82 ఏళ్ల వయసు.. 2 గంటల్లో 7 ప్రాజెక్ట్‌లు

తాజాగా బచ్చన్‌ సాబ్‌ తన బ్లాగ్‌లో ఆసక్తికర విషయాన్ని వెళ్లడించి అందరి దృష్టిని ఆకర్షించాడు.;

Update: 2025-06-14 02:30 GMT

బాలీవుడ్‌ మెగాస్టార్‌, బిగ్‌బి అమితాబచ్చన్‌ వయసు మీద పడుతున్నా కొద్ది సినిమాల్లో జోరు పెంచుతున్నారు అనిపిస్తుంది. దాదాపు ఆరు దాశాబ్దాలుగా సినిమాలు చేస్తున్న అమితాబచ్చన్‌ ఇప్పటికీ అలసి పోలేదు. మనం సినిమాలు చేస్తేనే కదా కింది స్థాయి కార్మికులు బతుకుతారు, వారి కోసం అయినా మనం ఎక్కువ పని చేయాలి అనే మనస్థత్వం ఆయనది. సాధారణంగా ఆ వయసు వారు విశ్రాంతి కోరుకుంటారు. కానీ బచ్చన్‌ మాత్రం ఇంకా సినిమాలు చేయాలి అనుకుంటున్నారు. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా రియాల్టీ షో లు, యాడ్స్ చేస్తూనే ఉన్నాడు. తాజాగా బచ్చన్‌ సాబ్‌ తన బ్లాగ్‌లో ఆసక్తికర విషయాన్ని వెళ్లడించి అందరి దృష్టిని ఆకర్షించాడు.

తన వర్క్‌ స్టైల్‌ చాలా విభిన్నంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. తాను ఎక్కువగా ప్రాజెక్ట్‌లు చేసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటాను. తాను ఎప్పుడూ కూడా బిజీగా ఉండాలి అనుకుంటాను. అందులో భాగంగా ఇటీవల రెండు గంటల్లో ఏడు ప్రాజెక్ట్‌లు చేశాను. అందులో రెండు యాడ్‌ ఫోటో షూట్‌లు ఉన్నాయి. అంత తక్కువ సమయంలో అన్ని ప్రాజెక్ట్‌లకు సంబంధించి వర్క్‌ చేయడం చూసి ఆ దర్శకుడు షాక్‌ అయ్యాడు. ఆయన నా వర్క్‌ స్టైల్‌ ని చమత్కారంగా విమర్శించాడు. పని చేసే విధానాన్ని నేను నాశనం చేస్తున్నాను అన్నట్లుగా అతడు నవ్వుతూ అన్నాడు. కానీ నాకు మాత్రం ఎక్కువ పని చేయడం ఇష్టం అని చెప్పాను అన్నారు.

పని చేయడంలో చాలా ఆనందం ఉంటుంది, ఆ ఆనందంను నేను ఎప్పుడూ వదులుకోను, ఆనందం కోసం ఏదో చేయాలి అనుకోను, పని చేయడంలో ఉన్న ఆనందంను ఆస్వాదిస్తాను అంటూ ఎంతో మందికి బిగ్‌బి ఆదర్శంగా నిలిచారు. వయసు పెరుగుతున్నా కొద్ది శక్తి తగ్గి వృద్దాప్యం కారణంగా పనులు చేయలేకుండా పోతారు. కానీ అమితాబ్‌ బచ్చన్ మాత్రం మూడు పదుల వయస్కుడిగా వరుస సినిమాలు, ప్రాజెక్ట్‌లు చేయడం చూస్తూ ఉంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎంతో మంది ఆయన తోటి నటీ నటులు ఇప్పటికే రిటైర్మెంట్‌ తీసుకుని విశ్రాంతి తీసుకున్నారు, కొందరు ఈ భూమి మీద కూడా లేరు. కానీ ఆయన క్రమశిక్షణ, అలవాట్ల కారణంగా ఇప్పటికీ స్ట్రాంగ్‌గా ఉన్నారు.

బిగ్‌బి ఎన్నో విషయాల్లో ఇండస్ట్రీ వారికి, సాదారణ జనాలకు ఆదర్శం అనడంలో సందేహం లేదు. చేసే పనిలో ఆనందం వెతుక్కోవాలని ఆయన చెబుతూ ఉంటారు, అంతే కాకుండా సరైన జీవన విధానం సాగించినట్లయితే ఎక్కువ కాలం జీవితం సాగించవచ్చు అని గతంలో చెప్పుకొచ్చారు. మొత్తానికి అమితాబ్‌ బచ్చన్ సినిమాలు మాత్రమే కాకుండా ఆయన జీవితం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆయన ఇంకా ఎంతో కాలం అందరికీ ఆదర్శంగా ఉండాలని, మరెన్నో ప్రాజెక్ట్‌లు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Tags:    

Similar News