అలా మాట్లాడటం తప్పే.. రాశీకి అనసూయ క్షమాపణలు
ఆ షో లో రాశిఫలాలు అని అనసూయ కామెంట్ చేశారని, అప్పుడే ఆమెపై న్యాయపరంగా వెళ్లాలనుకున్నానని, కానీ తన తల్లి చెప్పడంతో సైలెంట్ గా ఉన్నానని రాశీ చెప్పారు.;
రీసెంట్ గా ఓ కార్యక్రమంలో యాక్టర్ శివాజీ ఆడవారి వేషధారణ పై చేసిన కామెంట్స్ ఎంత హాట్ టాపిక్ గా మారాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వయసులో పెద్ద వాడు అయుండి శివాజీ అలా ఎలా మాట్లాడతారని ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ ఎంతోమంది నటీమణులు ఈ విషయంలో రెస్పాండ్ అయ్యారు. శివాజీ కామెంట్స్ ను వ్యతిరేకిస్తూ అనసూయ కూడా వార్తల్లోకెక్కిన విషయం తెలిసిందే.
శివాజీ- అనసూయ వివాదంలోకి రాశీ ఎంట్రీ
ఎవరికి నచ్చిన బట్టలు వారు వేసుకునే స్వేచ్ఛ ఉందని, దీనిపై మాట్లాడే హక్కు ఎవరికీ లేదని అనసూయ కామెంట్స్ చేశారు. అయితే ఈ విషయంలో కొందరు శివాజీకి సపోర్ట్ చేస్తుంటే, మరికొందరు అనసూయకు సపోర్ట్ చేస్తూ వచ్చారు. కాగా తాజాగా ఈ వివాదంలోకి సీనియర్ నటి రాశీ ఎంట్రీ ఇచ్చారు. రీసెంట్ గా రాశీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, అనసూయపై కామెంట్స్ చేశారు.
అనసూయ నన్ను ట్రోల్ చేసింది
శివాజీ హీరోయిన్లు వేసుకునే బట్టలు గురించి మాట్లాడటం తప్పేనని, దాన్ని తాను కూడా సమర్ధించడం లేదని, కొన్ని వాడకూడని పదాలు వాడారని, ఆ తర్వాత అలా మాట్లాడినందుకు శివాజీ కూడా డాధ పడి, క్షమాపణలు కూడా చెప్పారని, ఇదంతా పక్కన పెడితే గతంలో ఓ కామెడీ షోకు యాంకర్ గా వ్యవహరించే టైమ్ లో అనసూయ తనను ట్రోల్ చేశారని చెప్పారు.
అప్పుడే ఎదిరించాల్సింది కానీ శక్తి లేక ఆగిపోయా
ఆ షో లో రాశిఫలాలు అని అనసూయ కామెంట్ చేశారని, అప్పుడే ఆమెపై న్యాయపరంగా వెళ్లాలనుకున్నానని, కానీ తన తల్లి చెప్పడంతో సైలెంట్ గా ఉన్నానని రాశీ చెప్పారు. రాశీ చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్న టైమ్ లో ఆ వీడియోపై స్పందిస్తూ అనసూయ ఓ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ లో తాను మూడేళ్ల కిందట చేసిన ఓ షో లో తెలుగు సరిగా రానితనంపై చేసిన స్కిట్ లో రాశి పేరుని వాడి తన నోటి నుంచి డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్పించారని, అలా రాయించిన వారిని అప్పుడే ఎదిరించాల్సిందని, కానీ అప్పుడు తనకున్న శక్తి సహకరించలేదని, అది తప్పేనని, దానికి సారీ చెప్తున్నానని రాసుకొచ్చారు అనసూయ. ఆ షో లో డబుల్ మీనింగ్ డైలాగ్స్ ను ఖండించడం నుంచి ఆ షో నుంచి తప్పుకునేవరకు తనలో ఎంత మార్పొచ్చిందో మీరు చూడొచ్చని, అయినా సరే ఆ విషయంలో తాను చేసింది తప్పు కాబట్టి ఆ షో డైరెక్టర్, రైటర్ మీకు సారీ చెప్పినా చెప్పకపోయినా, తన బాధ్యతగా మాత్రం తన తప్పును ఒప్పుకుంటూ క్షమాపణ చెప్తున్నానని అనసూయ పోస్ట్ చేయగా, ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.