అన‌న్య బాధ మ‌న వాళ్ల‌కు అర్థ‌మ‌వుతుందా?

ఎక్క‌డా చూసిన మ‌నం ఈ 20 శాతం పరిథిలోనే కొట్టుకోవాలి. మ‌న వాళ్లు మ‌న వాళ్ల‌కు 20 శాతం వ‌ర‌కే అవ‌కాశాలిచ్చి ఇత‌ర భాష‌ల హీరోయిన్‌ల‌కు 80 శాతం అవకాశాలిస్తున్నారు.;

Update: 2025-06-20 13:30 GMT

టాలీవుడ్‌లో తెలుగమ్మాయిల‌కు అవ‌కాశాలు రావ‌డం లేద‌ని, ఎవ‌రూ ప్రోత్స‌హించ‌డం లేద‌ని, స‌రైన అవకాశాలు ద‌క్క‌డం లేద‌నే వాద‌న కొంత కాలంగా వినిపిస్తూనే ఉంది. అదే స‌మ‌యంలో మ‌న వాళ్లు ఇత‌ర భాష‌ల‌కు చెందిన హీరోయిన్‌ల‌కు పెద్ద పీట వేస్తూ మ‌న వాళ్లని ప‌క్క‌న పెట్టేస్తున్నార‌నే వాద‌న కూడా బ‌లంగా వినిపిస్తున్న‌విష‌యం తెలిసిందే. తాజాగా ఇదే అంశాన్ని మరో సారి యంగ్ హీరోయిన్ అన‌న్య నాగ‌ళ్ల వెల్ల‌డించింది. మ‌న వాళ్లు అవ‌కాశాలు ఇవ్వ‌క‌, ఇత‌ర భాష‌ల వాళ్లు ఇవ్వ‌క‌పోతే తెలుగు హీరోయిన్‌ల ప‌రిస్థితేంట‌ని త‌ను ప్ర‌శ్నిస్తోంది.

దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. వివ‌రాల్లోకి వెళితే.. 'మ‌ల్లేశం' సినిమాతో హీరోయిన్‌గా అరంగేట్రం చేసింది అన‌న్య నాగ‌ళ్ల‌. ఖ‌మ్మం జిల్లా స‌త్తుప‌ల్లికి చెందిన ఈ ప‌ద‌హార‌ణాల తెలుగు అందం కొంత కాలంగా హీరోయిన్‌గా నిల‌దొక్కుకోవాల‌ని విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తోంది. కానీ ఏదీ వ‌ర్క‌వుట్ కావడం లేదు. రీసెంట్‌గా వెన్నెల కిషోర్‌తో క‌లిసి 'శ్రీ‌కాకులం శెర్లాక్ హోమ్స్‌'లో న‌టించింది. తాజాగా ఓ మీడియాకు ప్ర‌త్యేకంగా ముచ్చ‌టించిన అన‌న్య తెలుగమ్మాయిల‌కు టాలీవుడ్‌లో ఉన్న ప్ర‌ధాన్య‌త గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది.

తెలుగు ఇండ‌స్ట్రీలో తెలుగ‌మ్మాయిల‌కు 20 శాతం మాత్ర‌మే అవ‌కాశాలు ద‌క్కుతున్నాయ‌ని, బ‌య‌టి వారికి మాత్రం ఇక్క‌డ హండ్రెడ్ ప‌ర్సెంట్ అవ‌కాశాలిస్తున్నార‌ని వాపోయింది. ఇండియాలో ఉన్న ఇత‌ర రాష్ట్రాల్లోని అమ్మాయిల‌కు ఒక యాక్టింగ్ కానీ, ఆర్ట్ కానీ ఇష్టం ఉంటే మ‌న వారంత క‌ష్టం ఉండ‌ద‌ని నా ఫీలింగ్‌. కార‌ణం ఏంటంటే టాలీవుడ్‌లో వంద సినిమాలు నిర్మిస్తే అందులో 20 శాతం మాత్ర‌మే తెలుగ‌మ్మాయిల‌కు అవ‌కాశాలిస్తారు. ఇక్క‌డ మ‌న‌కు 20 శాత‌మే అవ‌కాశం ల‌భిస్తోంద‌ని త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ, హిందీ భాష‌ల్లో ట్రై చేస్తే అక్క‌డా ఇదే ప‌రిస్థితి.

ఆయా భాష‌ల‌కు చెందిన హీరోయిన్‌ల‌కు 80 శాతం అవ‌కాశాలిచ్చి మ‌న వాళ్ల‌కు మాత్రం 20 శాత‌మే అవ‌కాశాలిస్తారు. ఎక్క‌డా చూసిన మ‌నం ఈ 20 శాతం పరిథిలోనే కొట్టుకోవాలి. మ‌న వాళ్లు మ‌న వాళ్ల‌కు 20 శాతం వ‌ర‌కే అవ‌కాశాలిచ్చి ఇత‌ర భాష‌ల హీరోయిన్‌ల‌కు 80 శాతం అవకాశాలిస్తున్నారు. కానీ ఇత‌ర భాష‌ల వాళ్లు వాళ్ల వాళ్ల‌కు 80 శాతంఅవ‌కాశాలిస్తున్నారు. చిన్న‌త‌నం నుంచి సినిమాలు చూసి పెరిగి అన్ని అడ్డంకుల్ని దాటి ఇక్క‌డికొచ్చి నిల‌బ‌డితే ఆ 20 శాతం అవ‌కాశాలు ద‌క్క‌డానికి ప‌దేళ్లు కొట్టుకోవాల్సిన ప‌రిస్థితి.

మ‌న ద‌గ్గ‌ర బ్యూటిఫుల్ గాల్స్ లేరా ఉన్నారు. కానీ అవ‌కాశాలు మాత్రం లేవు. నాకు ఎక్క‌డ గ‌ట్ ఫీలింగ్ వ‌స్తోందంటే ఇన్ని హ‌ర్డిల్స్ ఎదుర‌వుతున్నా మెంట‌ల్‌గా మేము చాలా స్ట్రాంగ్‌గా నిల‌బ‌డి అవ‌కాశాల కోసం ఫైట్ చేయ‌డం. గ‌తంతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువ మంది తెలుగ‌మ్మాయిలు ఇండ‌స్ట్రీలోకి వ‌స్తున్నారు. అవ‌కాశాల కోసం స్ట్రాంగ్‌గా నిల‌బ‌డి ఫైట్ చేస్తున్నారు. వాళ్లంద‌రిని చూస‌తే నాకు గ‌ర్వంగా ఉంటుంది. మిగ‌తా భాష‌ల‌కు చెందిన అమ్మాయిల‌తో పోలిస్తే తెలుగ‌మ్మాయిల‌కు అవ‌కాశాలు త‌క్కువ‌ని తెలిసిన వారు ప్ర‌య‌త్నిస్తుండ‌టం నాకు గ‌ర్వంగా ఉంటుంది' అంటూ అన‌న్య నాగ‌ళ్ల త‌న ఆవేద‌న‌ని వ్య‌క్తం చేసింది. మ‌రి త‌న బాధ‌మ‌న వాళ్ల‌కు అర్థ‌మ‌వుతుందా?.

Tags:    

Similar News