ మరే సినిమాతోనూ ఈ ఏడాదిలో వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. గత ఏడాది పుష్ప 2 సినిమాలో కనిపించింది. పుష్ప 1 సినిమాలోని పాత్రతో పోల్చితే పుష్ప 2 లో అనసూయ పాత్ర పరిధి తగ్గిందని, అంతే కాకుండా స్క్రీన్ ప్రజెన్స్ చాలా వరకు తగ్గిందని ఆమె అభిమానులు అనుకున్నారు. అయినా కూడా పుష్ప తర్వాత అనసూయ రేంజ్ మరింతగా పెరుగుతుందని ఆశించిన అభిమానులకు నిరాశే మిగిలింది. సుకుమార్ అంతకు ముందు రంగస్థలం సినిమాలో ఈమెకు రంగమ్మత్త పాత్ర ఇవ్వడం ద్వారా ఒక్కసారిగా స్టార్‌ను చేశాడు. ఆ పాత్ర వల్లే అనసూయకు టాలీవుడ్‌లో పదుల సంఖ్యలో సినిమా ఆఫర్లు వచ్చాయి అనేది చాలా మంది చెప్పుకునే విషయం.
అనసూయ ఆ తరహా పాత్రల కోసం చూపు
రంగమ్మత్త వంటి పాత్రలను చేయాలని ఆశ పడుతున్న అనసూయకు పెద్దగా ఆఫర్లు రావడం లేదు అనేది చాలా మంది అభిప్రాయం. యాంకర్‌గా చాలా మంచి పేరు దక్కించుకున్న అనసూయ గత రెండేళ్లుగా పెద్ద సినిమాలు చేయడం లేదని, ప్రస్తుతం ఆమె చేతిలో సినిమాలు ఏమీ లేవనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అనసూయ సన్నిహితులు క్లారిటీ ఇచ్చారు. అనసూయ మేడం సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు ఖాళీగా ఏమీ లేదని, ఆమె రెగ్యులర్‌గా సినిమాలు చేస్తున్నే ఉందని అన్నారు. ప్రస్తుతం ఈమె ఫ్ల్యాష్ బ్యాక్, వోల్ఫ్ సినిమాల్లో నటిస్తుంది. ఆ సినిమాలు మాత్రమే కాకుండా ఆకష్ పూరి హీరోగా రూపొందుతున్న తల్వార్ అనే సినిమాలో కీలక పాత్రలో అనసూయ నటిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఇప్పటి వరకు ఆ పాత్రకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్ లేదు. కానీ తల్వార్‌లో అనసూయ కీలక పాత్ర అని మాత్రం టాక్ వినిపిస్తుంది.
జబర్దస్త్‌లో మళ్లీ కనిపించిన యాంకర్ అనసూయ
అనసూయ కెరీర్‌లో మళ్లీ బిజీ కావాలంటే కాస్త ఏజ్ బార్ పాత్రలు చేయాలనే సలహాను కొందరు ఇస్తున్నారు. కానీ అనసూయ అందంకు, ఆమె వయసుకు తగ్గట్లుగా పాత్రలు చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకే కాస్త తక్కువ సినిమాలు చేసినా మంచి పాత్రలు, అందంగా కనిపించే పాత్రలు చేయాలని అనసూయ భావిస్తున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ప్రతి నటికి ఒక టైం అంటూ వస్తుంది. ఖచ్చితంగా అనసూయకు మరోసారి టైం వస్తుంది, ఆ టైం వచ్చినప్పుడు ఆమె తన సత్తా చాటుతుందనే విశ్వాసంను చాలా మంది అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జబర్దస్త్ ప్రత్యేకమైన కార్యక్రమంలో అనసూయ పాల్గొంది. ఆ షో లో ఎప్పటిలాగే అనసూయ చాలా అందంగా కనిపించింది. ఇద్దరు కొడుకులు పెద్ద వారు అవుతున్నా అనసూయ మాత్రం అందంగానే కనిపిస్తూ ఉందని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.