చీరకట్టులో కూడా హీట్ పెంచిన విజయ్ దేవరకొండ హీరోయిన్..లుక్స్ అదుర్స్!
ఇదిలా ఉండగా ఇప్పుడు నిత్యం గ్లామర్ తో ఆకట్టుకుంటూ అలరించే ఈమె..తాజాగా చీరకట్టులో కనిపించి అందరిని అబ్బురపరిచింది విజయ్ దేవరకొండ హీరోయిన్ అనన్య పాండే.;
సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను పెంచుకోవడానికి హీరోయిన్స్ పడుతున్న కష్టాలు మామూలుగా లేదు. అటు దర్శక నిర్మాతల కంట్లో పడాలి అంటే ఇక్కడ సోషల్ మీడియాలో పాపులారిటీ బాగుండాలి. అందుకే రోజుకొక గ్లామర్ ఫోటోషూట్ షేర్ చేస్తూ అభిమానులలో ఆసక్తి పెంచుతున్నారు. ఈ క్రమంలోనే కొత్త ఫాలోవర్స్ ను కూడా పెంచుకుంటున్నారని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా ఇప్పుడు నిత్యం గ్లామర్ తో ఆకట్టుకుంటూ అలరించే ఈమె..తాజాగా చీరకట్టులో కనిపించి అందరిని అబ్బురపరిచింది విజయ్ దేవరకొండ హీరోయిన్ అనన్య పాండే.
సినీ బ్యాక్ గ్రౌండ్ నుండి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ కూడా ఫాలోవర్స్ ను పెంచుకునే పనిలో పడింది. తన ఉనికిని చాటుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అలా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె తాజాగా చీరకట్టులో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచింది. గ్రీన్ కలర్ చీర కట్టుకొని తన అందంతో మరింత మెస్మరైజ్ చేసింది. ప్లెయిన్ గ్రీన్ కలర్ చీరకు హెవీ ఎంబ్రాయిడరీ లేస్ కలిగిన చీరను ఆమె ధరించింది. దీనికి కాంబినేషన్లో హెవీ ఎంబ్రాయిడరీ తో డిజైన్ చేసిన బ్లౌజ్ ని చాలా యూనిక్ గా డిజైన్ చేయించి ధరించింది అనన్య పాండే. తను చీర కట్టుకు మరింత లుక్ ఇచ్చేలా.. జుట్టును ముడిపెట్టి పువ్వులు పెట్టి చాలా సాంప్రదాయంగా కనిపించింది. చీర కట్టులో కూడా అటు సాంప్రదాయంగా కనిపిస్తూనే ఇటు అందాలు వలకబోస్తూ హీట్ పెంచింది అనన్య పాండే. ప్రస్తుతం అనన్య పాండే షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.
అనన్య పాండే కెరియర్ విషయానికి వస్తే.. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె పతి పత్నీ ఔర్ వో సినిమాలో కూడా నటించింది. ఆ తర్వాత వరుసగా బాలీవుడ్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఈమె.. తొలిసారి విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఇందులో తన నటనతో మెప్పించింది కానీ పిసినిమా డిజాస్టర్ కావడంతో ఈమెకు తెలుగులో అవకాశాలు రాలేదు. దాంతో బాలీవుడ్ కే పరిమితమైన ఈమె.. అక్కడే పలు చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. సినిమా రంగంలోనే కాదు టీవీ రంగంలో కూడా తనకంటూ ఒక గుర్తింపు అందుకుంది అనన్య పాండే. మ్యూజిక్ వీడియోలలో కూడా పనిచేసింది.
అనన్య పాండే అందుకున్న అవార్డుల విషయానికి వస్తే.. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ టు సినిమాతో 26వ స్క్రీన్ అవార్డులలో భాగంగా ఉత్తమ మహిళా అరంగేట్రం చిత్రానికి నామినేట్ కాగా.. ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ది ఇయర్ అవార్డును సొంతం చేసుకుంది. ఆ తర్వాత అదే చిత్రానికి 65వ ఫిలింఫేర్ అవార్డు లో భాగంగా ఉత్తమ మహిళా అరంగేట్రం అవార్డు సొంతం చేసుకుంది. జీ సినీ అవార్డులతో పాటు చాలా అవార్డులు ఈమెను వరించాయి. ఇక ఈమె ఎవరో కాదు ప్రముఖ హిందీ సినిమా నటుడు చుంకీ పాండే కూతురు.