83 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు!
ఈ వయసులో కూడా శారీరక శ్రమను తట్టుకుంటూ రాత్రంతా మేల్కొని పని చేయడం ఆయనకు సినిమాపై ఉన్న ప్రేమకు, వృత్తిపరమైన నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తోంది.
బిగ్ బి అమితాబ్ బచ్చన్ క్రమశిక్షణ, వృత్తి పట్ల ఆయనకున్న అంకితభావం ఎందరికో ఆదర్శం. వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమేనని ఆయన నిరంతరం నిరూపిస్తూనే ఉన్నారు. 83 సంవత్సరాల పండు వయసులో కూడా యువ హీరోలకు సైతం పోటీనిస్తూ నిరంతరం ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నారు. తాజాగా అమితాబ్ పని వేళలకు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. అమితాబ్ బచ్చన్ నిన్నటితరం, నేటితరం నటులందరిలోనూ అత్యంత బిజీగా ఉన్న నటుడిగా నేటికి కొనసా గుతున్నారు. ఇటీవల ఆయన ఒక ప్రాజెక్ట్ షూటింగ్ కోసం ఏకంగా తెల్లవారుజామున 4 గంటల వరకు నిరంత రాయంగా పని చేశారు.
ఈ వయసులో కూడా శారీరక శ్రమను తట్టుకుంటూ రాత్రంతా మేల్కొని పని చేయడం ఆయనకు సినిమాపై ఉన్న ప్రేమకు, వృత్తిపరమైన నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ విషయాన్ని అమితాబ్ బచ్చన్ స్వయంగా తన అధికారిక బ్లాగ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. రాత్రిపూట ఆలస్యంగా పని చేయడం వల్ల కలిగే అలసట కంటే, ఆ పని పూర్తి చేయడం వల్ల వచ్చే తృప్తి చాలా గొప్పదని పేర్కొన్నారు. తెల్లవారుజామున 4 గంటల వరకు షూటింగ్‌లో పాల్గొన్నప్పటికీ తన ముఖంలో ఏమాత్రం అలసట కనిపించకుండా ఎంతో ఉత్సాహంగా ఆ షెడ్యూల్‌ను పూర్తి చేసినట్లు బ్లాగ్‌లో రాసుకొచ్చారు.
సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి యాభై ఏళ్లకు పైగా అవుతున్నా? సెట్స్‌పైకి వస్తే అమితాబ్ ఒక కొత్త నటుడిలాంటి ఉత్సాహాన్ని ప్రదర్శిస్తారని ఆయనతో పనిచేసే దర్శకులు, తోటి నటులు తరచూ చెబుతుంటారు. సమయపాలన విషయంలో అమితాబ్ ను మించిన వారు లేరనడం అతిశయోక్తి కాదు. రాత్రంతా షూటింగ్‌లో పాల్గొన్నా? మరుసటి రోజు ఉదయమే దైనందిన కార్యక్రమాలలో నిమగ్నమవ్వడం ఆయనకున్న అద్భుతమైన జీవనశైలికి .. మానసిక దృఢత్వానికి అద్దం పడుతోంది. సాధారణంగా 60 ఏళ్లు దాటిన తర్వాత విశ్రాంతి జీవితాన్ని గడపాలని చాలా మంది భావిస్తారు.
కానీ బిగ్ బి మాత్రం రిటైర్మెంట్ అనే పదానికి తన నిఘంటువులో చోటు ఇవ్వకుండా పని చేస్తున్నారు. ప్రస్తుతం అమితాబ్ `కౌన్ బనేగా కరోడ్‌పతి` వంటి భారీ టెలివిజన్ షోలతో పాటు, పలు బాలీవుడ్ .. పాన్-ఇండియా చిత్రాలలో విలక్షణమైన పాత్రలతో దూసుకుపోతున్నారు. అమితాబ్ ఎనర్జీ లెవెల్స్ చూసి నేటితరం యువ నటీనటులు ఎంతో స్ఫూర్తిని పొందుతున్నారు. ఈ వయసులో కూడా అమితాబ్ బచ్చన్ పని పట్ల చూపిస్తున్న అంకితభావం కేవలం సినీ రంగానికే పరిమితం కాదు. ఏ రంగంలోనైనా విజయవంతంగా కొనసాగాలంటే నిరంతర శ్రమ, క్రమశిక్షణ ఎంత అవసరమో అమితాబ్ జీవితం యువతకు నేర్పుతోంది. శారీరక ఇబ్బందులు, వయోభారం వంటి సవాళ్లను అధిగమిస్తూ తెల్లవార్లూ కష్టపడి పనిచేసే ఆయన తత్వం సినీ అభిమానుల గుండెల్లో అమితాబ్ స్థానాన్ని మరింత సుస్థిరం చేస్తుంది.