జబర్దస్త్ కంటే ముందు.. ఇండస్ట్రీ పెద్దలతో అక్కడే పరిచయాలు: అనసూయ
అలా ఈ సినిమా వీఎఫ్ ఎక్స్ పనులపై డైరెక్టర్ మెహర్ రమేష్ తరచూ ఆఫీస్ వచ్చేవాడని చెప్పింది.;
బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ కామెడీ షో తో కెరీర్ ప్రారంభించింది అనసూయ భరద్వాజ్. అక్కడ్నుంచి వెండితెరపైకి కూడా ఎంట్రీ ఇచ్చింది. సోగ్గాడే చిన్నినాయన, రంగస్థలం, పుష్ప లాంటి సూపర్ హిట్ సినిమాల్లో ఆయా పాత్రలు పోషించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో టాలీవుడ్ లో ఆమె 50కి పైగా సినిమాల్లో నటించింది. అయితే జబర్దస్త్ కంటే ముందు ఆమె ఎవరో జనాలకు పెద్దగా తెలీదు.
కానీ, అంతకుముందే అనసూయకు సినిమా ఇండస్ట్రీలో పరిచయాలు ఉన్నయట. ఈ విషయాన్ని అనసూయే ఇటీవల చెప్పింది. జబర్తస్ద్ కు రాకముందు ఒక వీఎఫెక్స్ కంపెనీలో హెచ్ ఆర్ గా పని చేసిందట. ఆ రోజుల్లో తామ కంపెనీ తెలుగు సినిమాలకు వీఎఫ్ ఎక్స్ పనులు చేసేదట. అందులో భాగంగానే కంత్రి సినిమాలో చిన్న ఎన్టీఆర్ బొమ్మ కనిపించే వీఎఫెక్స్ కంటెంట్ తమ కంపెనీయే చిసిందని ఆమె చెప్పింది.
అలా ఈ సినిమా వీఎఫ్ ఎక్స్ పనులపై డైరెక్టర్ మెహర్ రమేష్ తరచూ ఆఫీస్ వచ్చేవాడని చెప్పింది. ఆయన ఒక్కడే కాకుండా త్రివిక్రమ్, సుకుమార్ లాంటి పెద్ద దర్శకులు కూడా తమ ఆఫీస్ కు వచ్చేవాళ్లని అలా వాళ్లతో పరిచయాలు పెరిగాయని అనసూయ పేర్కొంది. ఇలా అగ్ర దర్శకుల దృష్టిలో పడిందీ అమ్మడు.
అంతేకాకుండా తమ కంపెనీ లైఫ్ ఆఫ్ పై తోపాటు అనేక హాలీవుడ్ సినిమాలకు కంటెంట్ ఇచ్చిందట. భారత్కు చెందిన కంపెనీ అంత పెద్ద హాలీవుడ్ సినిమాలకు వర్క్ చేయడం మామూలు విషయం కాదని దానికి వాళ్లు ఎంతో గర్వించేవాళ్లని అనసూయ తెలిపింది. అయితే వీఎఫెక్స్ కంపెనీలో పని మాత్రం గొడ్డు చాకిరీ అన్నట్లే ఉంటుందని పేర్కొంది.
ఒక ప్రాజెక్ట్ ఒప్పుకున్నాక అది కంప్లీట్ అయ్యేదాకా సమయంతో పనిలేకుండా వర్క్ చేయాల్సి ఉంటుందని తెలిపింది. ఇలా ప్రొఫెషనల్ లైఫ్ తో పాటు తన ప్రేమ, పెళ్లి విషయాలు కూడా అనసూయ పంచుకుంది. ఆమె తన భర్త భరద్వాజ్ ను అక్కడే కలిశాసిందట. ఆయనతో ప్రేమలో పడ్డ ఆమె తననే పెళ్లి చేసుకున్నట్లు చెప్పింది. ఇక తన లైఫ్ లో ప్రియుడు ఒక్కరే అని.. ఆ ప్రియుడినే తాను వివాహం చేసుకున్నట్లు అనసూయ చెప్పింది.